ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆయన స్థానంలో మరో ముగ్గురు డీజీ స్థాయి అధికారుల పేర్లను సోమవారం లోగా ప్రతిపాదించాలంటూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈసీ లేఖ రాసింది.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ఆంధ్రప్రదేశ్ డీజీపీపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. తక్షణమే డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది.
ఆయన స్థానంలో మరో ముగ్గురు డీజీ స్థాయి అధికారుల పేర్లను సోమవారం లోగా ప్రతిపాదించాలంటూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈసీ లేఖ రాసింది.
డీజీపీని ఎన్నికల విధుల నుంచి తొలగించాలంటూ ఇప్పటికే పలుమార్లు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా సాగాలంటే ఆయన్ని తొలగించి మరో అధికారిని నియమించాలంటూ కూటమి నేతలు పలుమార్లు సీఈసీకి ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వచ్చిన రోజునే డీజీపీని బదిలీ చేయడం ఆసక్తిగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో మరో 8 రోజుల్లో ఎన్నికల పోలింగ్ జరగబోతోంది.
2019 ఎన్నికల్లో సైతం అప్పట్లో డీజీపీ, సీఎస్‌ని ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. ఈసారి కూడా ఐజీ స్థాయి అధికారితో పాటుగా పలువురు ఐపీఎస్ అధికారుల మీద ఈసీ చర్యలు తీసుకోగా, తాజాగా డీజీపీనే బదిలీ చేసింది.
జమ్మూ కశ్మీర్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్‌పై మిలిటెంట్లు చేసిన దాడిలో గాయపడిన జవాన్ మృతి చెందారు. ఫూంచ్ జిల్లాలోని షాసితార్ సమీపంలో శనివారం సాయంత్రం ఈ దాడి జరిగింది.
ఐదుగురికి బుల్లెట్ గాయాలైనట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది.
"సాయంత్రం 6:15 గంటలకు సైనికులు జరన్‌వాలి నుంచి వైమానిక దళం స్టేషన్ వైపు వెళుతుండగా ఈ దాడి జరిగింది" అని పీటీఐ వార్తాసంస్థ తెలిపింది.
ఆదివారం ఉదయం పూంచ్ జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశాయని, భద్రతా బలగాలు వాహనాలను తనిఖీ చేస్తున్నాయని వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదల కోసం ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
హమాస్ దగ్గర ఉన్న బందీలను విడిపించి, గాజాలో ఇజ్రాయెల్ దాడిని తాత్కాలికంగా నిలిపివేయడానికి ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తిత్వం చేస్తున్నాయి. హమాస్ ప్రతినిధులు ఈజిప్ట్ రాజధాని కైరోకు వెళ్లారు. శనివారం కైరోలో చర్చలు ప్రారంభమయ్యాయి.
తాజా సంధి ప్రతిపాదనను అధ్యయనం చేసిన తర్వాత తమ ప్రతినిధి బృందం సానుకూలంగా ఉన్నట్లు హమాస్ తెలిపింది. పాలస్తీనియన్ల డిమాండ్లను నెరవేర్చే విధంగా ఒక ఒప్పందం కావాలనుకున్నామని పేర్కొంది.
కాల్పుల విరమణ ఒప్పందం శాశ్వతమైనదా లేదా తాత్కాలికమైనదా అనేది ప్రధాన సమస్యగా కనిపిస్తోంది.
బందీల విడుదల కోసం యుద్ధానికి 40 రోజుల విరామం, ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేయడం తదితరాలు చర్చల్లో భాగంగా ఉన్నాయి.
అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ విలియమ్స్ బర్న్స్ మధ్యవర్తులకు సాయం చేయడానికి కైరోకు వెళ్లినట్లు బీబీసీ వార్తా భాగస్వామి సీబీఎస్ న్యూస్‌తో ఇద్దరు అమెరికా అధికారులు తెలిపారు.
ఖతార్‌కు అమెరికా సూచన
చర్చలు సంక్లిష్టంగా ఉన్నాయని, ఫలితం రావాలంటే మరికొన్నిరోజులు పడుతుందని ఒక విశ్వసనీయ సమాచారం బీబీసీతో తెలిపింది.
అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ కూడా చర్చలలో కీలకంగా వ్యవహరిస్తున్నారు, ఈ వారం ఆయన ఇజ్రాయెల్ వెళ్లి నెతన్యాహుని కలిశారు.
"గాజా ప్రజలకు, కాల్పుల విరమణకు మధ్య ఉన్నది హమాస్ మాత్రమే " అని బ్లింకెన్ అన్నారు.
హమాస్ కాల్పుల విరమణను తిరస్కరిస్తూనే ఉంటే, హమాస్ రాజకీయ నాయకత్వాన్ని బహిష్కరించాలని ఖతార్‌ను అమెరికా కోరినట్లు ఒక విశ్వసనీయం సమాచారం ఉందని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కథనాల కోసం ఈ పేజీని చూడండి.