ఇరాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడి, అమెరికా అధికారుల వెల్లడి

ఇరాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడి జరిపినట్టు ఇద్దరు అమెరికా అధికారులు బీబీసీ అమెరికా భాగస్వామి సీబీఎస్‌ న్యూస్‌కు తెలిపారు.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

    ధన్యవాదాలు.

  2. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలో భారత్ నలిగిపోతోందా?

  3. లోక్‌సభ ఎన్నికలు 2024: తొలి దశలో ఎంత ఓటింగ్ నమోదైందంటే....

    సార్వత్రిక ఎన్నికలు

    తొలి దశ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం 21 రాష్ట్రాల్లో 102 సీట్లకు ఓటింగ్ జరిగింది.

    ఎన్నికల సంఘం అందించిన డేటా ప్రకారం, సాయంత్రం 5 గంటల వరకు 59.66 శాతం ఓటింగ్ నమోదైంది.

    ఇప్పటి వరకున్న డేటా ప్రకారం త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లో అత్యధిక సంఖ్యలో ఓట్లు నమోదయ్యాయి.

    పశ్చిమ బెంగాల్‌లో 77.75 శాతం ఓట్లు నమోదు కాగా, త్రిపురలో 76.10 శాతం రికార్డయింది.

    సాయంత్రం 5 గంటల వరకు బిహార్‌లో కేవలం 46.32 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైందని ఎన్నికల సంఘం డేటాలో తెలిసింది.

    తమిళనాడులో కూడా తొలి దశలోనే ఓటింగ్ జరిగింది. మొత్తం 39 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు 63.20 శాతం ఓటింగ్ నమోదైందని తమిళనాడు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సత్యప్రద సాహు తెలిపారు.

    అత్యధిక ఓటింగ్ ధర్మపురిలో 67.52 శాతం, అత్యల్పంగా సౌత్ చెన్నై నియోజకవర్గంలో 57.04 శాతంతో ఓటింగ్ నమోదైందని తెలిసింది. తమిళనాడులో అన్ని పోలింగ్ స్టేషన్లలో సాయంత్రం 6 గంటలకు ఓటింగ్ ముగిసింది.

  4. ఇరాన్‌పై ఇజ్రాయెల్ అర్ధరాత్రి మిసైల్ దాడి చేసిందా? అసలేం జరిగింది?

  5. లా నినా: తెలుగు రాష్ట్రాల్లో ఈసారి ఎక్కువ వర్షాలు కురుస్తాయా?

  6. ఏడాదిలో కురవాల్సిన వర్షం ఒక్క రోజే ఎందుకు కురిసింది?

    వీడియో క్యాప్షన్, దుబయ్‌ వరదలు: ఏడాదిలో కురవాల్సిన వర్షం ఒక్కసారే ఎందుకు కురిసింది?

    దుబయ్‌లో సగటు వర్షపాతం కన్నా భారీ వర్షం.. ఒక్క రోజులో కురిసింది.

    దీనికి క్లౌడ్ సీడింగే కారణమని కొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. కానీ వాస్తవం ఏంటి? నిపుణులు ఏమంటున్నారు?

  7. కంటి చికిత్సకు వెళ్లాలనుకున్న వీరప్పన్‌ను సినీ ఫక్కీలో పోలీసులు ఎలా బోల్తా కొట్టించారు? ఆఖరి క్షణాల్లో జరిగిన డ్రామా ఏంటి?

  8. ఓటు వేసిన అతి తక్కువ ఎత్తున్న మహిళ

    ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఎత్తున్న మహిళ తన ఓటు హక్కును వినియోగించుకున్నట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    నాగపూర్‌లో శుక్రవారం జ్యోతి ఆమ్గే అనే ఈ మహిళ ఓటు వేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. ఇజ్రాయెల్ - ఇరాన్‌: ఈ రెండు దేశాల మధ్య ఏం జరుగుతోంది?

  10. పాకిస్తాన్‌: జపాన్ జాతీయుల వాహనంపై దాడి: మిలిటెంట్, ఆత్మాహుతి బాంబర్ కాల్చివేత

    జపనీయుల వాహనంపై దాడి

    ఫొటో సోర్స్, Reuters

    పాకిస్తాన్‌లో ఐదుగురు జపాన్ జాతీయులు ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేసిన ఓ మిలిటెంట్‌ను, ఆత్మాహుతి బాంబర్‌ను పోలీసులు కాల్పి చంపారని రాయ్‌టర్స్ వార్తా సంస్థ తెలిపింది.

    ఈ ఘటనలో జపనీయులందరూ క్షేమమేని, వారిని సురక్షిత ప్రాంతానికి తరలించామని పోలీసుల ప్రతినిధి అక్బర్ హుస్సేనీ బలోచ్ చెప్పారు.

    అయితే ఈ దాడి తమ పనేనని ఏ మిలిటెంట్ సంస్థా ప్రకటించలేదు.

  11. ఎటువంటి నష్టం జరగలేదు : ఇరాన్

    ఇస్ఫాహాన్ నగరంలో ఎటువంటి నష్టం వాటిల్లలేదని ఆర్మీజనరల్ ను ఉటంకిస్తు ఇరాన్ మీడియా తెలిపింది. ‘‘ఇస్ఫహాన్ నగరలో భారీ శబ్దాలు వినిపించాయి. ఈ శబ్దాలు గగన తల రక్షణ వ్యవస్థ అనుమానిత వస్తువులపై చేసిన కాల్పుల కారణంగా ఏర్పడినవే’’ అని వివరించాయి.

