ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైఎస్సాఆర్సీపీ మేనిఫెస్టోను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేశారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్

ఫొటో సోర్స్, SANJAY DAS
ప్రభాకర్ మణి తివారి, కోల్‌కతా నుంచి
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెలికాప్టర్‌లో కూర్చోబోతూ కింద పడిపోయారు. ఎన్నికల ర్యాలీలో భాగంగా ఆమె దుర్గాపూర్ నుంచి అసన్‌సోల్‌కు వెళ్లే సమయంలో దుర్గాపూర్‌లో శనివారం ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో మమతా బెనర్జీకి పెద్దగా గాయాలు కాలేదు.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అధికారిక సమాచారం అందించింది.
ఈ సంఘటన జరిగినప్పటికీ, ఆమె రెండు ఎన్నికల ర్యాలీలలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ ప్రసంగాల్లో దీని గురించి ప్రస్తావించలేదు.
హెలికాప్టర్‌లో ఆమె కింద పడిపోయిన దృశ్యాలకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
నెలన్నర కిందట కూడా ఆమె తలకు గాయమైంది. కాళీఘాట్ నివాసంలో కింద పడిపోవడంతో మమతా గాయపడ్డారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, FB
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైఎస్సాఆర్సీపీ మేనిఫెస్టోను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేశారు.
తాడేపల్లిలోని వైఎస్సాఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జగన్ మేనిఫెస్టోలోని అంశాలను ప్రకటించారు.
మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు

ఫొటో సోర్స్, FB/BRS Party
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ హెడ్ క్వార్టర్స్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జెండా ఎగురవేశారు.
విజయాలకు పొంగిపోకుండా, అపజయాలకు కుంగిపోకుండా ప్రస్థానాన్ని కొనసాగిస్తామని ఆయన అన్నారు.
భవిష్యత్‌లోనూ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటామని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
ఆర్చరీ వరల్డ్ కప్‌లో భారత మహిళల జట్టు విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.
షాంఘైలో జరుగుతున్నఈ టోర్నీ కాంపౌండ్ విభాగంలో తెలుగు అమ్మాయి జ్యోతి సురేఖ సభ్యురాలిగా ఉన్న భారత బృందం చాంపియన్‌గా నిలిచింది.
టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్ కౌర్‌లతో కూడిన భారత జట్టు కాంపౌండ్ ఈవెంట్ ఫైనల్లో 178-171తో ఆరో సీడ్ ఇటలీ జట్టుపై గెలుపొందింది.
ఫైనల్ పోరులో భారత జట్టు కేవలం రెండుసార్లు మాత్రమే పర్ఫెక్ట్ 10 పాయింట్లను చేజార్చుకుంది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కథనాల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.