SRHvsRR: సన్‌రైజర్స్ హైదరాబాద్ 201/3

ఈ సీజన్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడుసార్లు 260, లేదా అంతకంటే ఎక్కువ స్కోరును చేయగా, రాజస్థాన్ రాయల్స్ కేవలం ఒక్కసారి మాత్రమే ప్రత్యర్థికి 200 పరుగులు కోల్పోయింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. SRHvsRR: సన్‌రైజర్స్ హైదరాబాద్ 201/3, నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత ఇన్నింగ్స్

    నితీశ్ కుమార్ రెడ్డి

    ఫొటో సోర్స్, Getty Images

    హైదరబాద్ వేదికగా జరుగుతోన్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 201 పరుగులు చేసింది.

    దీంతో రాజస్థాన్ రాయల్స్‌కు 202 పరుగుల లక్ష్యం ఎదురైంది.

    తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి 42 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో అజేయంగా 76 పరుగులు చేశాడు.

    జట్టు స్కోరు 35/2 ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన నితీశ్ కుమార్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

    అతను 30 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో అర్ధసెంచరీ చేశాడు.

    ట్రావిస్ హెడ్ (58) అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన క్లాసెన్ చెలరేగాడు.

    క్లాసెన్ 19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 42 పరుగులు చేశాడు.

  3. ఒసామా బిన్ లాడెన్: ఓ రాత్రి ఆ ఇంటికి అతిథిగా వచ్చి భోజనం చేసి వెళ్లిన రోజు ఏం జరిగింది?

  4. SRH vs RR:ట్రావిస్ హెడ్ అర్ధసెంచరీ, ఆ వెంటనే అవుట్

    హెడ్

    ఫొటో సోర్స్, ANI

    హైదరాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 15 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులు చేసింది.

    ఈ మ్యాచ్‌లో ఓపెనర్ ట్రావిస్ హెడ్ అర్ధసెంచరీ చేశాడు.

    హెడ్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్ధసెంచరీ అందుకున్నాడు. ఆ తర్వాత అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో ఒక భారీ సిక్సర్ బాదిన హెడ్ అతని బౌలింగ్‌లోనే అవుటయ్యాడు.

    తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి (50 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.

    ఆరంభంలో నెమ్మదిగా ఆడిన సన్‌రైజర్స్ పవర్‌ప్లేలో 2 వికెట్లు కోల్పోయి 37 పరుగులు చేసింది.

    అభిషేక్ శర్మ (12), అన్‌మోల్ ప్రీత్ సింగ్ (5) విఫలమయ్యారు.

    అవేశ్‌ ఖాన్ 2, సందీప్ శర్మ ఒక వికెట్ తీశాడు.

  5. SRH vs RR: సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టాస్ గెలుపు, మొదట బ్యాటింగ్

    ట్రావిస్ హెడ్

    ఫొటో సోర్స్, AFP

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా హైదరాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగనున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలుపొందింది.

    హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు.

    ఈ సీజన్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడుసార్లు 260, లేదా అంతకంటే ఎక్కువ స్కోరును చేయగా, రాజస్థాన్ రాయల్స్ కేవలం ఒక్కసారి మాత్రమే ప్రత్యర్థికి 200 పరుగులు కోల్పోయింది.

    ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ మరోసారి భారీ స్కోరు చేస్తుందా? రాజస్థాన్ నిలువరిస్తుందా చూడాలి.

    జట్లు:

    సన్‌రైజర్స్ హైదరబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అన్‌మోల్ ప్రీత్, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాద్ అహ్మద్, మర్కో జెన్సన్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, టి. నటరాజన్

    రాజస్థాన్ రాయల్స్: యశస్వీ జైస్వాల్, సంజూ శామ్సన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, షిమ్రోన్ హెట్‌మైర్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, సందీప్ శర్మ, చహల్

  6. సీక్రెట్స్ ఆఫ్ ది నియాండర్తల్స్: 75 వేల ఏళ్లనాటి మహిళ ముఖాన్ని శాస్త్రవేత్తలు మళ్లీ ఎలా సృష్టించారంటే....

  7. మీ ఓటు మరొకరు వేస్తే ఏం చేయాలి?

  8. గాజువాక ఎన్నికలు ఎందుకంత ప్రత్యేకం?

  9. రిజర్వేషన్లపై మోదీ, రాహుల్ మధ్య మాటల యుద్ధం

    మోదీ, రాహుల్ గాంధీ

    ఫొటో సోర్స్, ANI

    రిజర్వేషన్ల అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

    ‘‘బీజేపీ ప్రభుత్వం గుడ్డిగా ప్రైవేటీకరణ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలను తీసేస్తూ దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల నుంచి రిజర్వేషన్లను రహస్యంగా లాగేసుకుంటుంది. 2013లో ప్రభుత్వ రంగంలో 14 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఉండేవి. 2023 వచ్చే నాటికి కేవలం 8.4 లక్షలే మిగిలాయి’’ అని రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా చెప్పారు.

