ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
గాజాలో యుద్ధానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం అవుతుండటంతో అమెరికాలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
గాజాలో యుద్ధానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం అవుతుండటంతో అమెరికాలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
యేల్ విశ్వవిద్యాలయం, న్యూయార్క్ విశ్వవిద్యాలయాల్లో పదుల సంఖ్యలో ఆందోళనకారులను అరెస్టు చేశారు. కొలంబియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు తరగతి గదులకు రావడాన్ని రద్దు చేశారు.
యేల్ యూనివర్సిటీలో సోమవారం సాయంత్రం 47 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు చెప్పారు. అరెస్టు అయిన విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలకు సిఫార్సు చేయనున్నట్టు విశ్వవిద్యాలయం యాజమాన్యం తెలిపింది.
గాజాలో జరుగుతున్న యుద్ధానికి వ్యతిరేకంగా కొంతకాలంగా అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో వందల మంది విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నారు.

ఫొటో సోర్స్, Social media
మలేసియాలో ఘోర ప్రమాదం జరిగింది. రాయల్ మలేసియన్ నేవీ పరేడ్ కోసం సైనిక రిహార్సల్ చేస్తున్న రెండు హెలికాప్టర్లు గాలిలో ఢీకొన్న ఘటనలో పదిమంది చనిపోయారు.
ఒక హెలికాప్టర్ మరో హెలికాప్టర్ ఫ్యాన్ రెక్కలను ఢీకొట్టి, రెండూ నేలకూలినట్టు స్థానిక మీడియాలో ప్రసారమైన పుటేజ్ చూపుతోంది.
మలేసియాలో నౌకాదళ స్థావరమైన లుముత్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బతికి బయటపడలేదు.
ఏడుగురు ప్రయాణిస్తున్న HOM M503-3 హెలికాప్టర్ రన్నింగ్ ట్రాక్ పై కూలిపోయిందని భావిస్తున్నారు.
మరో ముగ్గురు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ M502-6 సమీపంలోని ఈతకొలనులోకి దూసుకుపోయింది.
స్థానిక కాలమాన ప్రకారం 9గంటల 50 నిమిషాలకు ఈ ఘటన జరిగినట్టు మలేసియా అగ్నిమాపక, రక్షణ దళం తెలిపింది.

ఫొటో సోర్స్, Perak Fire and Rescue Department

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, పోర్న్‌స్టార్‌కు డబ్బులు చెల్లించిన కేసులో సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించారని న్యూయార్క్‌లోని కోర్టులో విచారణ సందర్భంగా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఆయన కుట్ర చేశారని వ్యాఖ్యానించారు.
కామన్‌సెన్స్‌తో ఈ కేసును పరిశీలిస్తే ట్రంప్ దోషి అనే విషయం జ్యూరీకి అర్థమవుతుందని ప్రాసిక్యూటర్లు అన్నారు.
పోర్న్‌స్టార్‌కు డబ్బులు చెల్లించడానికి ట్రంప్ వ్యాపార రికార్డుల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు రాగా, ఆయన ఖండించారు.
2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు, పోర్న్‌స్టార్ నోరు మెదపకుండా ఉండేందుకు ఆమెకు ఇచ్చిన డబ్బును రికార్డుల్లో తారుమారు చేసి చూపించారని ట్రంప్‌పై ఆరోపణలు వచ్చాయి.
2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించారు.
ట్రంప్‌పై ఈ క్రిమినల్ కేసు విచారణ సందర్భంగా న్యూయార్క్ కోర్టు కిక్కిరిసిపోయింది. ట్రంప్ నిర్దోషి అని ఆయన తరఫు లాయర్లు వాదించారు.
ఈ కేసు విచారణను ఉద్దేశిస్తూ ఇది ఎన్నికల ప్రక్రియలో జోక్యంగా ట్రంప్ అభివర్ణించారు.
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి తన ప్రచారాన్ని ప్రభావితం చేసేందుకు ఈ కేసు పెట్టారని ఆయన అంటున్నారు.
ట్రంప్, తనతో లైంగిక సంబంధంలో పాల్గొన్నారని పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ ఆరోపించారు. ట్రంప్ ఈ ఆరోపణల్ని ఖండిస్తూ వస్తున్నారు.
ఈ అంశం గురించి స్టార్మీ నోరు మెదపకుండా ఉండేందుకు ట్రంప్ తరఫున ఆమెకు లక్షా ముప్పై వేల డాలర్లు ఇచ్చారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కథనాల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.
నిన్నటి లైవ్ పేజీ కోెసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.