ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజీ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం..
గుడ్ నైట్.
దిల్లీలోని స్పెషల్ పీఎంఎల్ఏ (ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్) కోర్టు ఆదేశాలతో ఈ నెల 23వ తేదీ వరకు కవితను కస్టడీలోకి తీసుకున్నట్లు ఈడీ ఈ ప్రకటనలో వెల్లడించింది.
బీబీసీ తెలుగు లైవ్ పేజీ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం..
గుడ్ నైట్.

ఫొటో సోర్స్, KALVAKUNTLA KAVITHA/FACEBOOK
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రకటన విడుదల చేసింది.
దిల్లీ మద్యం పాలసీ కేసులో ఈ నెల 15న కవితను అరెస్టు చేసినట్లు ఈడీ పేర్కొంది.
దిల్లీలోని స్పెషల్ పీఎంఎల్ఏ (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్) కోర్టు అనుమతి మేరకు ఈ నెల 23వ తేదీ వరకు కవితను కస్టడీలోకి తీసుకున్నట్లు వెల్లడించింది.
మార్చి 15న కవిత ఇంట్లో సోదాలు నిర్వహించామని, ఆ సమయంలో ఆమె బంధువులు, అసోసియేట్స్ తమ విధులకు ఆటంకం కలిగించారని తెలిపింది.
మార్చి 17వ తేదీతో విడుదల చేసిన ప్రకటనను ఈడీ 18వ తేదీన వెబ్‌సైట్‌లో పోస్టు చేసింది.
''దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా తదితర ఆప్ సీనియర్ నేతలతో కలిసి కవిత దిల్లీ మద్యం పాలసీ రూపకల్పన, అమలులో అక్రమాలకు పాల్పడ్డారు. దీనికి బదులుగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు చెల్లించిన రూ.100 కోట్ల ముడుపులలో కవిత ప్రమేయం ఉంది. 2021-22 ఏడాదిలో మద్యం పాలసీని నిబంధనలకు విరుద్ధంగా రూపొందించారు. అనంతరం హోల్‌సేల్ డీలర్ల నుంచి వచ్చిన లాభాలను వాటాలుగా కవిత, ఆమె అసోసియేట్స్ పంచుకున్నట్లు దర్యాప్తులో తేలింది'' అని ఈడీ ఈ ప్రకటనలో తెలిపింది.
''ఈ కేసులో ఇప్పటివరకు హైదరాబాద్, ముంబయి, చెన్నై సహా 245 ప్రాంతాల్లో సోదాలు చేశాం. మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్‌తో పాటు మొత్తం 15 మందిని అరెస్టు చేశాం. రూ.128.79 కోట్ల ఆస్తులను జప్తు చేశాం” అని తెలిపింది.
కేసులో ఒక నేరాభియోగపత్రం, 5 అనుబంధ పత్రాలు దాఖలు చేసినట్లు ఈడీ తెలిపింది. కేసును ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది.

ఫొటో సోర్స్, ED

ఫొటో సోర్స్, Getty Images
అఫ్గానిస్తాన్‌లో పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడుల్లో ఎనిమిది మంది మహిళలు మరణించారని తాలిబన్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ దాడుల్లో పిల్లలు కూడా ఉన్నారని తెలిపింది.
పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని ఖోస్ట్, పక్తికా ప్రావిన్స్‌లలో నివసిస్తున్న పౌరుల ఇళ్లపై ఈ దాడులు చేశారని తాలిబాన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తెలిపారు.
స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:00 గంటలకు దాడులు జరిగాయని తెలిపారు. దీనిపై పాకిస్థాన్ ఇంకా స్పందించలేదు.
అయితే గుర్తుతెలియని మిలిటెంట్ల చేతిలో శనివారం ఏడుగురు పాకిస్తాన్ సైనికులు మరణించారు.
దీనిపై "కఠినంగా ప్రతిస్పందిస్తానని పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఇది జరిగింది.
దాడి చేసిన వారు ఎవరైనా, ఏ దేశం నుంచి వచ్చినా ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన అన్నారు.


ఫొటో సోర్స్, @DrTamilisaiGuv
తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు.
ఈ మేరకు రాజ్ భవన్ పుదుచ్చేరి ప్రకటించినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది.
తమిళిసై తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపినట్లు తెలంగాణ రాజ్‌భవన్ కూడా ఇవాళ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన సమాచారాన్నంతా కూడా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
బాండ్ కొనుగోలు చేసిన, రిడీమ్ చేసుకున్న వారి వివరాలను యూనిక్ ఆల్ఫాన్యూమరిక్ నెంబర్, సీరియల్ నెంబర్‌తో సహా అందివ్వాలని తెలిపింది.
తమ వద్దనున్న ఎలక్టోరల్ బాండ్లకు చెందిన సమాచారాన్నంతా బహిర్గతం చేసినట్లు చెబుతూ ఎస్‌బీఐ గురువారం సాయంత్రం లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని బ్యాంకు చైర్మన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. వారి వద్ద ఇంకెలాంటి సమాచారం లేదని తెలుపాలని పేర్కొంది.
ఈ వివరాలను బహిర్గతం చేయడంలో ఎస్‌బీఐ సెలక్టివ్‌గా ఉండకూడదని సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరించింది.
ఎస్‌బీఐ నుంచి పొందిన సమాచారాన్ని ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని కూడా సుప్రీంకోర్టు సూచించింది.
2019 ఏప్రిల్ 12కు ముందు కూడా కొనుగోలు చేసిన, రిడీమ్ చేసుకున్న ఎలక్టోరల్ బాండ్లను బహిర్గతం చేసేలా ఎస్‌బీఐకు ఆదేశాలు జారీ చేయాలని దాఖలైన అప్లికేషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ కు ఏకపక్ష విజయం దక్కే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా వెలువడిన ఫలితాల్లో ఆయనకు 87శాతానికి పైగా ఓట్లు దక్కినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
తాను ఐదోసారి అధ్యక్షపగ్గాలు చేపట్టడం ఖాయమనే విషయాన్ని పుతిన్ ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారు. ఎన్నికల అధికారుల ప్రకటన తరువాత పుతిన్ మాట్లాడుతూ రష్యా ప్రజాస్వామ్యం అనేక పశ్చిమ దేశాలలో కంటే పారదర్శకంగా ఉందని వ్యాఖ్యానించారు.
అయితే పుతిన్‌కు వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్ష నేతలెవరినీ ఎన్నికలలో పోటీచేయనీయలేదు.
రష్యాలో ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా సాగలేదని పశ్చిమదేశాలు ఆరోపించాయి.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.