‘‘నా నిర్ణయాలు ఎవర్నీ భయపెట్టడానికి కాదు’’ – ప్రధాని నరేంద్ర మోదీ

‘‘దేశం ముందు 2024 ఎన్నికలున్నాయి. ప్రజల వద్ద ఛాయిస్ ఉంది’’ అని నరేంద్ర మోదీ అన్నారు.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

    ధన్యవాదాలు.

  2. రెండు లక్షల 25 వేలు పలికిన ఆరు రూపాయల సాధారణ కోడి గుడ్డు, ఎందుకు?

  3. ఐపీఎల్‌లో రికార్డు స్కోరు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్

    సన్‌రైజర్స్ హైదరాబాద్

    ఫొటో సోర్స్, ANI

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ 17లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరును నమోదు చేసింది.

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్, నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది.

    దీంతో తన సొంత రికార్డును తానే అధిగమించింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

    ఇదే సీజన్‌లో అంతకుముందు ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 ఓవర్లలో 277 పరుగులు చేసింది. అప్పటికి ఐపీఎల్‌లో అదే అత్యధిక స్కోరు. ఇప్పుడు తన రికార్డును తానే బ్రేక్ చేసింది సన్‌రైజర్స్ జట్టు.

    బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్‌సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.

    సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ 39 బంతుల్లోనే సెంచరీ చేశాడు. 41 బంతుల్లో 9 సిక్స్‌లు, 8 ఫోర్లతో 102 పరుగులు చేశాడు.

  4. ‘‘నా నిర్ణయాలు ఎవర్నీ భయపెట్టడానికి కాదు’’ – ప్రధాని నరేంద్రమోదీ

    ప్రధాని మోదీ

    ఫొటో సోర్స్, ANI

    ‘‘దేశం ముందు 2024 ఎన్నికలున్నాయి. ప్రజల ముందు ఛాయిస్ ఉంది’’ అని నరేంద్ర మోదీ అన్నారు. ఐదు నుంచి ఆరు దశాబ్దాలు కాంగ్రెస్ చేసిన పనులను, పదేళ్లలో బీజేపీ చేసిన పనిని చూడాలన్నారు.

    వార్తా సంస్థ ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ.. ‘‘2024, 2047 రెండూ వేరువేరు. రెండింటిన్నీ కలిపి చూడకూడదు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యాయి. 2047 నాటికి వందేళ్లు కూడా పూర్తవుతాయి. అందుకే, మనం వచ్చే 25 ఏళ్ల గురించి ఆలోచించాలి. 2024 ఎన్నికలు వచ్చే ఐదేళ్ల కోసం. ఎన్నికలను తక్కువ చేసి చూడకూడదు. వాటిని పండగలా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎన్నికల వాతావరణాన్ని పండగ వాతావరణంగా మలుచుకోవాలి’’ అని చెప్పారు.

    ‘‘దేశాన్ని నడిపించే బాధ్యత ఇచ్చినప్పుడు, మొత్తం దృష్టి దేశంపైనే ఉండాలి. వారి(విపక్షాల) దృష్టంతా కుటుంబాన్ని బలపరుచుకోవడంపైనే ఉంది. నా ఫోకస్ అంతా దేశాన్ని బలోపేతం చేయడంపైనే ఉంది. దేశం బలమైనదిగా మారితే, ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి లభిస్తుంది. నా నిర్ణయాలు ఎవర్నీ భయపెట్టడానికి కాదు’’ అని మోదీ అన్నారు.

    ‘‘నా నిర్ణయాలు దేశాభివృద్ధి కోసం తీసుకున్నవి. యువత కోసం తీసుకున్నవి. నేను చేయాలనుకున్నది అంతా ఇంకా పూర్తిచేయలేదు. చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ప్రతి కుటుంబ కలలు నెరవేర్చాలన్నది నా ఆకాంక్ష. అందుకే అంటున్నా, ఇప్పటి వరకు జరిగిందంతా ట్రైలర్ మాత్రమే. ఇంకా చేయాల్సింది చాలా ఉంది’’ అని మోదీ చెప్పారు.

    రెండు భాగాలుగా తాను పనులు చేస్తానని, ఒకటి బీజేపీ మేనిఫెస్టో పరంగా, మరొకటి తన విజన్ ప్రకారమని ప్రధాని మోదీ చెప్పారు.

