కవితకు ఏప్రిల్ 9 వరకు జ్యుడీషియల్ రిమాండ్

దిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీ ఇవాళ్టితో ముగియడంతో ఆమెను దిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు.

లైవ్ కవరేజీ

  1. అమెరికాలో బ్రిడ్జ్ కూలిపోవడానికి కారణమైన నౌకలో భారతీయులు... దీనిపై కంపెనీ ఏమంటోంది?

  2. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజీని ఈ రోజుకు ముగిస్తున్నాం.

    మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం..

    గుడ్ నైట్.

  3. ఆఫీసులోని తెల్ల కాగితం కూడా సొంతానికి వాడని 'భారత ప్రధాని'

  4. ఏపీ, తెలంగాణ: పార్లమెంటులో తెలుగు రాష్ట్రాల నుంచి మహిళా ఎంపీల సంఖ్య ఎందుకు పెరగడం లేదు?

  5. అమెరికాలో నౌక ఢీకొనడంతో కూలిన వంతెన, నదిలో పడిన వాహనాలు

    అమెరికాలో కూలిన వంతెన

    ఫొటో సోర్స్, StreamTimeLive

    ఫొటో క్యాప్షన్, అమెరికాలో నదిలో ప్రయాణిస్తున్న ఓడ ఢీకొనడంతో వంతెన కూలింది.

    అమెరికాలోని బాల్టిమోర్‌లో నౌక ఢీకొనడంతో వంతెన కూలింది. దీంతో వంతెనపై ఉన్న వాహనాలు నీటిలో పడిపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

    అమెరికాలోని పోటాస్కో నదిపై ఉన్న ఈ 'ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జి' పొడవు మూడు కిలోమీటర్లు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది.

    బాల్టిమోర్ బ్రిడ్జి ప్రమాదంలో 'అనేక మంది మరణించి ఉండవచ్చు' అని బాల్టిమోర్ అగ్నిమాపక శాఖ ప్రతినిధి ఒకరు అన్నారు.

    బ్రిడ్జ్ కూలిపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని బాల్టిమోర్ కౌంటీ ఎగ్జిక్యూటివ్ జానీ ఓల్‌జ్వెస్కీ తెలిపారు.

    అమెరికాలో కూలిన వంతెన

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, బాల్టిమోర్ బ్రిడ్జి (పాత చిత్రం)

    "పరిస్థితి గురించి తెలుసుకున్నాం, అగ్నిమాపక శాఖ, అత్యవసర కార్యకలాపాల సిబ్బందితో సంప్రదింపులు జరుపుతున్నాం" అని జానీ అన్నారు.

    స్థానిక కాలమానం ప్రకారం ఈ ఘటన రాత్రి 1.30 గంటలకు జరిగింది. 300 మీటర్ల పొడవున్న ఈ నౌక శ్రీలంకకు వెళుతోంది. దానిపై సింగపూర్ జెండా ఉంది.

  6. కేజ్రీవాల్ కేసుపై పారదర్శక విచారణ జరగాలి: అమెరికా

    అరవింద్ కేజ్రీవాల్

    ఫొటో సోర్స్, ANI

    దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌ అంశాలను అమెరికా నిశితంగా గమనిస్తోందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

    కేజ్రీవాల్ కేసుపై పారదర్శకంగా విచారణ జరపాలని తాము కోరుకొంటున్నట్లు అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి చెప్పారని రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది.

    కేజ్రీవాల్‌పై విచారణ పారదర్శకంగా జరగాలని జర్మనీ విదేశీ వ్యవహారాల శాఖ విడుదల చేసిన ప్రకటనపై భారత్ ఇప్పటికే ఘాటుగా స్పందించింది.

    “అలాంటి వ్యాఖ్యలను మా న్యాయప్రక్రియలో జోక్యంగా, మా న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేవిగా చూస్తాం” అని భారత విదేశీ వ్యవహారాలశాఖ స్పష్టం చేసింది.

    ఈ నేపథ్యంలో అమెరికా అడుగులు చర్చనీయాంశమయ్యాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ఆప్ నేతల నిరసన

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, కేజ్రీవాల్ అరెస్ట్‌ను నిరసిస్తూ దిల్లీలో ఆప్ నేతల ఆందోళన

    మద్యం విధానం కుంభకోణంతో ముడిపడిన మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని దిల్లీలో బీజేపీ ఆందోళన చేస్తోంది.

