You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కర్ణాటక: హెచ్‌డీ రేవణ్ణ అరెస్ట్, మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరణ

కర్ణాటకలో అశ్లీల వీడియో కేసులో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి హెచ్‌డీ రేవణ్ణను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

లైవ్ కవరేజీ

  1. చేతబడి పేరుతో ఇద్దరి సజీవ దహనం, నిందితుల్లో బాధితురాలి భర్త, కొడుకు

  2. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్‌పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  3. కర్ణాటక: హెచ్‌డీ రేవణ్ణ అరెస్ట్, మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరణ, ఇమ్రాన్ ఖురేషి, బెంగళూరు నుంచి బీబీసీ కోసం

    కర్ణాటకలో అశ్లీల వీడియో కేసులో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి హెచ్‌డీ రేవణ్ణను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

    మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ నివాసం నుంచి హెచ్‌డీ రేవణ్ణను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

    రేవణ్ణ మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

    గురువారం నాడు ఓ బాధిత మహిళ కుమారుడు, హెచ్‌డీ రేవణ్ణతో పాటు ఆయన సహచరులపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు.

    రేవణ్ణ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పేర్కొంటున్న అనేక మంది మహిళల్లో ఈ మహిళ కూడా ఉన్నారు.

    హెచ్‌డీ రేవణ్ణ మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కుమారుడు. కర్ణాటక ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు.

  4. రోహిత్ వేముల కులంపై ఎందుకింత వివాదం? పోలీసులు కోర్టుకు ఇచ్చిన నివేదికలో ఏముంది?

  5. ఒక దేశాన్ని కుదిపేసిన చిన్నారి హత్య: పెంపుడు తల్లిదండ్రులే ఆ బిడ్డను చంపేశారా, మిస్టరీ ఏంటి....

  6. పోలింగ్ శాతాల విడుదల ఎందుకంత ఆలస్యం అవుతోంది? ప్రతిపక్షాలు ఏమంటున్నాయి?

  7. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి

    తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రోహిత్ వేముల తల్లి రాధిక కలిశారు. రోహిత్ కేసును పునర్విచారణ చేస్తామని సీఎం హామీ ఇచ్చారని ఆమె తెలిపారు.

    సీఎంను కలిసిన తర్వాత ఆమె రిపబ్లిక్ వార్తాసంస్థతో మాట్లాడుతూ ''నా కొడుకు మృతిపై విచారణ జరిపించాలని అడిగితే, రోహిత్ దళితుడు కాదంటున్నారు. నేను దళితురాలినే నా కొడుకు దళితుడు కాడా?'' అని అన్నారు.

    గతంలో చేసిన విచారణ సరిగా జరగలేదని ఆమె ఆరోపించారు. మళ్లీ న్యాయమైన విచారణ జరిపిస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు.

    రోహిత్ సోదరుడు రాజా ఏఎన్ఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. '' రోహిత్ కేసును పునర్విచారణ చేస్తామని, దీనికోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని తెలంగాణ డీజీపీ ప్రకటించారు. ఇవాళ సీఎం రేవంత్‌కు వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం, రోహిత్ కేసుపై నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు'' అని అన్నారు.

    రోహిత్‌ వేముల హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పీహెచ్‌డీ స్కాలర్‌, 2016 జనవరి 17న హాస్టల్‌ గదిలో ఉరి వేసుకుని చనిపోయారు.

  8. ఇజ్రాయెల్ జైలులో పాలస్తీనా వైద్యుడు మృతి

    ఇజ్రాయెల్ జైలులో నాలుగు నెలలుగా నిర్బంధంలో ఉన్న పాలస్తీనా వైద్యుడు అద్నాన్ అల్-బుర్ష్ మరణించారని పాలస్తీనా ఖైదీల అసోసియేషన్ తెలిపింది.

    50 ఏళ్ల అద్నాన్ అల్-బుర్ష్, అల్ షిఫా ఆసుపత్రిలో ఆర్థోపెడిక్స్ విభాగం చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించేవారు.

    ఉత్తర గాజాలోని అల్ అవ్దా హాస్పిటల్‌లో అల్-బుర్ష్ తాత్కాలికంగా పనిచేస్తున్నప్పుడు ఇజ్రాయెల్ దళాలు ఆయనను అదుపులోకి తీసుకున్నాయి.

    జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా నిర్బంధంలోకి తీసుకున్న ఒక ఖైదీ మరణించినట్లు ఏప్రిల్ 19న ఇజ్రాయెల్ ప్రిజన్ సర్వీస్ ప్రకటన విడుదల చేసింది. ఆ ఖైదీనే అద్నాన్ అల్-బుర్ష్.

    ఇజ్రాయెల్ ప్రిజన్ సర్వీస్ దీనిపై తదుపరి సమాచారం ఇవ్వలేదు. అయితే, ఘటనపై దర్యాప్తు జరుగుతోందని తెలిపింది.

    అల్-బుర్ష్‌ను హత్య చేశారని, ఆయన మృతదేహం ఇప్పటికీ ఇజ్రాయెల్ ఆధీనంలోనే ఉందని పాలస్తీనా ఖైదీల అసోసియేషన్ ఒక ప్రకటనలో ఆరోపించింది.

  9. కర్ణాటక: హెచ్‌డీ రేవణ్ణ అరెస్ట్, మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరణ