ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రప్రదేశ్‌లోని పాలక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నియోజకవర్గ సమన్వయకర్తల తొమ్మిదో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో రెండు అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంటు స్థానానికి సమన్వయకర్తలను ప్రకటించారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
ఆంధ్రప్రదేశ్‌లోని పాలక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నియోజకవర్గ సమన్వయకర్తల తొమ్మిదో జాబితా విడుదల చేసింది.
ఈ జాబితాలో రెండు అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంటు స్థానానికి సమన్వయకర్తలను ప్రకటించారు.
నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా విజయసాయిరెడ్డిని నియమించారు.
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా విశ్రాంత ఐఏఎస్ ఇంతియాజ్‌ను నియమించారు.
మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జిగా మురుగుడు లావణ్య పేరు తాజా జాబితాలో ప్రకటించారు. ఇంతకుముందు ఈ నియోజకవర్గానికి గంజి చిరంజీవిని నియమించగా ఇప్పుడు ఆయన స్థానంలో లావణ్యను నియమించారు.
రామేశ్వరం కేఫ్ పేలుడుకు కారణం బాంబ్ అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విలేఖరులతో చెప్పారు.
దర్యాప్తు తరువాత పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.
బెంగళూరు నగరం వైట్‌ఫీల్డ్‌లోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన ఈ పేలుడులో 9 మంది గాయపడ్డారు.
క్షతగాత్రులను సమీప ఆసుపత్రిలో చేర్పించారు.
నిందితులకు శిక్ష పడుతుందని సిద్ధరామయ్య అన్నారు.
రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనపై రాజకీయాలు చేయడం మానుకోవాలని ప్రతిపక్షాలకు సీఎం సూచించారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి జహీరాబాద్ లోకసభ సభ్యులు బీబీ పాటిల్ రాజీనామా చేశారు.
పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావుకు ఆయన శుక్రవారం రాజీనామా లేఖను పంపారు.
జహీరాబాద్ ప్రాంతానికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు బీబీ పాటిల్ లేఖలో ధన్యవాదాలు తెలిపారు.
ఇవాళ ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది.
బెంగళూరు నగరం వైట్‌ఫీల్డ్‌లోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడులో పలువురు గాయపడ్డారు.
పీటీఐ వార్తాసంస్థ ప్రకారం పేలుడు కారణంగా కేఫ్‌లోని నలుగురు గాయపడ్డారు.
క్షతగాత్రులను సమీప ఆసుపత్రిలో చేర్పించారు.
ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని, మంటలు ఆర్పివేశాయని ఒక సీనియర్ పోలీసు అధికారి బీబీసీతో తెలిపారు.
ఘటన మధ్యాహ్నం 1:30 నుంచి 2 గంటల మధ్యలో జరిగిందని, ఆ సమయంలో లంచ్ కోసం కేఫ్‌లో జనం గుమిగూడి ఉన్నారని చెప్పారు. ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.
కాగా, పేలుడుకు గల కారణాలపై ప్రస్తుతం ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు.
(ఈ వార్త అప్‌డేట్ అవుతోంది)
పేటీఎం, దాని పేమెంట్స్ బ్యాంకు యూనిట్ మధ్యలో ఉన్న పలు అంతర్గత కంపెనీ ఒప్పందాలను రద్దు చేయాలని నిర్ణయించినట్లు శుక్రవారం పేటీఎం పేరెంట్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్ ప్రకటన జారీ చేసింది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు అంగీకరించినట్లు పేర్కొంది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మకు 51 శాతం వాటా ఉంది. ఇటీవలే ఆయన పేమెంట్స్ బ్యాంకు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.
పేటీఎం పేమెంట్స్ బ్యాంకు కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసేందుకు మార్చి 15 వరకు కంపెనీకి భారతీయ రిజర్వు బ్యాంకు గడువు ఇచ్చింది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంకు పదేపదే నిబంధనలను ఉల్లంఘిస్తుందని తాము విచారణలో గుర్తించినట్లు భారతీయ రిజర్వు బ్యాంకు తెలిపింది.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో బహుళ అంతస్తుల భవనంలో చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో 43 మంది చనిపోయారని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు.
గురువారం స్థానిక సమయం ప్రకారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఒక రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుందని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆ తర్వాత భవనమంతా మంటలు చెలరేగాయని తెలిపాయి. ఈ భవనంలో ఏడు అంతస్తులు ఉన్నాయి.
ఈ భవనంలో ఇతర రెస్టారెంట్లు, పలు బట్టల దుకాణాలు, మొబైల్ ఫోన్ షాపులున్నాయి.
ప్రస్తుతం మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.
మహిళలు,చిన్నారులతో సహా 33 మంది ఢాకా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో మరణించారని బంగ్లాదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సమంతా లాల్ సేన్ తెలిపారు.
నగరానికి చెందిన మెయిన్ బర్న్స్ ఆస్పత్రిలో మరో 10 మంది మృతి చెందారని చెప్పారు.
75 మందిని ఈ ప్రమాదం నుంచి కాపాడారు. డజన్ల కొద్దీ ప్రజలను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
‘‘మంటలు చెలరేగిన సమయంలో మేం ఆరవ అంతస్తులో ఉన్నాం. మెట్ల ద్వారా కిందకు వచ్చి ప్రాణాలతో బయటపడ్డాం’’ అని రెస్టారెంట్ మేనేజర్ సోహెల్ వార్తా సంస్థ ఏఎఫ్‌పీకి తెలిపారు.
పగిలిపోయిన కిటికీ నుంచి తాను తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నానని మరో వ్యక్తి మహ్మద్ అల్తాఫ్ చెప్పారు.
ప్రజలు బయటికి వెళ్లేందుకు సాయపడ్డ తన ఇద్దరు సహోద్యోగులు, మంటల్లో చిక్కుకుని చనిపోయారని చెప్పారు.
నమస్తే.
తాజా వార్తలను ఎప్పటికప్పుడు మీకందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.