ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్
విశాఖలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కొత్త గాజువాక ప్రాంతంలోని ఆకాష్ బైజూస్ అకాడమీ భవనం రెండో అంతస్తులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్

ఫొటో సోర్స్, Getty Images
తాము అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అగ్నివీర్ పథకాన్ని రద్దు చేసి, సైన్యంలో నియామకాలకు పాత రిక్రూట్‌మెంట్ విధానాన్ని తిరిగి తీసుకొస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.
ఈ స్కీమ్‌ను 'తీవ్ర అన్యాయం'గా పేర్కొంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే లేఖ రాశారు. లక్షలాది మంది యువతకు న్యాయం చేయాలని ఆ లేఖలో ఆయన విజ్ఞప్తి చేశారు. '
'2019 నుంచి 2022 మధ్య ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం రెండు లక్షల మంది యువకులను ప్రభుత్వం ఎంపిక చేసింది. వారు జాయినింగ్ లెటర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత దేశానికి సేవ చేసేందుకంటూ 2022 మే 31న అగ్నివీర్ పథకాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం వారి కలలను నాశనం చేసింది'' అని లేఖలో పేర్కొన్నారు.
"ఇప్పుడు వారు నిరుద్యోగం, నిరాశనిస్పృహలతో ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం వారికి అన్యాయం చేసింది'' అని లేఖలో ఖర్గే రాశారు.
ఈ పథకం వల్ల సైనికుల్లో వివక్ష పెరిగి సమాంతర క్యాడర్ ఏర్పడుతుందని, ఇద్దరు వ్యక్తులూ ఒకే రకమైన పని చేసినా వారి పని పరిస్థితులు మాత్రం వేరుగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, UGC
విశాఖపట్నంలోని కొత్త గాజువాక ప్రాంతంలో ఉన్న బైజూస్ విద్యాసంస్థలో అగ్ని ప్రమాదం జరిగింది. మూడంతస్తుల భారీ భవనంలో సెకండ్ ఫ్లోర్‌లోని బైజూస్‌లో మంటలు చెలరేగాయి.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.ః
మూడంతస్తుల భవనంలో ఒక ఫుడ్ కోర్టు, మరో నగల దుకాణం ఉన్నాయి. వాటికి కూడా మంటలు వ్యాపించాయి. మూడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. మంటలు క్రమంగా అదుపులోకి వస్తున్నాయని వారు చెప్పారు.
ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు, కానీ బైజూస్ సంస్థలోని కంప్యూటర్లు, స్టడీ మెటీరియల్ పూర్తిగా దగ్ధమయ్యాయి.
ప్రమాదం జరిగిన భవనం లోపల ఎలాంటి ఫైర్ సేఫ్టీ పరికరాలు లేకపోవడంతో పాటు, అగ్నిమాపక వాహనాలు లోపలికి వెళ్లేందుకు సరైన దారి కూడా లేకపోవడంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు సమయం పడుతోందని ఫైర్ సిబ్బంది చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
తాజా వార్తలు, అప్డేట్లు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.