రోహిత్ వేముల కేసు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన

రోహిత్ వేముల ఆత్మహత్య కేసుకు సంబంధించి తెలంగాణ పోలీసులు ఇచ్చిన నివేదికకు వ్యతిరేకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు నిరసనలు చేపట్టినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

లైవ్ కవరేజీ

  1. నంద్యాలలో పీవీ నరసింహారావు భారీ విజయం వెనుక ఏం జరిగింది?

  2. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  3. రోహిత్ వేముల కేసు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన

    రోహిత్ వేముల

    రోహిత్ వేముల ఆత్మహత్య కేసుకు సంబంధించి తెలంగాణ పోలీసులు ఇచ్చిన నివేదికకు వ్యతిరేకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు నిరసనలు చేపట్టినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    2016 నాటి ఈ కేసును ముగించాలంటూ తెలంగాణ పోలీసు డిపార్ట్‌మెంట్ ఒక నివేదికను సమర్పించింది.

    రోహిత్ వేముల కేసులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాల ఉల్లంఘన జరుగలేదంటూ మార్చి నెలలో పోలీసులు ముగింపు నివేదికను సమర్పించారు.

    రోహిత్ ఆత్మహత్య దురదృష్టకరమని, ఆయనను ఆత్మహత్యకు ఎవరూ పురికొల్పలేదంటూ పోలీసులు నివేదికలో పేర్కొన్నారని బీజేపీ అధికార ప్రతినిధి రచనా రెడ్డిని ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    రోహిత్ వేముల
    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  4. భారత్, జపాన్‌లకు విదేశీయులంటే గిట్టదని జో బైడెన్ ఎందుకన్నారు?

  5. పదేపదే ఇంటర్నెట్ షట్‌డౌన్లు.. కారణమేంటి?

  6. టీడీపీ బీసీ పునాదుల్ని జగన్ క్రమంగా ఆక్రమిస్తున్నారా? నారా లోకేశ్ ఏమన్నారు?

  7. ఆకు పసరుతో సొంతంగా వైద్యం చేసుకున్న ఒరంగుటాన్.. ఎప్పుడూ చూడని దృశ్యం ఇది..

  8. హెచ్‌డి దేవెగౌడ: అన్నం లేక పస్తులున్న రోజుల నుంచి ప్రధానమంత్రి పదవి దాకా..

  9. రాయ్‌బరేలి నుంచి పోటీ చేయనున్న రాహుల్ గాంధీ, మరి అమేఠీ నుంచి ఎవరు?

    రాహుల్ గాంధీ

    ఫొటో సోర్స్, ANI

    లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి నియోజకవర్గం నుంచి కూడా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పోటీ చేయనున్నారు.

    అంతకుముందు, ఈ స్థానం నుంచి సోనియా గాంధీ పోటీ చేసేవారు.

    రాహుల్ గాంధీ మూడుసార్లు అమేఠీ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. కానీ, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఆయన ఓడిపోయారు.

    కానీ, కేరళ రాష్ట్రంలోని వయనాడ్ నుంచి ఎంపీగా ఆయన లోక్‌సభకు వెళ్లారు. ఈసారి కూడా వయనాడ్‌లో రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు.

    గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కిశోరీ లాల్ శర్మ అమేఠీ లోక్‌సభ నుంచి పోటీకి దిగుతారని పార్టీ ప్రకటన విడుదల చేసింది.

    గాంధీ కుటుంబాలు అందుబాటులో లేనప్పుడు, కీలకమైన ఈ రెండు నియోజకవర్గాలను కిశోరి లాల్ శర్మనే దగ్గరుండి చూసుకునేవారు.

    అయితే, గాంధీ కుటుంబం నుంచి ఎవరూ అమేఠీలో పోటీకి దిగకపోవడం 1999 తర్వాత ఇదే తొలిసారి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  10. ‘నా గదిలో భూతాలు ఉన్నాయి’ అంటూ చిన్నారి కేకలు, ఏంటా అని చూస్తే..

  11. గాజా సంక్షోభం: ఇజ్రాయెల్‌తో వాణిజ్యాన్ని నిలిపేసిన తుర్కియే

    తుర్కియే

    ఫొటో సోర్స్, Getty Images

    గాజాలో మానవతా సంక్షోభం తీవ్రమవుతుండటంతో తుర్కియే కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌తో అన్ని రకాల వాణిజ్య సంబంధాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.

    ‘‘ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న అన్ని రకాల ఎగుమతి, దిగుమతి లావాదేవీలను నిలిపివేస్తున్నాం. అన్ని రకాల ఉత్పత్తులకూ ఇది వర్తిస్తుంది’’ అని తుర్కియే తెలిపింది.

    గాజాలోకి ఎలాంటి అంతరాయాలు, అవాంతరాలు లేకుండా మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ అనుమతించేంత వరకు ఈ చర్యలు కొనసాగుతాయని తుర్కియే వాణిజ్య శాఖ చెప్పింది.

    గతఏడాది ఈ రెండు దేశాల మధ్య దాదాపు 7 బిలియన్ డాలర్ల (సుమారు రూ.58,344 కోట్లు) లావాదేవీలు జరిగాయి.

    అయితే, తుర్కియే అధ్యక్షుడు ఎర్దొవాన్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఆరోపించారు.

    ఎర్దొవాన్ తుర్కియే ప్రజల, వ్యాపారవేత్తల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలను పక్కన పెడుతున్నారని ఇజ్రాయెల్ కాట్జ్ అన్నారు.

  12. వెస్ట్ బ్యాంక్‌లో ఎనిమిదేళ్ల బాలుడి హత్య, ఇజ్రాయెల్‌పై యుద్ధ నేరాల ఆరోపణలు.. అసలేం జరిగింది?