    మరోపక్క ఇస్ఫహాన్ నగర సరిహద్దులకు ఆవల నుంచిగానీ, దేశంలోని ఇతర ప్రాంతాలలోగానీ ఎటువంటి గగన తల దాడులు జరగలేదని ఇరాన్ జాతీయ సైబర్ స్పేస్ సెంటర్ అధికార ప్రతినిధి హోస్సెన్ డల్లిరియాస్ ‘ఎక్స్’లో తెలిపారు.

    ఇజ్రాయెల్ క్వాడ్‌కాప్టర్స్ (డ్రోన్లు)ను ఎగరవేసేందుకు విఫలయత్నం చేసిందని, వాటిని తాము కూల్చివేశామని ఆయన తెలిపారు.

    ఇరాన్ మీడియా కూడా ఇదే విషయాన్ని చెబుతూ గగనతలంలో దూసుకొచ్చే వస్తువులను ధ్వంసం చేసేందుకు వీలుగా దేశంలోని పలు ప్రాంతాలలో గగన తల రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేశారని, ఇప్పటిదాకా ఎటువంటి పేలుళ్ళు జరిగినట్టు సమాచారం లేదని తెలిపింది.

    ఇస్ఫహాన్‌లోని అణు కేంద్రాలు సహా అన్ని స్థావరాలు సురక్షితంగా ఉన్నట్టు తెలిపింది.

  12. మణిపుర్‌లో ప్రశాంతంగా పోలింగ్

    మణిపుర్‌లో పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 2107 ప్రాంతాలలో పోలింగ్ ప్రారంభమైనట్టు చీఫ్ ఎలక్టోరల్ అధికారి ప్రదీప్ కుమార్ ఝా తెలిపారు. పరిస్థితి ప్రశాంతంగా ఉందని, ప్రజలు పెద్దసంఖ్యలో ఓటు వేయడానికి వస్తున్నారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. ఓటింగ్ సరళిని బట్టి చూస్తే పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ప్రదీప్ కుమార్ తెలిపారు.

  13. ఓటు వేసిన స్టాలిన్

    తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెన్నైలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  14. ఓటు వేసిన జగ్గీ వాసుదేవన్

    ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవన్ కోయంబత్తూరులో ఓటు వేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  15. మూడు డ్రోన్లను ధ్వంసం చేశాం : ఇరాన్ టీవీ

    ఇరాన్ సెంట్రల్ ప్రావిన్స్‌లోని ఇస్ఫహాన్ గగనతలంలో అర్థరాత్రి 12.30గంటల సమయంలో మూడు డ్రోన్లు కదలికలు కనిపించాయని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ వాటిని ధ్వంసం చేసిందని ఇరాన్ ప్రభుత్వ టీవీ తెలిపింది.

    ఇస్ఫహాన్ ఇరాన్‌కు అతిపెద్ద వైమానిక స్థావరం. ఇక్కడ క్షిపణు ఉత్పత్తి సముదాయం, అనేక అణుస్థావరాలు ఉన్నాయి.

  16. ఇజ్రాయెల్ క్షిపణి దాడి, వీడియోలు తీసిన ఇస్ఫాహాన్ ప్రజలు

    ఇరాన్‌లోని సెంట్రల్ ఇస్పహాన్ ప్రావిన్స్‌లో పేలుళ్ళ శబ్దానికి సంబంధించి స్థానిక ప్రజలు తీసిన వీడియోలను బీబీసీ పర్షియన్‌కు పంపారు. ఇస్పహాన్ ప్రావిన్స్‌లో పేలుళ్ళ శబ్దం వినిపించినట్టు ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది.

    బీబీసీ పర్షియన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు అయిన ఆ వీడియోలో యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ శబ్దాలు వినిపిస్తున్నాయి.

  17. ఇరాన్ పై ఇజ్రాయెల్ క్షిపణి దాడి, అమెరికా అధికారుల వెల్లడి

    ఇరాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడి జరిపినట్టు ఇద్దరు అమెరికా అధికారులు బీబీసీ అమెరికా భాగస్వామి సీబీఎస్‌ న్యూస్‌కు తెలిపారు.

    ఇరాన్ సెంట్రల్ ప్రావిన్స్ ఇస్ఫాహాన్ లో పేలుళ్ళు జరిగినట్టు ధృవీకరించని వార్తలను ఇరాన్ ప్రభుత్వ మీడియా ఉటంకించింది.

    ఉత్తర ఇజ్రాయెల్‌లో సైరన్‌లు మోగినట్టు ఇజ్రాయెల్ మిలటరీని ఉటంకిస్తూ రాయ్‌టర్స్ వార్తా సంస్థ తెలిపింది.

    దీనిపై ఈ సమయంలో వ్యాఖ్యానించలేమని ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది.

  18. చెన్నైలో రజనీకాంత్ ఓటు

    తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ చెన్నైలోని ఓ పోలింగ్‌బూత్‌లో ఓటు వేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  19. ఉతుపట్టిలో ఓటువేసిన అన్నామలై

    తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు, కోయంబత్తూరు నుంచి ఎంపీగా పోటీచేస్తున్న కె. అన్నామలై కరూర్ జిల్లాలోని ఉతుపట్టిలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన కోయంబత్తూరులో డీఎంకే అభ్యర్తి గణపతి పి. రాజ్‌కుమార్‌,ఏఐఏడీఎంకేకు చెందిన సింగై రామచంద్రన్‌‌తో పోటీ పడుతున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  20. లోక్‌సభ ఎన్నికలు: తొలి దశలో 102 స్థానాలకు పోలింగ్, బరిలో నిలిచిన ప్రముఖులు వీరే..