దిల్లీ మద్యం కేసులో కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్‌ అభ్యర్థనను తిరస్కరించిన రౌస్ అవెన్యూ కోర్టు

దిల్లీ మద్యం కేసులో మద్యంతర బెయిల్ కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  2. సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూసేందుకు నయాగరా జలపాతం వద్దకు ప్రజలు

    సంపూర్ణ సూర్యగ్రహణం, కెనడా, నయాగారా ఫాల్స్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

    సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూసేందుకు కెనడాలోని నయాగరా జలపాతం వద్దకు భారీ సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు.ఇంకా ఎక్కువ మంది వస్తారని భావిస్తున్నట్లు పార్క్ అధికారులు తెలిపారు.

    సూర్యగ్రహణాన్ని చూసేందుకు సందర్శకులు కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు. ఇక్కడ ఉష్ణోగ్రత పది డిగ్రీలు ఉంది. దీంతో అనేక మంది దుప్పట్లు, జాకెట్లు తెచ్చుకుంటున్నారు.

    అమెరికాలో డాలస్, ఇండియానా పొలిస్, క్లెవర్‌ల్యాండ్, బఫెలో నగరాల్లో సూర్యగ్రహణం హడావుడి ఎక్కువగా ఉంది.

    గ్రహణం సమయంలో చంద్రుడు, సూర్యుడి కంటే 400 రెట్లు ఎక్కువగా భూమికి దగ్గరగా వస్తాడు. అయితే సూర్యుడితో పోలిస్తే చంద్రుడు సూర్యుడి కంటే 400 రెట్లు చిన్నవాడు.

    చంద్రుడు- సూర్యుడికి, భూమికి మధ్యగా వచ్చినప్పుడు ఈ మూడూ ఒకే సరళరేఖ మీద ఉన్నప్పుడు చంద్రుడు సూర్యకాంతి భూమిపై పడకుండా అడ్డుకుంటాడు. అలా జరిగినప్పుడు మనం సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూడవచ్చు.

  3. సంపూర్ణ సూర్యగ్రహణం ప్రజల ఆలోచనా శక్తిని ప్రభావితం చేస్తుందా? అందరినీ ఏకతాటిపైకి తెస్తుందా?

  4. ఎన్నికల్లో సిరాజుద్దౌలా, ప్లాసీ యుద్ధంపై చర్చ ఎందుకు జరుగుతోంది?

  5. హైదరాబాద్‌: ‘యువకుడిని చంపి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్’.. మనుషులు ఎందుకింత క్రూరంగా మారతారు?

  6. ఇజ్రాయెల్-గాజా యుద్ధం: ఆరు నెలల విధ్వంసాన్ని ఆపేదెవరు... శాంతి స్థాపనకు అడుగడుగునా అడ్డంకులు ఎందుకు?

  7. గాజాలో సహాయ సిబ్బందిపై వైమానిక దాడి: ఇద్దరు సీనియర్ అధికారులను తొలగించిన ఇజ్రాయెల్ సైన్యం

    నెతన్యాహు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, నెతన్యాహు

    గాజాలో 'వరల్డ్ సెంట్రల్ కిచెన్' సహాయ సిబ్బంది మృతితో ఇజ్రాయెల్ నష్ట నియంత్రణ చర్యలు ప్రారంభించింది. ఘటనకు బాధ్యులను చేస్తూ ఇద్దరు సీనియర్ అధికారులను ఇజ్రాయెల్ సైన్యం తొలగించింది.

    ఏప్రిల్ 1న గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ముగ్గురు బ్రిటన్ పౌరులు, ఓ ఆస్ట్రేలియన్ సహా ఏడుగురు సహాయ సిబ్బంది చనిపోయారు. ఓ గోడౌన్ వద్ద వారు సాయాన్ని అందించి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో గాజాలో తమ కార్యకలాపాలు నిలిపివేస్తున్నామని వరల్డ్ సెంట్రల్ కిచెన్ ప్రకటించింది.

    ఇది యుద్ధంలో మానవతా సాయం అందిస్తున్న సంస్థలపై జరిపిన దాడి అని, ఈ దాడులకు ఇజ్రాయెల్ బాధ్యత వహించాలని డబ్ల్యూసీకే వ్యవస్థాపకుడు ఆండ్రూస్ డిమాండ్ చేశారు.

    చారిటీ లోగో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను డబ్ల్యూసీకే సహాయ సిబ్బంది ధరించారని పాలస్తీనా వైద్య వర్గాలు తెలిపాయి.

