తెలంగాణలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సీ విడుదల

వివిధ కేటగిరీలలో స్కూల్ అసిస్టెంట్స్, స్పెషల్ గ్రేడ్ టీచర్లు, భాషా పండితులు, పీఈటీల పోస్టులను ఈ డిఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తులను మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీవరకు స్వీకరిస్తారు. దరఖాస్తు రుసుము వెయ్యిరూపాయలుగా నిర్ణయించారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  2. జీడీపీ: మూడో క్వార్టర్‌లో అంచనాలకు మించి ఆర్థిక వృద్ధి సాధించిన భారత్

    జీడీపీ

    ఫొటో సోర్స్, Getty Images

    2024 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలకు మించి నమోదైంది.

    ప్రస్తుత త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 8.4 శాతం వృద్ధి నమోదు చేసింది. తయారీ, మైనింగ్, నిర్మాణ రంగాలు పుంజుకోవడంతో ఇది సాధ్యమైందని కేంద్ర గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) వెల్లడించింది.

    భారత జీడీపీ వృద్ధి 2023-24 మూడో క్వార్టర్‌లో 8.4 శాతం నమోదు కావడం భారత ఆర్థిక వ్యవస్థ శక్తి సామర్థ్యాలను చూపిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

    వేగంగా ఆర్థిక వృద్ధి సాధించడం కోసం తమ ప్రయత్నాలను కొనసాగిస్తుంటామని చెప్పారు.

    140 కోట్ల భారత జనాభాకు నాణ్యమైన జీవనాన్ని అందించేందుకు, వికసిత్ భారత్ నిర్మాణానికి కట్టుబడి ఉంటామని ప్రధాని మోదీ వ్యాఖ్యానించినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. స్కిన్ డొనేషన్: కిడ్నీ, లివర్‌లాగే చర్మాన్నీ కూడా దానం చేయవచ్చని తెలుసా?

  4. ఇవన్ కంటు-మరణ శిక్ష : ‘నేను హత్యలు చేయలేదు’ అని కడదాకా వాదించినా ఆయనకు విషపు ఇంజెక్షన్ ఎందుకు ఇచ్చారు, అసలు ఈ కేసు ఏంటి ?

  5. సిమ్లా: ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

    కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హతవేటు

    ఫొటో సోర్స్, GETTY IMAGES

    సిమ్లా : రాజ్యసభ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఆరుగురు ఎమ్మెల్యేలపై హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కుల్‌దీప్ సింగ్ పఠానియా అనర్హత వేటు వేశారు.

    ‘‘కాంగ్రెస్ గుర్తుపై గెలిచి, పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన ఆరుగురు ఎమ్మెల్యేలను శాసనసభ సభ్యత్వం నుంచి తక్షణమే తొలగిస్తున్నట్టు’’ స్పీకర్ ప్రకటించారు.

    అనర్హతవేటు పడినవారిలో సుధీర్ శర్మ, రాజేంద్ర రాణా, దేవేందర్ కె. భుట్టో, రవిఠాకూర్, చైతన్యశర్మ, ఇందర్ దత్ లఖన్‌పాల్ ఉన్నారు.

    ఈ ఆరుగురు ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్షవర్థన్ చౌహాన్ పిటిషన్ పెట్టారు.

    ప్రస్తుతం ఈ ఆరుగురిని అనర్హులుగా ప్రకటిచడంతో హిమాచల్ ప్రదేశ్ శాసనసభ్యుల బలం 68 నుంచి 62కు తగ్గింది. దీంతో శాసనసభలో బలం నిరూపించుకోవడానికి 32మంది సభ్యుల అవసరం కాగా, ప్రస్తుతం ఆరుగురుసభ్యులను కోల్పోవడంతో కాంగ్రెస్ పార్టీ 34 మంది సభ్యులు మిగిలారు. బీజేపీకి ఇండిపెండెంట్లతో కలిసి 28మంది సభ్యుల బలం ఉంది.

  6. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లను సెంట్రల్ కాంట్రాక్ట్‌ నుంచి బీసీసీఐ ఎందుకు తొలగించింది?

  7. తెలంగాణలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సీ విడుదల

    తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

    ఫొటో సోర్స్, TelanganaCMO

    తెలంగాణ ప్రభుత్వం 11,062 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సీ ని ప్రకటించింది. ఈమేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిఎస్సీ నోటిఫికేషన్ లాంఛనంగా విడుదల చేశారు.

    వివిధ కేటగిరీలలో స్కూల్ అసిస్టెంట్స్, స్పెషల్ గ్రేడ్ టీచర్లు, భాషా పండితులు, పీఈటీల పోస్టులను ఈ డిఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తులను మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీవరకు స్వీకరిస్తారు. దరఖాస్తు రుసుము వెయ్యిరూపాయలుగా నిర్ణయించారు.

    అభ్యర్థుల కనిష్ఠ వయో పరిమితి 18 ఏళ్ళు, గరిష్ఠ వయోపరిమితి 46 సంవత్సరాలుగా పేర్కొన్నారు. రాత పరీక్ష తేదీలను తర్వాత ప్రకటిస్తారు. దరఖాస్తుల సమర్పణకు సంబంధించి https://schooledu.telangana.gov.in లో యూజర్ గైడ్‌ను మార్చి 4వ తేదీ నుంచి అందుబాటులో ఉంచుతారు.

