ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్ రావుకు రెడ్ కార్నస్ నోటీసులు జారీ చేయలేదన్న హైదరాబాద్ సీపీ
స్పెషల్ ఇంటెలిజెన్స బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు రెడ్ కార్నస్ నోటీసులు జారీ చేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అయితే, ప్రభాకర్ రావు ఎక్కడున్నారో ఇప్పటివరకు తెలియదని తెలిపారు.
లైవ్ కవరేజీ
ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ఎన్నికల వేళ, ఏమిటీ తాళిబొట్టు గోల...
బేరియాట్రిక్ సర్జరీ: బరువు తగ్గించుకునే ఆపరేషన్‌తో యువకుడి మృతి, అసలేం జరిగింది?
ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్ రావుకు రెడ్ కార్నస్ నోటీసులు జారీ చేయలేదన్న హైదరాబాద్ సీపీ

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం స్పెషల్ ఇంటెలిజెన్స బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు రెడ్ కార్నస్ నోటీసులు జారీ చేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అయితే, ప్రభాకర్ రావు ఎక్కడున్నారో ఇప్పటివరకు తెలియదని తెలిపారు.
''ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. ప్రభాకర్ రావుకి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయలేదు. ఊహాగానాలతో దర్యాప్తును ఇబ్బంది పెడుతున్నారు. రాజకీయ నేతల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతుంది. ప్రభాకర్ రావును పట్టుకోవడం లేదనేది అవాస్తవం. ప్రభాకర్ దర్యాప్తు అధికారులకు అందుబాటులోకి రాలేదు.సరైన సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసు వివరాలు వెల్లడిస్తాం'' అని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
కాగా, ఈ కేసులో నిందితులంతా చాలా స్మార్ట్‌గా, ఇంటలిజెంట్‌గా వ్యవహరించారని కమిషనర్ తెలిపారు.
''మా శక్తి మేరకు ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నాం. వ్యక్తిగత జీవితాలకు భంగం కలిగించేలా ట్యాపింగ్ చేశారు. అది పెద్ద నేరం. నలుగురు పోలీసు అధికారుల ప్రమేయం ఉంది, వారిని అరెస్ట్ చేశాం. ఈ కేసులో మరి కొంతమంది పోలీసులను సాక్షులుగా పెట్టి, వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేశాం'' అని కమిషనర్ చెప్పారు.
రుమటాయిడ్ ఆర్థరైటిస్: కాళ్లు, చేతులు వంకరపోయేలా చేసే ఈ వ్యాధి రావడానికి పొగ తాగడం ఓ కారణమా?
ముక్కుపుడక స్క్రూ ఊడి ఊపిరితిత్తుల్లోకి చేరిన ఘటన, చివరకు ఎలా బయటకు తీశారంటే...
దళిత్ హిస్టరీ మంత్: కులవ్యవస్థపై పూర్వీకులు చేసిన పోరాటాలు, వారు చేసిన త్యాగాల గురించి మనకేం తెలుసు?
ఐపీఎల్ 2024: దూకుడు మీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎలా చెక్ పెట్టింది?
ఈవీఎం-వీవీప్యాట్ల క్రాస్ చెకింగ్‌పై దాఖలైన పిటిషన్లను కొట్టేసిన సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్, ANI
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) ద్వారా నమోదైన 100 శాతం ఓట్లను ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్) స్లిప్పులతో సరిపోల్చాలని దాఖలైన అన్ని పిటిషన్లను శుక్రవారం సుప్రీం కోర్టు కొట్టివేసినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది.
అలాగే, బ్యాలెట్ పేపర్ ఓటింగ్ కోసం పిటిషనర్లు చేసిన డిమాండ్‌ను కూడా కోర్టు తోసిపుచ్చినట్లు కూడా వెల్లడించింది.
ఏఎన్‌ఐ పేర్కొన్న వివరాల ప్రకారం, ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత అభ్యర్థులు ఏడు రోజుల్లోపు తమ అభ్యంతరాలను తెలియజేయాలని కోర్టు పేర్కొంది.
అప్పుడు ఇంజినీర్ల బృందంతో ఈవీఎంల మైక్రోకంట్రోలర్ ప్రోగ్రామ్‌ను తనిఖీ చేయించవచ్చని తెలిపింది.
రాజీనామా లేఖతో గన్‌పార్క్ వద్దకు హరీశ్ రావు

