ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం చీఫ్ రాజీనామా

ఇజ్రాయెల్‌పై అక్టోబరు 7నాటి హమాస్ దాడులను పసిగట్టడంలో విఫలం అయినందుకు బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం చీఫ్ రాజీనామా చేశారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. బీజేపీ, మోదీ, అమిత్ షాల గురించి పరకాల ప్రభాకర్‌ బీబీసీ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే..

  3. 1200 ఎకరాల భూమి.. 200 ఫ్లాట్లు.. భారీ కుంభకోణం ఆరోపణలు.. ఎవరీ నీరజ్ అరోరా?

  4. నెస్లే బేబీ ఫుడ్‌లో చక్కెరను అధికంగా కలుపుతోందా? పరీక్షల్లో ఏం తేలింది? ప్రభుత్వం ఎందుకు పట్టుకోలేకపోయింది?

  5. ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం చీఫ్ రాజీనామా

    ఇజ్రాయెల్

    ఫొటో సోర్స్, IDF

    ఇజ్రాయెల్‌పై అక్టోబరు 7 నాటి హమాస్ దాడులను పసిగట్టడంలో విఫలం అయినందుకు బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం చీఫ్ రాజీనామా చేశారు.

    తన తర్వాత ఈ పదవి చేపట్టబోయే నాయకుడు వచ్చేవరకు మాత్రమే మేజర్ జనరల్ అహరన్ హల్వియా ఈ పదవిలో కొనసాగుతారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) తెలిపింది.

    తనకు అప్పగించిన బాధ్యతలను తాను సరిగా నిర్వహించలేకపోయానని ఒక లేఖలో అహరన్ అంగీకరించారు.

    హమాస్ దాడి తర్వాత రాజీనామా చేసిన తొలి సీనియర్ నాయకుడు అహరన్.

    అక్టోబర్ 7న గాజా సరిహద్దుల వెంబడి వందల మంది హమాస్ సాయుధులు ఇజ్రాయెల్‌లోకి చొరబడి ప్రజలపై చేసిన ఆ దాడులకు ముందు చాలా సంకేతాలను పసిగట్టడంలో ఇజ్రాయెల్ సైనిక, నిఘా విభాగాలు విఫలం అయ్యాయి.

    నాటి దాడుల్లో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు, విదేశీయులు మరణించారు. 253 మందిని బందీలుగా హమాస్ సాయుధులు తీసుకెళ్లారు.

    అనంతరం గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు దాదాపు 34,000 మంది పాలస్తీనియన్లు మరణించారని స్థానిక అధికారులు చెబుతున్నారు.

  6. సూరత్‌: కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ రద్దు, బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన కలెక్టర్, అసలేం జరిగిందంటే..

  7. సూరత్: కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ, బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా గెలిచినట్లు ప్రకటన

    సూరత్ ఎంపీ

    ఫొటో సోర్స్, RUPESH SONAVANE

    గుజరాత్‌లోని సూరత్‌ ఎంపీగా బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.

    సూరత్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీ దాఖలు చేసిన నామినేషన్‌ ఎన్నికల అధికారులు తిరస్కరించారు. అనంతరం, బీజేపీ అభ్యర్థి మినహా మిగతా అభ్యర్థులందరూ తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

    ఇక పోటీలో ఎవరూ లేకపోవడంతో, బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్‌ను విజేతగా సూరత్ కలెక్టర్ ప్రకటించారు.

  8. చైనాలోని నగరాలు ఎందుకు కుంగిపోతున్నాయి?

  9. ముస్లింల గురించి ప్రధాని మోదీ కామెంట్స్.. తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్

  10. మాల్దీవులు: పార్లమెంట్ ఎన్నికల్లో ముయిజ్జు పార్టీకి మెజారిటీ

    మొహమ్మద్ ముయిజ్జు

    ఫొటో సోర్స్, Getty Images

    మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు నేతృత్వంలోని పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్‌సీ) పార్టీ పార్లమెంటులో మెజారిటీ సాధించింది.

    వార్తా ఏజెన్సీలు పీటీఐ, ఏఎఫ్‌పీ ప్రకారం, పార్లమెంట్‌లోని93 సీట్లలో ముయిజ్జు పార్టీ 60 కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకోగలిగంది.

    స్థానిక కాలమానం ప్రకారం, ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు దాదాపు రెండు లక్షల మంది బ్యాలెట్ పేపర్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని మాల్దీవుల ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో వెల్లడించింది.

    93 స్థానాల్లో 72.96 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

    ఓటు వేసిన వారిలో 1,04,826 మంది పురుషులు, 1,02,867 మంది మహిళలు ఉన్నారు. 93 స్థానాలకుగాను 130 మంది స్వతంత్రులు సహా 368 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

    నిరుటి సెప్టెంబర్‌లో మొహమ్మద్ సోలిహ్‌ను ఓడించి ముయిజ్జు దేశ అధ్యక్షుడయ్యారు.

    అయితే, ఇప్పటి వరకు మొహమ్మద్ సోలిహ్ పార్టీ అయిన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీకే పార్లమెంటులో మెజారిటీ ఉంది.

  11. క్యాండిడేట్స్ చెస్ టోర్నీ: గుకేశ్‌కు టైటిల్, వరల్డ్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు

    గుకేశ్

    ఫొటో సోర్స్, INTERNATIONAL CHESS FEDERATION

    ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన 17 ఏళ్ల దొమ్మరాజు గుకేశ్ విజేతగా నిలిచాడు.

    కెనడాలోని టొరంటోలో జరిగిన ఈ టోర్నీ ఓపెన్ విభాగంలో డి. గుకేశ్ 9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్‌ను అందుకున్నాడు. భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ టైటిల్‌ను గెలిచిన రెండో భారత ప్లేయర్‌గా గుకేశ్ ఘనత సాధించాడు.

    ఈ టైటిల్ విజయంతో వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఆడనున్న అతిచిన్న వయస్కుడిగా గుకేశ్ చరిత్ర సృష్టించాడు.

    క్యాండిడేట్స్ చెస్ టోర్నీ విజేతకు, వరల్డ్ చాంపియన్‌కు మధ్య ఈ టోర్నీ జరుగుతుంది. కాబట్టి వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్ కోసం ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్‌ (చైనా)తో గుకేశ్ తలపడతాడు.

    సోమవారం ఉదయం జరిగిన 14వ రౌండ్ గేమ్‌లో అమెరికా గ్రాండ్ మాస్టర్ హికారు నకమురాతో గుకేశ్ తలపడ్డాడు. ఈ గేమ్ ‘డ్రా’గా ముగిసింది.

    గ్రాండ్ మాస్టర్లు ఇయాన్ నెపోంనియాచి, ఫాబియానో కరువానా మధ్య జరిగిన గేమ్ కూడా డ్రాగా ముగియడంతో గుకేశ్ గెలుపు ఖాయమైంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  12. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కథనాల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

  13. ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం చీఫ్ రాజీనామా