  8. పారిపోయిన ఇద్దరు పిల్లలు తిరిగి తమ ఇంటికి చేరుకోవడానికి 13 ఏళ్ళు పట్టింది... ఇన్నేళ్ళూ వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేశారు?

  9. దక్షిణ కొరియా మహిళలు పిల్లలను ఎందుకు కనడం లేదు, వారి సమస్యేంటి?

  10. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హిమాచల్ సీఎం అల్పాహార విందు

    కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హిమాచల్ ప్రదేశ్ సీఎం విందు

    ఫొటో సోర్స్, @HARISHRAWATCMUK

    రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్‌తో సంక్షోభంలో పడిన హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం మెల్లిగా గట్టెక్కే ప్రయత్నాలు చేస్తోంది.

    ఈ నేపథ్యంలో గురువారం ఉదయం కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు అల్పాహార విందుకు పిలిచినట్టు ఏఎన్ఐ వార్తా కథనం తెలిపింది.

    ‘‘ఇది చాలా ముఖ్యమైన సమావేశం. ఏం జరుగుతుందో చూడాలి’’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే అశీష్ బౌతాలి చెప్పారు.

    ‘‘ముఖ్యమంత్రి అందరినీ అల్పాహార విందుకు పిలిచారు. అక్కడ ఎలాంటి చర్చలు జరుగుతాయో చూడాలి. రాత్రి మా అందరికీ ఆహ్వానాల సందేశం వచ్చింది. మా ప్రభుత్వం ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ నేతృత్వంలో కొనసాగుతుంది’’ అని మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ సింగ్ బబ్లూ చెప్పారు.

    రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్‌తో బీజేపీ అభ్యర్థి గెలవడంతో కాంగ్రెస్ అథిష్ఠానం పరిశీలకులుగా డీకే శివకుమార్, భూపేందర్ హుడాను హిమాచల్ ప్రదేశ్‌కు పంపింది.

    బుధవారంనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కేంద్ర పరీలకులు డీకే శివకుమార్, భూపేందర్ హుడాను వ్యక్తిగతంగా కలిశారు. దీనికి సంబంధించి ఒక నివేదికను పార్టీ పరిశీలకులిద్దరూ త్వరలో అధిష్ఠానానికి అందించనున్నారు.

    మరోపక్క హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కులదీప్ సింగ్ పఠానియా రాజ్యసభ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఆరుగు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై భవితవ్యం ఏమిటో త్వరలో ప్రకటించనున్నారు.

    హిమాచల్‌లో ఒక రాజ్యసభ స్థానానికి జరిగిన ఎన్నికలో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడంతో అక్కడ బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

    హిమాచల్ శాసనసభలో కాంగ్రెస్‌కు 40మంది శాసనసభ్యుల బలం ఉంది. బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం 68 సీట్లలో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉన్నారు.

  11. అత్యంత సంపన్న పార్టీగా బీజేపీ : ఏడీఆర్ నివేదిక వెల్లడి

    దేశంలో అత్యంత సంపన్న రాజకీయపక్షంగా బీజేపీ

    ఫొటో సోర్స్, Getty Images

    దేశంలో అత్యంత సంపన్న రాజకీయపక్షం బీజేపీనేనని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) ఒక నివేదికలో తెలిపింది.

    దేశంలోని మొత్తం 6 రాజకీయ పక్షాలు తమ ఆదాయాన్ని ప్రకటించాయి. వీటి మొత్తం ఆదాయం 3077 కోట్లు కాగా, ఇందులో బీజేపీ వాటా దాదాపు 2361 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది.

    ఏడీఆర్ నివేదిక ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 6 రాజకీయ పార్టీల మొత్తం ఆదాయంలో బీజేపీ వాటా 76.7 శాతంగా ఉంది.

    కాంగ్రెస్ పార్టీ ఆదాయం 452.375 కోట్ల ఆదాయంతో రెండో స్థానంలో నిలిచింది. ఇది 6 పార్టీల మొత్తం ఆదాయంలో 14.70 శాతం.బీఎస్సీ, అమ్ అద్మీ పార్టీ, నేషనల్ పీపుల్స్ పార్టీ , సీపీఐ(ఎం) కూడా తమ ఆదాయాన్ని ప్రకటించాయి.

    బీజేపీ ఆదాయంలో 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాల మధ్యన పెరుగుదల కనిపించిందని, 2021 – 22లో ఆ పార్టీ ఆదాయం 1917.12 కోట్లు కాగా, 2022-23 సంవత్సరానికి వచ్చేసరికి 2360. 844 కోట్లకు పెరిగినట్టు ఏడీఆర్ తెలిపింది.

    మరోపక్క ఆప్ దాయం 2021-22లో 44.53 కోట్లు ఉండగా, 2022-23లో 91.23 శాతం ఎగబాకి 85.17 కోట్లకు చేరుకుంది.

    కాంగ్రెస్ తన ఆదాయాన్ని 452.375 కోట్లుగా చూపినప్పటికీ మొత్తం ఖర్చును 467.135 కోట్లుగా చూపింది.

    బీజేపీ తన ఆదాయాన్ని 2360.844 కోట్లుగా చూపి, ఆదాయాన్ని 1361.684 కోట్లుగా పేర్కొంది.