హైదరాబాద్ గన్‌పార్క్, తెలంగాణలో పొలిటికల్ డ్రామాకు వేదికైంది.
ఆగస్టు 15 లోపు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లోని 13 హామీలూ, రైతులకు 2 లక్షల రుణ మాఫీ ఇస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరిన హరీశ్ రావు, ఇవాళ గన్ పార్కు దగ్గరకు వచ్చారు.
ఈ షరతులతో కూడిన రెండు పేజీల రాజీనామా లేఖను కూడా విడుదల చేశారు.
ఆయనతో పాటూ టీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు. గన్ పార్క్ దగ్గర అమరులకు నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడారు.

‘‘రేవంత్ రెడ్డికి దమ్ముంటే నా సవాల్‌ను స్వీకరించాలి. రావడానికి మొహమాటంగా ఉంటే తన పీఏతో అయినా స్టాఫ్‌తో అయినా రాజీనామా లేఖను పంపించాలి. ఆగస్టు 15 లోపు ఏక కాలంలో రుణ మాఫీ అమలు చేయాలి. ఆరు గ్యారెంటీలలోని 13 హామీలు అమలు చేయాలి. డిసెంబరు 9నే రుణ మాఫీపై కాంగ్రెస్ మాట తప్పింది. రేవంత్ మాట నిలబెట్టుకోవాలి’’ అని హరీశ్ రావు అన్నారు.
144 సెక్షన్ అమల్లో ఉందని నలుగురితో మాత్రమే ఇక్కడకు వచ్చినట్టు హరీశ్ పోలీసులతో చెప్పారు. అక్కడ కాసేపు నిరసన తెలిపారు బీఆర్ఎస్ నాయకులు.
టాంజానియాలో వరదలతో 155 మంది మృతి, ప్రభావితమైన 51 వేల కుటుంబాలు

ఫొటో సోర్స్, Getty Images
టాంజానియాలో భారీ వర్షాలు, వరదలతో 155 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని టాంజానియా ప్రధానమంత్రి కాసిమ్ మజాలివా వెల్లడించారు.
మే నెలలో కూడా వర్షాలు కొనసాగుతాయని కాసిమ్ హెచ్చరించారు. వరద ప్రభావిత ప్రాంతాలను వదిలివెళ్లాలని ఆయన ప్రజలను కోరారు.
‘‘రెండు లక్షల మంది, 51వేలకు పైగా కుటుంబాలు వరదలతో ప్రభావితం అయ్యాయి’’ అని కాసిమ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
టాంజానియా పొరుగు దేశాలైన కెన్యా, బురుండీలలో కూడా భారీ వర్షాల కారణంగా పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి.
‘‘జనవరి నుంచి ఇప్పటివరకు వర్షాలతో 155 మంది చనిపోయారు. 236 మంది గాయాల పాలయ్యారు. బలమైన గాలులు,వరదలతో దేశంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర నష్టం జరిగింది. పంట నష్టంతో పాటు రోడ్లు, రైల్వేలు కూడా దెబ్బతిన్నాయి’’ అని పార్లమెంట్‌లో కాసిమ్ మజాలివా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కథనాల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
ఎన్టీపీసీ-సింహాద్రి ప్లాంట్: దూరంగా ఉన్నవారికి వెలుగుల్ని, పక్కనే ఉన్న ఊరికి జబ్బుల్ని మిగిల్చిందా?