    ఈ ఘటనపై పూర్తిస్థాయి సమీక్ష చేస్తామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. తాజాగా ఇద్దరు సీనియర్ అధికారులను విధుల నుంచి తొలగించింది.

  8. అల్లు అర్జున్: 'తగ్గేదేల్యే' అంటూ గంగోత్రి నుంచి నేషనల్ అవార్డు దాకా 'పుష్ప' ప్రయాణం

  9. దిల్లీ మద్యం కేసులో కవిత మధ్యంతర బెయిల్‌కు కోర్టు నిరాకరణ

    కల్వకుంట్ల కవిత

    ఫొటో సోర్స్, KALVAKUNTLA KAVITHA/FACEBOOK

    దిల్లీ మద్యం కేసులో మద్యంతర బెయిల్ కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    ఆమెకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించినట్లు పేర్కొంది.

    తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున ఈనెల 16వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టులో కవిత పిటిషన్ వేశారు.

    దీనిపై విచారణ జరిపిన కోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

    దిల్లీ మద్యం కేసులో ఈడీ ఆమెను అరెస్ట్ చేసింది. తిహాడ్ జైలులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  10. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి అరెస్టు

    బీఆర్‌ఎస్ పార్టీ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్‌ను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు.

    డిసెంబరు 24 తెల్లవారుజామున రాహిల్ సహా మరో నలుగురు కారు(టీఎస్ 13 ఈటీ 0777)లో ప్రయాణిస్తుండగా, మితిమీరిన వేగంతో వెళ్లడంతో బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద ప్రమాదం జరిగింది.

    తర్వాత సీసీ కెమెరా ఫుటేజీలో పంజాగుట్ట పోలీసులు రాహిల్ కారులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

    ఆ తర్వాత రాహిల్ దుబయ్ వెళ్లిపోయారు. ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

    అలాగే ఇదే కేసులో రాహిల్ బదులుగా ఆరిఫ్ అనే వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. రాహిల్‌కు బదులుగా ఆరిఫ్‌ను అరెస్టు చేసి కేసును పక్కదోవ పట్టించారనే ఆరోపణలపై గతంలో పంజాగుట్ట ఇన్ స్పెక్టర్‌గా ఉన్న దుర్గారావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

    తాజాగా రాహిల్ దుబయ్ నుంచి తిరిగి రావడంతో పంజాగుట్ట పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.

  11. యుక్రెయిన్: జపోరియా న్యూక్లియర్ ప్లాంట్‌పై దాడితో ‘‘పెద్ద అణు దుర్ఘటన’’ ముప్పు పెరిగిందన్న యూఎన్

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, Getty Images

    యుక్రెయిన్‌లోని జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్‌పై జరిగిన కొత్త డ్రోన్ దాడి వల్ల ఒక పెద్ద అణు దుర్ఘటన ముప్పు పెరిగిందని ఐక్యరాజ్యసమితి న్యూక్లియర్ వాచ్‌డాగ్ సంస్థ హెచ్చరించింది.

    ఈ దాడి వెనుక యుక్రెయిన్ ఉందని చెప్పిన రష్యా ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారని వెల్లడించింది. రష్యా చేసిన ఈ ఆరోపణలను యుక్రెయిన్ ఖండించింది.

    ఆరు రియాక్టర్లతో కూడిన ఈ న్యూక్లియర్ ప్లాంట్ రష్యా నియంత్రణలో ఉంది.

    ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ (ఐఏఈఏ), ఇలాంటి దాడులకు వ్యతిరేకంగా పదే పదే హెచ్చరిస్తోంది.

    ఐఏఈఏచీఫ్ రాఫెల్ గ్రాస్సీ మాట్లాడుతూ, ‘‘ఆదివారం నాటి డ్రోన్ దాడి నిర్లక్ష్యంగా, న్యూక్లియర్ ప్లాంట్‌ను పరిగణనలోకి తీసుకోకుండా చేశారు. ఇప్పుడు అణు భద్రతకు ముప్పు పెరిగింది. ఈ దాడి, రియాక్టర్లను బలహీనంగా మార్చింది. దీనివల్ల తీవ్రమైన ముప్పు పెరిగింది’’ అని అన్నారు.

    దక్షిణ యిక్రెయిన్‌లోని జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్, యూరప్‌లో అతిపెద్ద ప్లాంట్.

    2022లో యుక్రెయిన్‌పై దాడి తర్వాత రష్యా ఈ ప్లాంట్‌ను స్వాధీనం చేసుకుంది.

  12. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్‌ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కథనాల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.