ఐపీఎల్ 2024: శుభ్‌మన్ గిల్‌కు రూ.12 లక్షల జరిమానా
ఐపీఎల్ 2024 టోర్నమెంట్‌లో భాగంగా, గుజరాత్ టైటాన్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌పై ఓటమి పాలైంది. గుజరాత్ టైటాన్స్ జట్టు నెమ్మదిగా ఆడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది.
లైవ్ కవరేజీ
ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
టైటానిక్ సినిమాలో రోజ్ ప్రాణాలను కాపాడిన తలుపు చెక్కకు వేలంలో రూ. 6 కోట్లు
రఘురామ్ రాజన్: ‘మోదీ హయాంలో భారత ఆర్థిక వృద్ధి రేటు చెబుతున్నంత గొప్పగా ఏమీ లేదు, మిశ్రమంగా ఉంది’
SRHvsMi: 18 బంతుల్లో ట్రావిస్ హెడ్ అర్ధసెంచరీ, 6 ఓవర్లకు సన్‌రైజర్స్ స్కోరు: 81/6
ఐపీఎల్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ధాటిగా ఆడుతున్నాడు.
హెడ్ 18 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేశాడు.
దీంతో సన్‌రైజర్స్ పవర్‌ప్లేలో వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది.
మయాంక్ అగర్వాల్ (11) అవుట్ కాగా, క్రీజులో ట్రావిస్ హెడ్ (59 బ్యాటింగ్), అభిషేక్ శర్మ (8 బ్యాటింగ్) ఉన్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన, సుజనాకు అవకాశం

ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది.
తెలుగుదేశం పార్టీ, జనసేనతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు.
ఇప్పటికే లోక్‌సభ ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన బీజేపీ తాజాగా అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.
అసెంబ్లీ అభ్యర్థులు
ఎచ్చెర్ల: ఎన్.ఈశ్వర్‌రావు
విశాఖ నార్త్: పి.విష్ణుకుమార్‌రాజు
అరకు: పంగి రాజారావు
అనపర్తి: ఎం.శివకృష్ణంరాజు
కైకలూరు: కామినేని శ్రీనివాసరావు
విజయవాడ వెస్ట్: సుజనా చౌదరి
బద్వేల్: బొజ్జ రోషన్న
జమ్మలమడుగు: సి.ఆదినారాయణరెడ్డి
ఆదోని: పీవీ పార్థసారథి
బాల్టిమోర్ బ్రిడ్జి ప్రమాదం: అర్ధరాత్రి, కరెంట్ పోయింది, నౌక కంట్రోల్ తప్పింది... రెండు నిమిషాల్లోనే విధ్వంసం
కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కుమార్తె వీణపై ఈడీ మనీలాండరింగ్ కేసు

ఫొటో సోర్స్, Getty Images
కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కుమార్తె వీణపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
వీణకు చెందిన ఐటీ సంస్థకు అక్రమ చెల్లింపుల కేసులో ఆమెతో పాటు ఇతరులపై కేసు నమోదు చేసినట్లు అధికారులను ఉటంకిస్తూ పీటీఐ పేర్కొంది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అమెరికాలో బ్రిడ్జ్ కూలిపోవడానికి కారణమైన నౌకలో భారతీయులు... దీనిపై కంపెనీ ఏమంటోంది?
ఐపీఎల్ 2024: శుభ్‌మన్ గిల్‌కు రూ.12 లక్షల జరిమానా

ఫొటో సోర్స్, ANI
ఐపీఎల్ టీమ్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది.
స్లో ఓవర్ రేటు విషయంలో శుభ్‌మన్ గిల్ ఈ జరిమానా పడింది.
ఐపీఎల్ 2024 టోర్నమెంట్‌లో భాగంగా, మంగళవారం జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైంది.
గుజరాత్ టైటాన్స్ జట్టు నెమ్మదిగా ఆడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది.
ఈ కారణంతో టీమ్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ రూ.12 లక్షలను జరిమానాగా చెల్లించాల్సి వచ్చింది.
ఈ మేరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ నోటీసు జారీ చేసింది. ‘‘ఇది టీమ్ తొలి తప్పు కాబట్టి, ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వారిపై కనీస జరిమానా విధిస్తున్నాం’’ అని చెప్పింది.
చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే)తో జరిగిన మ్యాచ్‌లో లక్ష్యాన్ని చేరుకోవడంలో గుజరాత్ టైటాన్స్ చతికిల పడింది. టీమ్ బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన కనబర్చలేకపోయారు.
20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 143 పరుగులు మాత్రమే చేయగలిగింది గుజరాత్ టైటాన్స్. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే జట్టు 206 పరుగులు చేసింది.
హాయ్!
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈలింక్‌పై క్లిక్ చేయండి.
