గాజాలో సాయానికి అనుమతించండి: ఇజ్రాయెల్‌కు ఐసీజే ఆదేశం
గాజా కరవు కోరల్లో చిక్కుకోనుందనే ఆందోళనల నడుమ అక్కడ ఆహారం, వైద్య సాయం అందించడానికి అనుమతించాలని ఇజ్రాయెల్‌ను ఐక్యరాజ్య సమితి అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
లైవ్ కవరేజీ
ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించిన ఐక్యరాజ్యసమితి ప్రతినిధి

ఫొటో సోర్స్, UN
ఫొటో క్యాప్షన్, కేజ్రీవాల్ అరెస్టుపై అడిగిన ప్రశ్నకు ఆంటోనీ గుటెర్రెస్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ బదులిచ్చారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ, అమెరికాల తర్వాత తాజాగా ఐక్యరాజ్యసమితి స్పందించింది.
భారత్‌లో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు, కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడంపై ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనీ గుటెర్రెస్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ దృష్టికి ఒక విలేకరి తీసుకొచ్చారు.
దీనిపై స్పందించిన స్టీఫెన్ డుజారిక్ ''ఎన్నికలు జరుగుతున్న ఇతర దేశాల మాదిరిగానే భారతదేశంలో కూడా రాజకీయ, పౌర హక్కులతో పాటు ప్రజలందరి ప్రయోజనాలను పరిరక్షించాలని మేం ఆశిస్తున్నాం'' అని అన్నారు.
భారత పార్లమెంట్ ఎన్నికల్లో స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాత వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు వేయగలరని ప్రపంచం ఆశిస్తున్నదని స్టీఫెన్ తెలిపారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి, తెరమరుగైన తెలుగు రాష్ట్రాల నేతలు, వారి వారసులు
గోల్డ్ రిఫైనరీలో భారత్ ప్రపంచ హబ్‌గా మారుతోందా?
అనంతపురం టీడీపీ కార్యాలయంపై కార్యకర్తల దాడి

ఫొటో సోర్స్, Tulasiprasad
ఫొటో క్యాప్షన్, టీడీపీ ఆఫీసులోని సామగ్రిని బయట వేసి నిప్పంటించారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గం టీడీపీ టికెట్‌ను దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌కు కేటాయించడంతో అక్కడి పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతపురం నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గం పార్టీ కార్యాలయంపై దాడి చేసింది. కార్యాలయంలోని సామగ్రిని బయట వేసి నిప్పంటించారు.

ఫొటో సోర్స్, Tulasiprasad
ఐదేళ్లుగా తెలుగుదేశం పార్టీ అనంతపురం నియోజకవర్గం కోసం అధినేత చంద్రబాబు ఆదేశాలనుసారం పని చేస్తుంటే, ఏమాత్రం సంబంధం లేని దగ్గుపాటి ప్రసాద్‌కు టికెట్ ఎలా కేటాయిస్తారని ప్రభాకర్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది.
పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని, మంటలను ఆర్పారు.
టిల్లు స్క్వేర్ రివ్యూ: టిల్లు, లిల్లీ మ్యాజిక్ పనిచేసిందా.. సిద్ధు మరో హిట్ కొట్టాడా?
కాంగ్రెస్‌లో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి, ప్రవీణ్ శుభం, బీబీసీ కోసం

ఫొటో సోర్స్, Congress
ఫొటో క్యాప్షన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కేశవరావు, విజయలక్ష్మి రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ కే.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు.
ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.
కొద్ది రోజులుగా కేకే పార్టీ మారుతున్నారనే ప్రచారం సాగింది.
మలి తెలంగాణ ఉద్యమం చివరి దశలో కేశవరావు కాంగ్రెస్ పార్టీని వీడి, అప్పటి టీఆర్‌ఎస్‌లో చేరారు.
ఆ పార్టీ తరపున ఆయన రెండు సార్లు రాజ్యసభ సభ్యుడు అయ్యారు.
కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మేయర్‌గా ఉన్నారు.
ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు.
ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ, కేశవరావు ఇంటికి వెళ్లి కలిసినప్పటి నుంచి ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం ఊపందుకుంది.
తాజాగా ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఎంపీ, ఎమ్మెల్యేగా గెలిచినా లెక్క చెప్పకపోతే ఇంటికే.. ఎందుకు?
ముఖ్యమంత్రి అరెస్టయితే జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపవచ్చా... చట్టం ఏం చెబుతోంది?
గాజాలో నిరంతర సాయానికి అనుమతించండి: ఇజ్రాయెల్‌కు ఐసీజే ఆదేశం