    కేజ్రీవాల్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ సచివాలయం వైపు కదిలిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

    ఇదే సమయంలో, కేజ్రీవాల్ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆప్ నేతలు కూడా నిరసనలు చేపట్టారు. వెంటనే కేజ్రీవాల్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  7. కవితకు ఏప్రిల్ 9 వరకు జ్యుడీషియల్ రిమాండ్

    కల్వకుంట్ల కవిత

    ఫొటో సోర్స్, KALVAKUNTLA KAVITHA/FACEBOOK

    దిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీ ఇవాళ్టితో ముగియడంతో ఆమెను దిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు.

    కేసు దర్యాప్తు నేపథ్యంలో ఆమెకు ఏప్రిల్ 9 వరకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    అయితే, ఇది మనీ లాండరింగ్ కేసు కాదని, పొలిటికల్ లాండరింగ్ కేసు అని కవిత వ్యాఖ్యానించారు. ఇది తప్పుడు కేసుగా చెప్పారు. క్లీన్‌గా బయటికి వస్తామన్నారు.

    కవిత వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కోర్టు ఏప్రిల్ 1న విచారించనుంది.

  8. క్యాన్సర్: వైద్యుల కంటికి కనిపించని ట్యూమర్లను గుర్తించిన ఏఐ పరికరం ‘మియా’

  9. చక్కెర కన్నా బెల్లం మంచిదా?

  10. పాకిస్తాన్: తుర్బత్ విమానాశ్రయానికి దగ్గర్లో తీవ్రవాదుల దాడి

    తీవ్రవాదుల దాడి

    ఫొటో సోర్స్, Getty Images

    పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌ తుర్బత్‌ వద్ద తీవ్రవాదులు దాడి చేశారు. ఇది ఇరాన్ సరిహద్దు ప్రాంతం.

    సోమవారం రాత్రి విమానాశ్రయానికి దగ్గర్లో ఈ దాడి జరిగినట్లు మక్రాన్ డివిజన్ కమిషనర్ సయూద్ ఇమ్రానీ చెప్పారు.

    నాలుగు నుంచి ఆరుగురు అటాకర్లు మూడు ప్రాంతాల నుంచి విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపారని, కానీ, నావల్ ఎయిర్‌బేస్‌ను వారు చేరుకోలేకపోయారని బీబీసీకి ధ్రువీకరించారు.

    సామాన్య ప్రజల మాదిరి తుర్బత్ విమానాశ్రయంలోకి అటాకర్లు ప్రవేశించారని, భద్రతా బలగాలు వారి కుట్రను గుర్తించి, ముందుకు వెళ్లకుండా వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారని క్వెట్టా సీనియర్ అధికారి చెప్పారు.

    నిషేధిత తీవ్రవాద సంస్థ బీఎల్ఏకు చెందిన మజీద్ బ్రిగేడ్ ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు చెప్పింది.

    వారం వ్యవధిలో బలూచిస్తాన్‌లో ఈ తీవ్రవాద సంస్థ జరిపిన రెండో దాడి ఇది.

    అంతకుముందు, గ్వాదర్ జిల్లాలో పోర్ట్ అథారిటీ కాంప్లెక్స్‌లో దాడి చేసింది.

  11. ఐపీఎల్: చెలరేగిన విరాట్ కోహ్లీ, పంజాబ్‌పై బెంగళూరు విజయం

    విరాట్ కోహ్లీ

    ఫొటో సోర్స్, Getty Images

    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 17 టోర్నమెంట్‌లో బోణీ కొట్టింది.

    బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించింది.

    పంజాబ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగా, బెంగళూరు 19.2 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది.

    విరాట్ కోహ్లీ తనదైన శైలిలో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 11 ఫోర్లు, 2 సిక్సులతో 49 బంతుల్లో 77 పరుగులు చేశాడు. అతడే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌’.

    ఐపీఎల్ టోర్నమెంట్‌లో భాగంగా ఇవాళ(మంగళవారం) రాత్రి 7.30కు చెన్నై సూపర్ కింగ్స్‌, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్‌ జరగనుంది.

  12. మాస్కో దాడి: రష్యాను ఇస్లామిక్ స్టేట్ శత్రువుగా ఎందుకు చూస్తోంది?

  13. హాయ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.