ప్రధాని నరేంద్ర మోదీపై ఎన్నికల సంఘానికి ఏపీ కాంగ్రెస్ ఫిర్యాదు
ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ వాహనాలు వినియోగించి, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది.
లైవ్ కవరేజీ
ఎలక్టోరల్ బాండ్స్: ఐటీ దాడులు, కొత్త కాంట్రాక్టులు, రాజకీయ పార్టీలకు విరాళాలు
ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజీ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం..
గుడ్ నైట్.
ప్రధాని నరేంద్ర మోదీపై ఎన్నికల సంఘానికి ఏపీ కాంగ్రెస్ ఫిర్యాదు

ఫొటో సోర్స్, Getty Images
ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ వాహనాలు వినియోగించి, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది.
పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో ఈనెల 17న జరిగిన బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారని, అక్కడికి రావడానికి ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలీకాప్టర్ వినియోగించారని ఫిర్యాదులో ఏపీసీసీ వార్ రూం కో చైర్మన్ సోమశేఖర్ వద్ది పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, PTI/Twitter
ఫొటో క్యాప్షన్, ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేస్తూ జతచేసిన పీటీఐ పోస్టు రాజకీయ నాయకులు ఎన్నికల ర్యాలీలకు ప్రభుత్వ వాహనాలు వినియోగించరాదనే నిబంధనలు ఉన్నాయని ఏపీ కాంగ్రెస్ ఫిర్యాదులో గుర్తుచేసింది.
తమ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవాలని, అంతేకాకుండా మరోసారి ఇలా ఎన్నికల ప్రచారం కోసం ప్రభుత్వ వాహనాలు వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను కోరింది.

ఫొటో సోర్స్, congress
ఫొటో క్యాప్షన్, ఏపీ కాంగ్రెస్ ఫిర్యాదు కాపీ పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
వ్లాదిమిర్ పుతిన్: రష్యా అధ్యక్షుడిని అత్యంత శక్తిమంతంగా మార్చిన ఆ మూడు కారణాలు ఇవే...
కేంద్ర మంత్రి పదవికి రాజీనామా: పశుపతి కుమార్ పరాస్

ఫొటో సోర్స్, ANI
కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి పశుపతి కుమార్ పారస్ తన పదవికి రాజీనామా చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బిహార్‌లో ఎన్డీయే సీట్ల పంపకంలో తమ పార్టీకి ఒక్క సీటు కూడా లభించకపోవడంతో ఆయన కేంద్ర మంత్రి పదవి నుంచి వైదొలిగారు.
‘‘వ్యక్తిగతంగా నాకు అన్యాయం జరిగింది. దాని కోసం నేను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశాను’’ అని తెలిపారు.
ఇకపై ఏం చేయాలన్న దానిపై పారస్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
సోమవారంనాడు ఎన్డీయే కూటమి బిహార్‌లో సీట్ల పంపకాలపై నిర్ణయం తీసుకుంది. బిహార్‌లో మొత్తం 40 సీట్లలో.. బీజేపీ 17 సీట్లలో, జేడీయూ 16 సీట్లలో, చిరాగ్ పాసవాన్ ఎల్‌జేపీ 5 సీట్లలో, ఉపేంద్ర కుష్వాహా, జితన్ రామ్ మాంఝీ పార్టీలు చెరొక సీటులో పోటీ చేయనున్నాయి.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మనిషి మెదడులోకి పురుగులు ఎలా వస్తాయి?
తెలంగాణ: తమిళిసై రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం, ఇంచార్జ్ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్

ఫొటో సోర్స్, Tamilisai/AIR
తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.
ఈ మేరకు రాష్ట్రపతి భవనం మంగళవారం ఒక ప్రకటన విడుదలైంది.
మరోవైపు తమిళిసై స్థానంలో కొత్త గవర్నర్ నియామకం అయ్యే వరకు ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ఒక ప్రకటన వెల్లడించింది.
డెంగ్యూ టీకా సిద్ధం చేసిన హైదరాబాద్ కంపెనీ ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్

ఫొటో సోర్స్, ANI
హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్(ఐఐఎల్) డెంగ్యూ టీకాను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది.
అంతా అనుకున్న ప్రకారం జరిగితే, ట్రయల్స్ పూర్తి చేసుకుని రెండేళ్లలో అంటే 2026 మధ్య వరకు ఈ టీకాను అందుబాటులోకి తెస్తామని ఐఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కే ఆనంద్ కుమార్ చెప్పారు.
ఈ టీకా తొలి దశ పరీక్షలు పూర్తయినట్లు కుమార్ తెలిపారు. త్వరలోనే రెండు, మూడు దశల పరీక్షలు మొదలవుతాయని చెప్పారు.
డెంగ్యూ టీకాను మాత్రమే కాక, జికా వైరస్, క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్(కేఎఫ్‌డీ) టీకాలను కూడా తయారు చేసే పనిలో ఉంది ఐఐఎల్.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 10 కోట్ల డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లో ఈ కేసుల సంఖ్య 3.5 కోట్లు.
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