  5. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి తర్వాత విమానాల రాకపోకలకు అంతరాయం

    ఎయిరిండియా

    ఫొటో సోర్స్, Getty Images

    ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసిన తర్వాత ఇజ్రాయెల్‌కు, దాని సమీప ప్రాంతాలకు ప్రయాణించే పౌర విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

    కొన్ని విమానయాన సంస్థలు సర్వీసులను తాత్కాలింగ్ రద్దు చేశాయి. మరికొన్ని విమానాల షెడ్యూళ్లను మారుస్తున్నాయి.

    ఇరాన్ దాడి తర్వాత శనివారం సాయంత్రం నుంచి ఇజ్రాయెల్ తన గగనతలాన్ని మూసివేసింది. ఆ తర్వాత ఆదివారం ఉదయం తన ఎయిర్‌స్పేస్‌ను తిరిగి ప్రారంభించింది.

    కానీ, టెల్ అవీవ్‌‌కు నడుపుతున్న విమానాలను ఏప్రిల్ 21 వరకు రద్దు చేస్తున్నట్లు బ్రిటన్‌కు చెందిన ఈజీ జెట్ తెలిపింది.

    ఆదివారం, సోమవారం టెల్‌ అవీవ్‌కు విమానాలను ఆపేసిన విజ్ ఎయిర్, రేపు (ఏప్రిల్ 16న) తిరిగి విమాన ప్రయాణాలను పునరుద్ధరిస్తామని తెలిపింది. కానీ, విమానాల రాకపోకల షెడ్యూల్‌లో మార్పులు ఉండొచ్చని ముందుగానే చెప్పింది.

    ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో టెల్ అవీవ్‌కు తాత్కాలికంగా విమానాలను నిలిపివేయాలని ఎయిరిండియా నిర్ణయించినట్లు ఎకనమిక్ టైమ్స్ తెలిపింది.

  6. ఇరాన్ ఎలా క్షిపణులను వదిలింది, ఇజ్రాయెల్ ఎలా అడ్డుకుంది?

  7. ఆంధ్రప్రదేశ్: బాలుడి శవాన్ని తల్లిదండ్రులు 8 కిలోమీటర్లు ఎందుకు ఎత్తుకెళ్లాల్సి వచ్చింది?

  8. ఇరాన్‌ దాడులకు 'సరైన సమయం'లో బదులిస్తామన్న ఇజ్రాయెల్

  9. టైటానిక్ ప్రమాదానికి 112 ఏళ్లు: ‘దేవుడు కూడా ముంచేయలేడు’ అనుకున్న ఓడ మునిగిపోవడం వెనుక అసలు రహస్యం ఏంటంటే..

  10. చక్కిలిగింత పెడితే ఎందుకు నవ్వొస్తుంది?

  11. ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమానికి బాటలు వేసిన తాబేలు వీడియోలో ఏముంది?

  12. లైఫ్ హ్యాపీగా ఉండాలంటే ఈ 7 సూత్రాలు పాటించండి

  13. 1967 యుద్ధం: అరబ్ నేలను నాశనం చేసిన ఆ ఆరు రోజుల్లో ఏం జరిగింది?

  14. దిల్లీ మద్యం పాలసీ కేసు : ఈనెల 23 వరకు కవిత కస్టడీ పొడిగింపు

    కవిత కస్టడీ పొడిగింపు

    ఫొటో సోర్స్, UGC

    దిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితను ఏప్రిల్ 23వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపుతూ దిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.

    దిల్లీ మద్యం పాలసీ కేసులో కవితను విచారించాలని, ఆమెను తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ చేసిన విజ్ఞప్తిపై ఈనెల 12న కోర్టు కవితను సీబీఐ కస్టడీకి మూడురోజులపాటు అప్పగించిన సంగతి తెలిసిందే. కస్టడీ గడువు ముగియడంతో సోమవారం ఉదయం సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచింది.

    ఈ సందర్భంగా కవిత విచారణకు సహకరించడం లేదని, మరింత సమయం కావాలని సీబీఐ కోరగా, ఈనెల 23వరకు కస్టడీని పొడిగిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఉత్తర్వులు జారీ చేశారు.

