ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం..
గుడ్ నైట్.
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన సమన్లపై స్టే ఇచ్చేందుకు సెషన్స్ కోర్ట్ ఆఫ్ రూస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది.
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం..
గుడ్ నైట్.

ఫొటో సోర్స్, ANI
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన సమన్లపై స్టే ఇచ్చేందుకు సెషన్స్ కోర్ట్ ఆఫ్ రూస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది.
ఈమేరకు వార్తాసంస్థ ఏఎన్ఐ ఎక్స్ వేదికగా తెలిపింది.
ఈడీ విచారణకు హాజరుకావడంలో మినహాయింపు కోసం ట్రయల్ కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని అరవింద్ కేజ్రీవాల్ తరఫు లాయర్లకు సూచించింది.
తమకు అందిన రెండు ఫిర్యాదుల ఆధారంగా అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది ఈడీ.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, KAVITHA/FB
తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయ్యారు. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఆమె ఇంట్లో శుక్రవారం ఈడీ సోదాలు జరిపింది. అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు.
ఈ కేసులో మరింత లోతుగా ప్రశ్నించేందుకు ఆమెను ఈడీ అధికారులు దిల్లీకి తీసుకువెళ్తున్నట్లు సంబంధిత వర్గాల నుంచి సమాచారం అందినట్లు ఏఎన్ఐ తెలిపింది.
ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నప్పుడు కవిత, ఆమె భర్త అనిల్ ఇంట్లోనే ఉన్నారు. అధికారులు వారి ఫోన్లతో పాటు, అక్కడ పని చేస్తున్నవారి ఫోన్లనూ స్వాధీనం చేసుకున్నారు.
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఇప్పటికే కవితను మూడు సార్లు విచారించింది. సీబీఐ కూడా చార్జిషీట్లో ఆమె పేరును చేర్చింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కవిత ఇంట్లో ఈడీ సోదాలకు నిరసనగా ఆమె నివాసం ముందు ధర్నా చేపట్టారు. బీజేపీ, ప్రధాని మోదీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఫొటో సోర్స్, KALVAKUNTLA KAVITHA/FACEBOOK
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది.
ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే కవిత ఇంటికి వచ్చి సోదాలు ప్రారంభించారు. ఆ సమయంలో కవిత, ఆమె భర్త అనిల్ ఇంట్లోనే ఉన్నారు.
అధికారులు వారి ఫోన్లతో పాటూ, అక్కడ పనిచేస్తున్న వారి ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
దిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే కవితను రెండు సార్లు విచారించింది ఈడీ. సీబీఐ కూడా చార్జ్‌షీట్లో ఆమె పేరు చేర్చింది.
మహిళా సిబ్బందితో సహా దాదాపు పదిమంది సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది.
కవిత న్యాయవాదులను సైతం లోపలికి అనుమతించలేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
“లోపల సెర్చ్ జరుగుతున్నందన, సోదాలు పూర్తయ్యేంత వరకూ లోపలికి అనుమతించలేమని అధికారులు చెప్పారు” అని కవిత తరఫు న్యాయవాదులు మీడియాతో చెప్పారు.
ఈడీ విచారణపై సుప్రీం కోర్టు ఆంక్షలు ఉన్నప్పటికీ, ఈడీ ఎందుకు వచ్చారో వారినే అడగాలని న్యాయవాదులు అన్నారు.
శుక్రవారం మధ్యాహ్నం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి.

ఫొటో సోర్స్, ANI
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఎలక్టోరల్ బాండ్స్ కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు మరో కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఎలక్టోరల్ బాండ్స్ యూనిక్ నెంబర్స్‌ను వెల్లడించాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇచ్చింది.
ఇందుకోసం మార్చి 17 ఆదివారం వరకు గడువు ఇచ్చింది.
ఎలక్టోరల్ బాండ్స్ యూనిక్ నెంబర్స్‌ను వెల్లడించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నోటీసులు జారీచేసింది.
ఈ నోటీసులకు సోమవారానికల్లా స్పందించాలని ఎస్‌బీఐ తరపు న్యాయవాది సంజయ్ కపూర్‌కు సుప్రీం ఆదేశించింది.
ఎలక్టోరల్ బాండ్స్‌కు సంబంధించిన నెంబర్లను ఎస్‌బీఐ వెల్లడించలేదని, ఇందుకు సంబంధించిన సమాచారం మొత్తాన్ని బ్యాంకు ఇవ్వాల్సిందేనని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదేశించారు.
అంతకుముందు ఈ కేసులో కపిల్ సిబాల్, ప్రశాంత్ భూషణ్ వానదలు వినిపిస్తూ మార్చి 14న ప్రచురితమైన ఎలక్టోరల్ బాండ్స్‌కు సంబంధించి ఆల్ఫాన్యూమరిక్ నెంబర్లను ఎస్‌బీఐ ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
కోర్టు ఆదేశాల మేరకు ఎస్‌బీఐ ఈ నెంబర్లను వెల్లడించాల్సిందేనని చెప్పారు.

ఫొటో సోర్స్, MIKHAIL KLIMENTYEV/Sputnik/AFP
రష్యాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. మూడు రోజులు అంటే ఆదివారం వరకు ఓటింగ్ జరగనుంది.
అయితే, ఈ ఎన్నికలు కేవలం లాంఛనప్రాయమేనని, వ్లాదిమిర్ పుతిన్ ఐదవసారి గెలిచే పూర్తి అవకాశాలు కనిపిస్తున్నాయి.
రష్యాలోని తూర్పు ప్రాంతమైన కమ్‌చట్కా ద్వీపకల్పంలో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రారంభమైందని వార్తా సంస్థ AFP తెలిపింది.
అంతకుముందు, దేశం కోసం ఈ కష్ట సమయంలో తనకు ఓటు వేయాలని అధ్యక్షుడు పుతిన్ గురువారం రష్యా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఈ ఎన్నికల్లో పుతిన్ గెలిస్తే 2030 వరకు ఈ పదవిలో కొనసాగుతారు.
2008, 2012 మధ్య నాలుగు సంవత్సరాల ప్రధానమంత్రి పదవీకాలాన్ని మినహాయించి, వ్లాదిమిర్ పుతిన్ 2000 నుంచి రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
మరోవైపు రష్యా ఎన్నికలు మొదలైన తరుణంలో సరిహద్దు ప్రాంతాల్లో ఉక్రెయిన్ భీకర దాడులకు దిగింది.
ఫిబ్రవరి 16న పుతిన్ రాజకీయ ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ జైలులో మరణించారు. 2020లో ఆయనపై విషప్రయోగం జరిగింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ విశేషాల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింకును క్లిక్ చేయండి.