ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గురువారం ఉదయం 6:15 గంటల సమయంలో మోటార్‌సైకిల్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు, కర్ సేవా డేరా నిర్వాహకుడు బాబా తర్సేమ్ సింగ్‌పై కాల్పులు జరిపారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, UTTARAKHAND POLICE
ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉధమ్‌సింగ్ నగర్‌లోని నానక్‌మట్టా సాహిబ్ గురుద్వారాలో గురువారం ఉదయం ఒక డేరా చీఫ్ బాబా హత్యకు గురయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గురువారం ఉదయం 6:15 గంటల సమయంలో మోటార్‌సైకిల్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు, కర్ సేవా డేరా నిర్వాహకుడు బాబా తర్సేమ్ సింగ్‌పై కాల్పులు జరిపారు.
తీవ్రంగా గాయపడిన బాబా తర్సేమ్ సింగ్‌ను అక్కడివారు వెంటనే ఖతిమాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ఆయన అక్కడ మృతి చెందారు.
ఉదయం 6:15 గంటల సమయంలో ఇద్దరు తలపాగా ధరించిన వ్యక్తులు మోటారుసైకిల్‌పై మామూలు వేగంతో వచ్చి ఒక పెద్ద తుపాకీతో దూరం నుంచి బాబాపైకి రెండుసార్లు కాల్పులు జరిపారని మీడియాతో పోలీసు సూపరింటెండెంట్ మంజునాథ్ టీసీ చెప్పారు.
దాడి చేసిన వారి స్పష్టమైన చిత్రాలు సీసీటీవీలో రికార్డయ్యాయని ఆయన తెలిపారు.
8 బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఫొటో సోర్స్, ANI
పీలీభీత్ నుంచి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ గురువారం సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో ఒక భావోద్వేగ పోస్టును షేర్ చేశారు.
ఈ పోస్టును తన పార్టమెంటరీ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి రాశారు.
‘‘ఎంపీగా నా పదవీ కాలం ముగుస్తుంది. కానీ, పీలీభీత్‌తో నాకున్న అనుబంధం మాత్రం నా ప్రాణం పోయేదాకా ముగియదు. ఎంపీగా కాకపోతే, మీ కొడుకుగా నా జీవితాంతం మీకు సేవ చేస్తాను. ముందులాగానే మీకోసం నా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి’’ అని రాశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
‘‘సామాన్య ప్రజల స్వరాన్ని వినిపించేందుకు నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఈ పనిని ఎల్లవేళలా కొనసాగించాలని ఇవాళ నేను మీ ఆశీర్వాదం కోరుతున్నాను. దీని కోసం ఏం జరిగినా ఫర్వాలేదు’’ అని అన్నారు.
సిట్టింగ్ ఎంపీ అయిన ఆయనకు ఈసారి బీజేపీ టిక్కెట్ ఇవ్వలేదు. ఈ స్థానం నుంచి జతిన్ ప్రసాద్‌ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి ఈయన బీజేపీలో చేరారు.
అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నకాలంలో 2004 ఫిబ్రవరి 16న అప్పటికి 24 ఏళ్ల వయసున్న వరుణ్ గాంధీ భారతీయ జనతా పార్టీలో చేరారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలో ఒక వ్యక్తి నలుగుర్ని హత్య చేశాడు.
ఆయన చేసిన దాడిలో మరో ఐదుగురు గాయాల పాలయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ వ్యవహారంలో 22 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు రాక్‌ఫోర్డ్ సిటీ పోలీసు అధికారి తెలిపారు.
ఈ హత్యలకు కారణమేంటనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఘటనలో మరణించిన వారిలో 15 ఏళ్ల బాలిక, 63 ఏళ్ల వృద్ధురాలు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్‌లో కొత్త రికార్డులు సృష్టించింది. బుధవారం ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 277 పరుగులు సాధించి, ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరును సాధించిన జట్టుగా రికార్డులకెక్కింది.
అంతకుముందు ఐపీఎల్‌లో అత్యధిక స్కోరును సాధించిన టీమ్‌గా బెంగళూరు ఉండేది. 263 పరుగులతో ఈ రికార్డు ఆ జట్టు పేరిట ఉంది. దాదాపు పదేళ్ల తర్వాత ఆ రికార్డును సన్‌రైజర్స్ అధిగమించింది.
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మార్‌క్రమ్, హెన్రిచ్ క్లాసెన్‌లు బ్యాటింగ్‌లో రాణించడంతో సన్ రైజర్స్ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగుల భారీ స్కోరును సాధించింది.
తొలి ఏడు ఓవర్లలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ 100 పరుగులు సాధించింది. 10.2 ఓవర్లలో 150 పరుగులకు చేరుకుని, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా ఈ స్కోరు చేసిన తొలి జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ అవతరించింది.
14.4 ఓవర్లలో 200 పరుగులు.. 18.4 ఓవర్లలో 250 పరుగులు..ఇలా జట్టు వేగంగా స్కోరును ముందుకు నడిపించింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు ముంబై ఇండియన్స్ కూడా తీవ్రంగానే ప్రయత్నించింది. కానీ, 20 ఓవర్లకు ఐదు వికెట్లు నష్టపోయి 246 పరుగులే చేయగలిగింది.
18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి ట్రావిస్ హెడ్ రికార్డ్ సాధిస్తే , కొన్ని నిమిషాల్లో అదే జట్టుకు చెందిన అభిషేక్ శర్మ 16 బంతుల్లో ఈ రికార్డును బద్దలు కొట్టాడు.
ఈ మ్యాచ్‌లో సిక్సర్ల సంఖ్య కూడా ఎక్కువే. మొత్తం 38 సిక్సర్లు ఈ మ్యాచ్‌లో నమోదయ్యాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.