    దిల్లీ మద్యం పాలసీ కేసులో కవితను మార్చి 15న ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

  15. భారత్ త్వరలోనే అగ్రరాజ్యంగా అవతరిస్తుందా?

  16. భారతీయులను విడుదల చేయండి : ఇరాన్‌ విదేశాంగ మంత్రికి జైశంకర్ ఫోన్

    జై శంకర్

    ఫొటో సోర్స్, GETTY IMAGES

    ఇరాన్ ఇటీవల హార్మూజ్ జలసంధి గుండా వెళుతున్న ఓ వాణిజ్య నౌకను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అమీరాబ్డోలాహియన్ తో మాట్లాడారు.

    ఈ విషయాన్ని జయశంకర్ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా తెలిపారు.

    తమ సంభాషణలో ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఎంఎస్‌సీ ఏరిస్ వాణిజ్య నౌకలో ఉన్న 17మంది భారతీయ సిబ్బందిని విడుదల చేయాలని డిమాండ్ చేసినట్టు ఆయన పేర్కొన్నారు. అలాగే ఉద్రిక్తతలు మరింత పెరగకుండా, దౌత్య పద్ధతిలో సమస్యలు పరిష్కరించుకోవాలని నొక్కి చెప్పినట్టు తెలిపారు.

    ఇరాన్ శనివారంనాడు ఇజ్రాయెలీ కోటీశ్వరుడు ఇయాల్ ఓఫర్‌కు చెందిన వాణిజ్య నౌకను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ నౌకలోని మొత్తం నావికా సిబ్బందిలో 17మంది భారతీయులు ఉన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  17. తెలంగాణ: మేడిగడ్డ బరాజ్‌కుంగడంతో ఎండిపోతున్న మిడ్ మానేరు ప్రాజెక్ట్... దీని ప్రభావం హైదరాబాద్ తాగునీటిపై పడుతుందా?

  18. ఇరాన్‌పై ఏ రకమైన ప్రతిదాడిలోనూ అమెరికా జోక్యం చేసుకోదన్న బైడెన్

    అమెరికా

    ఫొటో సోర్స్, Reuters

    ఇరాన్ మీద ఏ రకమైన ప్రతిదాడిలోని అమెరికా పాల్గొనదని అమెరికా స్పష్టం చేసింది.

    రాత్రికి రాత్రే ఇజ్రాయెల్ మీద ఇరాన్ 300లకు పైగా డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసింది. సిరియాలో తమ కాన్సులేట్ కార్యాలయంపై ఇజ్రాయెల్ ఏప్రిల్ 1న చేసిన దాడికి ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు తెలిపింది.

    అయితే, ఇరాన్ ప్రయోగించిన దాదాపు అన్ని క్షిపణులు, డ్రోన్లను ఇజ్రాయెల్, అమెరికా, ఇతర మిత్రదేశాలు ఆకాశంలోనే ధ్వంసం చేశాయి. అవి లక్ష్యాలను చేరకుండా అడ్డుకున్నాయి.

    అయితే, దీనిపై ఎలా స్పందించాలనే విషయంలో ఇజ్రాయెల్ 'జాగ్రత్తగా' వ్యవహరించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సూచించారని వైట్‌హౌస్ అధికారులు చెప్పారు.

    వైట్‌హౌస్ సీనియర్ అధికారి ఆదివారం నాడు విలేఖరులతో మాట్లాడుతూ, 'ఇరాన్ దాడులపై ఎలా స్పందించాలనే విషయమై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు 'జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా ఆలోచించి' అడుగు వేయాలని బైడెన్ సూచించారు" అని అన్నారు.

    నెతన్యాహుతో బైడెన్ ఫోన్లో మాట్లాడారని, పరిస్థితులు నెమ్మదించేలా వ్యవహరించాలని సూచించారని ఆ అధికారి విలేఖరులతో అన్నారు.అయితే, ఇజ్రాయెల్ ప్రతిదాడి గురించి అమెరికా ఏమైనా తీవ్రమైన హెచ్చరికలు చేసిందా అన్న ప్రశ్నకు, "ఆచితూచి వ్యవహరించాల్సిన బాధ్యత ఇజ్రాయెల్‌దే" అని బదులిచ్చారు.