లండన్ వీధుల్లో గుర్రాల బీభత్సం
లండన్ వీధుల్లో వేగంగా పరిగెత్తిన ఈ గుర్రాలు చాలా వాహనాలను ఢీకొట్టాయి. ఒక డబుల్ డెక్కర్ బస్సు విండ్ స్క్రీన్ కూడా బద్దలై కనిపించింది.
లైవ్ కవరేజీ
ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
లండన్ వీధుల్లో గుర్రాల బీభత్సం

ఫొటో సోర్స్, PA MEDIA
లండన్ వీధుల్లో బుధవారం ఉదయం కొన్ని గుర్రాలు బీభత్సం సృష్టించాయి.
సైన్యానికి చెందిన ఈ గుర్రాలను ఎట్టకేలకు పట్టుకున్నారు.
మొత్తంగా ఐదు గుర్రాలు బెదిరిపోయాయని, వీటిపై ఉన్న వారిలో నలుగురు సైనికులు కింద పడిపోయారని ఒక సైనిక అధికారి చెప్పారు.

బకింగ్హామ్ ప్యాలెస్‌కు సమీపంలోని ఒక భవన నిర్మాణ ప్రాంతం నుంచి వచ్చిన శబ్దాలకు ఈ గుర్రాలు బెదిరిపోయాయి.
లండన్ వీధుల్లో వేగంగా పరిగెత్తిన ఈ గుర్రాలు చాలా వాహనాలను ఢీకొట్టాయి. ఒక డబుల్ డెక్కర్ బస్సు విండ్ స్క్రీన్ కూడా బద్దలై కనిపించింది.
ఈ ఘటనల్లో గాయపడిన నలుగురిని ఆసుపత్రికి తరలించారు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆ తప్పు వల్లే గెలవలేకపోతోందా?
కేసీఆర్ కాన్వాయ్‌లోని వాహనాలకు ప్రమాదం

ఫొటో సోర్స్, UGC
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కాన్వాయ్‌లోని వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి.
మిర్యాలగూడ వెళ్తుండగా వేములపల్లి దగ్గర కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి.
ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంతో కేసీఆర్ తెలంగాణ అంతటా బస్సు యాత్ర చేస్తున్నారు.
తొలిరోజు ఆయన మిర్యాలగూడ, సూర్యాపేటలో పర్యటించారు.
బ్రాయిలర్ చికెన్ సంతాన సమస్యలకు దారితీస్తుందా? కొన్ని అపోహలు, వాస్తవాలు
కొటక్ మహింద్రా బ్యాంకుపై రిజర్వు బ్యాంకు ఆంక్షలు విధింపు

ఫొటో సోర్స్, ANI
మొబైల్ బ్యాంకింగ్ ఛానళ్లు, ఆన్‌లైన్ ద్వారా కొత్తగా కస్టమర్లను చేర్చుకోకుండా, క్రెడిట్ కార్డులను జారీ చేయకుండా కొటక్ మహింద్రా బ్యాంకుపై రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఆంక్షలు విధించింది.
తక్షణమే ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయని ఆర్‌బీఐ పేర్కొంది.
అయితే, ప్రస్తుత కస్టమర్లకు ఈ బ్యాంకు సేవలు కొనసాగుతాయని చెప్పింది.
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949లోని సెక్షన్ 35ఏ కింద అధికారాలను ఉపయోగించుకుని కొటక్ మహింద్రా బ్యాంకుపై ఆర్‌బీఐ ఈ ఆంక్షలు విధించింది.
2022, 2023 ఏళ్లలో రిజర్వు బ్యాంకు ఐటీ ఎగ్జామినేషన్‌లో పలు లోపాలను గుర్తించింది. ఈ లోపాలను సమగ్రంగా, సరైన సమయంలో పరిష్కరించడంలో బ్యాంకు విఫలమవుతూ వస్తోందని ఆర్‌బీఐ తన ప్రకటనలో పేర్కొంది.
ఐటీ ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, యూజర్ యాక్సస్ మేనేజ్‌మెంట్, వెండార్ రిస్క్ మేనేజ్‌మెంట్, డేటా సెక్యూరిటీ, డేటా లీక్ ప్రివెన్షన్ స్ట్రాటజీ, బిజినెస్ కంటిన్యుటి వంటి విషయాల్లో తీవ్రమైన లోపాలను గుర్తించినట్లు ఆర్‌బీఐ తన ప్రకటనలో తెలిపింది.
2014లో ప్రధాని మోదీ ‘చాయ్ పే చర్చ’ చేసిన గ్రామంలో రైతుల సమస్యలన్నీ తీరిపోయాయా, అక్కడి రైతులు ఏమంటున్నారు?
ఆళ్లగడ్డ: చనిపోయిందని తెలిసినా ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపించారు
నెజాక్ యూడా: ఇజ్రాయెల్ ఆర్మీలో అమ్మాయిలకు దూరంగా మసలే ఈ సైనికుల పటాలంపై అమెరికా ఆంక్షలు విధిస్తుందా?
వలసలు: కిడ్నాప్‌లు, డ్రగ్స్ ముఠాల నుంచి ప్రాణాలు కాపాడుకుంటూ ఎలా అమెరికాకు చేరుకుంటున్నారంటే...
ఎర్త్ రైజ్: 1968 నాటి ఈ ఫోటో ప్రపంచాన్నే మార్చేసింది..
లోక్‌సభ ఎన్నికలు: ఒకనాడు 400కు పైగా స్థానాలలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 300 స్థానాలలో మాత్రమే ఎందుకు పోటీ చేస్తోంది?
ఎర్రసముద్రంలో వలసదారుల పడవ బోల్తా, 33 మంది మృతి

ఫొటో సోర్స్, Mohamud Bulhan/BBC
ఫొటో క్యాప్షన్, ఎర్ర సముద్రంలో పడవ బోల్తా ఎర్రసముద్రం మీదుగా ప్రయాణిస్తున్న పడవ జిబౌటీ తీరం సమీపంలో బోల్తా పడటంతో ఎనిమిదేళ్ల బాలుడితో సహా 33 మంది ఇథియోపియన్ వలసదారులు మరణించారని స్థానిక అధికారులు బీబీసీకి తెలిపారు.
వీరంతా యెమెన్ నుంచి ఇథియోపియాకు వెళుతున్నారని ఐక్యరాజ్యసమితి వలస ఏజెన్సీ నివేదించింది. యెమెన్ నుంచి పయనమైన 77 మందిలో వీళ్లూ ఉన్నారని తెలిపింది.
మంగళవారం కొందరు వలస కూలీలు నీటిలో మునిగిపోవడాన్ని గమనించిన మత్స్యకారులు తీర రక్షక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది 20 మందిని రక్షించగలిగారు.
బాధితులను అక్కడి గొడోరియా పట్టణంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ప్రాణాలతో బయటపడిన వారిలో షాక్, భయం స్పష్టంగా కనిపించింది. చికిత్స అనంతరం బాధితులను ఐక్యరాజ్యసమితి మైగ్రేషన్ ఏజెన్సీ ఐఓఎమ్ ద్వారా ఇథియోపియాకు పంపారు.
సదరు వలసదారులు యెమెన్‌లోనూ బతుకు భారమవడంతో తిరిగి స్వదేశమైన ఇథియోపియా చేరుకోవడానికి పడవలో పయనమయ్యారని జిబౌటి కోస్ట్‌గార్డ్ సీనియర్ అధికారి ఇస్సే ఇయా తెలిపారు.
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