    ‘‘బీఎస్‌ఎన్‌ఎల్, ఎస్ఏఈఎల్, బీహెచ్‌ఈఎల్ లాంటి పీఎస్‌యూలను ధ్వంసం చేస్తూ కేవలం ప్రభుత్వ రంగం నుంచే 6 లక్షల శాశ్వత ఉద్యోగాలను తీసేశారు. ఈ పోస్టులలో రిజర్వేషన్ ప్రయోజనాలు అందుబాటులో ఉండేవి’’ అని పేర్కొన్నారు.

    ‘‘రైల్వే వంటి సంస్థలలో ప్రభుత్వ పనులను కాంట్రాక్టులకు ఇస్తూ ఇంకెన్ని ఉద్యోగాలు తీసేశారో లెక్కే లేదు. మోదీ మోడల్ ఏంటంటే.. వెనుకబడిన వర్గాల నుంచి రిజర్వేషన్లను లాగేసుకోవడం ద్వారా దేశ వనరులను దొంగిలించడం’’ అని రాహుల్ ఆరోపించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ప్రధాని మోదీ ఏమన్నారంటే..

    ‘‘కాంగ్రెస్ పార్టీకి సవాలు చేస్తున్నాను. ఒకవేళ మీకు ధైర్యముంటే, మతాన్ని ఆధారంగా చేసుకుని ఎవరికీ రిజర్వేషన్ ఇవ్వబోమని ప్రకటించండి. వాళ్లు అలా చేయరు. ఎందుకంటే, ఏదో మతలబు ఉంది. మోదీ బతికున్నంత వరకు మతాన్ని ఆధారంగా చేసుకుని రిజర్వేషన్లు ఇచ్చే ఆటకు అనుమతి ఉండదు. ఎస్‌సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ గ్యారెంటీ రిజర్వేషన్లను పూర్తిగా సంరక్షించే బాధ్యత నాది. ఇది మోదీ గ్యారెంటీ’’ అని ఒక ప్రసంగంలో చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  10. పౌరసత్వ సవరణ చట్టం కింద భారత పౌరసత్వం కోసం ఎవరైనా దరఖాస్తు చేశారా, మోదీ ప్రభుత్వం ఏం చెబుతోంది?

  11. ఎన్నికలలో పోటీ చేస్తున్న అత్యంత ధనవంతులు వీరేనా? వీళ్ల ఆర్థిక మూలాలేమిటి? వ్యాపారాలేమిటి?

  12. క్రైస్తవంలోకి మారిన వ్యక్తి అంత్యక్రియలను స్వగ్రామంలో నిర్వహించడాన్ని వ్యతిరేకించిన కొందరు హిందువులు, ఆ తర్వాత ఏం జరిగింది?

  13. అమెరికాలో విద్యార్థుల నిరసనలు: టెక్సస్ విశ్వవిద్యాలయంలోకి పోలీసులు

    అమెరికా టెక్సస్ వర్సిటీ

    అమెరికాలో డాల్లస్‌లోని టెక్సస్ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల శిబిరాలను తొలగించడానికి పోలీసులు వర్సిటీలోకి ప్రవేశించారు.

    కాలేజీలో 150 నుంచి 200 మంది విద్యార్థులు నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతున్నారని బీబీసీ ప్రతినిధి టామ్ బాట్‌మన్ తెలిపారు.

    విద్యార్థులు అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లు తొలగించాలని, అవి వర్సిటీ నిబంధనలకు విరుద్ధమంటూ వర్సిటీ అధికారులు అంతకుముందు నిరసనకారులకు సూచించారు.

    విద్యార్థులు పట్టించుకోకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వర్సిటీలోకి చేరుకున్న పోలీసులు పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.

    గాజాలో ఇజ్రాయెల్ యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని పలు కాలేజీ క్యాంపస్‌లలో విద్యార్థులు గత కొన్నిరోజులుగా నిరసన తెలుపుతున్నారు. అమెరికా విద్యాసంస్థలు ఇజ్రాయెల్‌తో సంబంధాలను తెంచుకోవాలని, వారి కంపెనీల నుంచి అమెరికా వైదొలగాలంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.

    ఇదేక్రమంలో నిరసనలు ఒక్కొక్క వర్సిటీకి వ్యాపిస్తూ అమెరికా అంతటా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో వందలాది మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.

  14. తూర్పు పాకిస్తాన్‌ను బంగ్లాదేశ్‌గా మార్చిన యుద్ధంలో భారత పైలట్లు చివరి మూడు నిమిషాల్లో ఏం చేశారు