కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌పై ఎఫ్ఐఆర్
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కర్నాటక డిప్యూటీ సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌పై ప్రాథమిక విచారణ నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదైంది.
లైవ్ కవరేజీ
ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌పై ఎఫ్ఐఆర్

ఫొటో సోర్స్, Getty Images
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కర్నాటక డిప్యూటీ సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌పై ప్రాథమిక విచారణ నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదైంది.
ఒక హౌసింగ్ సొసైటీలో ప్రజలు ఓట్లు వేస్తే మంచినీటిని సరఫరా చేస్తారని హామీ ఇచ్చినట్లు మొదట ఆయనపై కేసు నమోదైంది.
ఈ విషయాన్ని సోషల్ మీడియాలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వెల్లడించారు.
ఆర్ఎంసీ యార్డ్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఘటనకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అయిందని పీటీఐ వార్తా సంస్థ ఒక కథనం ప్రచురించింది. ‘‘సొసైటీలోని మొత్తం 6,424 ఓట్లు తమ అభ్యర్థికి పడితే, నీటి సమస్యను మూడు నెలల్లోగా పరిష్కరిస్తా’’ అని శివకుమార్ చెప్పినట్లు వీడియోలో కనిపిస్తోందని ఆ కథనంలో రాశారు.
ప్రస్తుతం ఆ నియోజకవర్గం (బెంగళూరు రూరల్) నుంచి శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ పోటీచేస్తున్నారు.
SRHvsDC: ఐపీఎల్‌లో మరోసారి రికార్డులు బద్దలు కొట్టిన సన్ రైజర్స్, 5 ఓవర్లకే 103 పరుగులు
హిట్లర్ కోరిక మేరకు ఆ తల్లులు కన్న వేలమంది 'ఆర్య పుత్రులు' ఏమయ్యారు?
మ్యాగ్నటిక్ ఫిషింగ్: ఇక్కడ గాలం వేస్తే బాంబులు, తుపాకులు, కత్తులు పడుతుంటాయి...ఏమిటా కథ?
సిగరెట్ తాగేవారి పక్కన ఉంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందా? పాసివ్ స్మోకింగ్ చేసే చేటు ఏమిటి?
హైదరాబాద్‌లో భారీ వర్షం..
వీడియో క్యాప్షన్, హైదరాబాద్‌లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం అయోధ్య రాముడి సూర్యతిలకం వెనుక ఉన్న సైన్స్ కథ ఇది..
ఎలాన్ మస్క్ భారత్ పర్యటన ఎందుకు వాయిదా పడింది?

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా వ్యాపారవేత్త, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా పడింది.
"దురదృష్టవశాత్తూ, టెస్లాకు సంబంధించి అత్యంత కీలకమైన బాధ్యతల కారణంగా భారతదేశ పర్యటన ఆలస్యం అవుతోంది" అని ఆయన X (ట్విటర్)లో తెలిపారు.
భారత్‌లో ప్రధాని నరేంద్ర మోదీని కలవబోతున్నానంటూ ఏప్రిల్ 10న ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.
ఏప్రిల్ 21, 22 తేదీల్లో ఆయన భారత్‌కు వస్తారని అందరూ భావించారు. రెండు రోజుల పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తారని, భారత్‌లో పెట్టుబడుల గురించి కీలక ప్రకటన చేస్తారని వార్తలు వచ్చాయి.
కానీ, ఆయన తన పర్యటనను వాయిదా వేసుకుంటున్నట్టు ఏప్రిల్ 20న ప్రకటించారు. ఈ ఏడాది చివర్లో భారత్‌ను సందర్శిస్తానని ఆయన చెప్పారు.
ఇరాన్, ఇజ్రాయెల్.. ఎవరి దగ్గర ఆయుధాలు ఎక్కువ?
హైదరాబాద్‌లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

ఫొటో సోర్స్, ANI
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
బంజారాహిల్స్, రాజేంద్రనగర్, తుర్కయాంజల్, సరూర్‌నగర్, నాగోల్, చంపాపేట, సైదాబాద్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, హిమాయత్ నగర్,అంబర్ పేటలో వాన జల్లులు పడ్డాయి.
అశోక్‌నగర్, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, రాంనగర్, అడిక్‌మెట్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, తార్నాక, ఓయూ క్యాంపస్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
పంజాబ్: సంగ్రూర్ జైలులో ఖైదీల మధ్య గొడవ, ఇద్దరి మృతి

ఫొటో సోర్స్, ANI
పంజాబ్‌లోని సంగ్రూర్ జైలులో శుక్రవారం రాత్రి ఖైదీల మధ్య జరిగిన గొడవలో ఇద్దరు చనిపోగా, మరో ఇద్దరికి గాయాలైనట్లు పోలీసులను ఉటంకిస్తూ వార్తాసంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది.
పోలీసులు చెప్పినదాని ప్రకారం, ఈ ఘటనలో గాయపడిన ఇద్దరు ఖైదీల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స కోసం పాటియాలాకు తరలించారు.
‘‘జైలు నుంచి మొత్తం నలుగురు రోగుల్ని ఈ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అందులో ఇద్దరు అప్పటికే చనిపోయారు. మరో ఇద్దరు విషమ పరిస్థితుల్లో ఉన్నారు. తదుపరి చికిత్స కోసం పాటియాలా ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పాం’’ అన డాక్టర్ కరణ్‌దీప్ కహేల్ చెప్పారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కథనాల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