ఫొటో సోర్స్, Getty Images
గాజా కరవు కోరల్లో చిక్కుకోనుందనే ఆందోళనల నడుమ నిరంతర సాయం అందించడానికి అనుమతించాలని ఇజ్రాయెల్‌ను ఐక్యరాజ్య సమితి అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
అత్యవసర మానవతా సాయం అందించడానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే) ఇజ్రాయెల్ కు తెలిపింది.
అయితే సాయాన్ని అడ్డుకుంటున్నామనే ఆరోపణలు పూర్తిగా నిరాధరమైనవని ఇజ్రాయెల్ పేర్కొంది.
దక్షిణాఫ్రికా ఐసీజే వద్ద మోపిన మారణహోమ అభియోగాలను కూడా ఇజ్రాయెల్ తోసిపుచ్చింది.
సాయం అందించడంలో సమస్యలకు ఐక్యరాజ్య సమితే కారణమని ఇజ్రాయెల్ తెలిపింది.
గాజాలో మారణకాండను నిరోధించడానికి జనవరిలో అంతర్జాతీయ న్యాయస్థానం జారీచేసిన ఆదేశాలపై చర్యలు తీసుకోవాలని దక్షిణాఫ్రికా కోరిన నేపథ్యంలో కోర్టు తాజాగా ఈ ఉత్తర్వులు జారీచేసింది.
దక్షిణాఫ్రికాలో లోయలో పడ్డ బస్సు: 45 మంది మృతి
దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు లోయలో పడిన ఘటనలో 45 మంది మృతి చెందారు. కేవలం 8 ఏళ్ళ బాలిక మాత్రం తీవ్ర గాయాలతో బయటపడింది.
బోట్స్‌వానా రాజధాని గాబోరోనె నుంచి మోరియా పట్టణానికి బయల్దేరిన బస్సు మార్గ మధ్యంలో ఓ బ్రిడ్జిని ఢీకొని 165 అడుగుల లోతైన లోయలోకి పడి దగ్థమైంది.
బస్సు మామట్లకలా పర్వత ప్రాంతంలోని బ్రిడ్జిపైకి చేరిన తరువాత అదుపు తప్పినట్టు ఆఫ్రికన్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ఎస్‌ఏబీసీ తెలిపింది.
బస్సు శిథిలాల కింద చనిపోయినవారిని వెలికితీయడం సహాయ బృందానికి కష్టతరంగా మారింది.
ఘటనాస్థలానికి రవాణా మంత్రి సిందిస్వ్వై చికుంగ చేరుకున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని ఆమె తెలిపారు.

ఫొటో సోర్స్, Heidi Giokos
మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష

ఫొటో సోర్స్, AFP
మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌కు గుజరాత్‌లోని పాలన్‌పూర్ సెషన్స్ కోర్టు 20 ఏళ్ళ జైలు శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధించింది.
మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టుగా కట్టుకథ అల్లి, ఓ లాయర్‌ను అక్రమంగా ఇరికించారనే అభియోగాలు రుజువైన కేసులో ఆయనకు కోర్టు ఈ శిక్ష విధించింది.
బనాస్కాంఠా పోలీసులు ఓ లాయర్‌ను డ్రగ్స్ కేసులో అక్రమంగా ఇరికించారంటూ 1999లొ కేసు నమోదైంది. అప్పట్లో బనాస్కాంఠా ఎస్పీగా సంజీవ్ భట్ పనిచేస్తున్నారు.
2018లో స్టేట్ సీఐడీ నార్కోటిక్ డ్రగ్స్ , సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్(ఎన్‌డీపీఎస్) చట్టం కింద ఆయనను అరెస్ట్ చేశారు.
సంజీవ్ భట్‌కు జైలు శిక్ష పడటం ఇది రెండోసారి.
కస్టోడియల్ మరణంపై 2019లో జామ్‌నగర్ కోర్టు ఆయన్ను దోషిగా నిర్ధరించింది.
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
గాజాలో సాయానికి అనుమతించండి: ఇజ్రాయెల్‌కు ఐసీజే ఆదేశం
కెనడా: వాంకోవర్‌లో ఒక్క రోజే 2 వేల భూప్రకంపనలు.. ఎందుకు ఇలా?
