నుస్రత్ జహాన్: సందేశ్‌ఖాలీ లైంగిక ఆరోపణల ఘటనపై మౌనం వీడిన స్థానిక టీఎంసీ ఎంపీ
సందేశ్‌ఖాలీ విషయంలో నోరువిప్పడం లేదనే విమర్శలపై స్థానిక, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ స్పందించారు. సందేశ్‌ఖాలీ ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న బసీర్‌హాట్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది.
లైవ్ కవరేజీ
ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్
టాటా గ్రూప్ మార్కెట్ విలువ పాకిస్తాన్ జీడీపీ కన్నా ఎక్కువ... ఇదెలా సాధ్యమైంది?
షమిమా బేగం: ఇస్లామిక్ స్టేట్‌లో చేరడానికి వెళ్లి ఏ దేశానికి చెందని వ్యక్తిగా ఎలా మారారు?
నాలుగో టెస్ట్ లో భారత్ విజయం.. సిరీస్ కూడా

ఫొటో సోర్స్, Getty Images
రాంచీ వేదికగా ఇండియా, ఇంగ్లడ్ మధ్య జరిగిన నాలుగో క్రికెట్ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. అయిదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ పై గెలిచి 3-1 తేడాతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలుచుకుంది.
192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు అయిదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఒక దశలో 120 పరుగులకే సగం జట్టు పెవిలియన్‌కు చేరుకున్నా, శుభ్‌మన్ గిల్ 52 (నాటౌట్), వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ 39( నాటౌట్) సమయోచితంగా ఆడి, మ్యాచ్‌ను గెలిపించారు.
భారత్ రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ 55, మరో ఓపెనర్ యశస్వీ జైస్వాల్ 37 పరుగులు చేశారు.
మొత్తంగా 61 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి భారత్ 192 పరుగులు చేసి, మరో రోజు మిగిలి ఉండగానే గెలుపును ఖాతాలో వేసుకుంది.
ఇంగ్లండ్ బౌలర్లలో జోరూట్‌కు, టామ్ హార్టీకి చెరో వికెట్ దక్కగా, షోయబ్ బషీర్ మూడు వికెట్లతో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ధ్రువ్ జురెల్ ను ఎంపిక చేశారు.
నితాశా కౌల్: బెంగళూరు విమానాశ్రయం నుంచి వెనక్కి పంపించేశారన్న బ్రిటిష్ ప్రొఫెసర్

ఫొటో సోర్స్, X/NITASHAKAUL
కర్ణాటక ప్రభుత్వం నిర్వహిస్తున్న సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన తనను, ఎలాంటి కారణం లేకుండానే బెంగళూరు విమానాశ్రయం నుంచి తిరిగి లండన్‌కు పంపించేశారని బ్రిటిష్ ప్రొఫెసర్, ఓవర్సీస్ సిటిజెన్‌షిప్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డు హోల్డర్ నితాశా కౌల్ తెలిపారు.
'రాజ్యాంగం, జాతీయ ఐక్యత సదస్సు'కి హాజరుకావాల్సిందిగా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం నితాశాను ఆహ్వానించింది.
విద్యావేత్తగా, మేధావిగా, ఉదార ప్రజాస్వామ విలువలను కోరుకునే వ్యక్తిగా ఆమెకు గుర్తింపు ఉంది. లింగ సమానత్వం, స్త్రీద్వేషం, పౌర-రాజకీయ స్వేచ్ఛ, రూల్ ఆఫ్ లా వంటి కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారు.
ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో తనను ఇమ్మిగ్రేషన్ అధికారులు నిర్బంధించారని, కార్యక్రమానికి హాజరు కావడానికి అనుమతించలేదని నితాశా ఆరోపించారు.
నితాశా యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్‌మిన్‌స్టర్‌లో పాలిటిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా ఉన్నారు.
నితాశా హాజరుకావాల్సిన కార్యక్రమం ఫిబ్రవరి 24 - 25 తేదీల్లో జరగాల్సి ఉంది. కర్ణాటక సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి హెచ్‌జీ మహదేవప్ప పంపిన ఆహ్వాన లేఖను నితాశా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
''నేను 12 గంటలు ప్రయాణం చేసి లండన్ నుంచి బెంగుళూరు చేరుకున్నా. అక్కడ ఇమ్మిగ్రేషన్‌లో చాలా గంటలు గడపాల్సి వచ్చింది. అటు వెళ్లండి, ఇటు వెళ్లండి అంటూ అక్కడి వారు నన్ను అటూఇటూ తిప్పారు. అక్కడ ఏం జరుగుతుందో నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఆ తర్వాత సీసీటీవీ మానిటరింగ్ ఉన్న ప్రదేశంలో 24 గంటలు గడిపాను. మరుసటి రోజు వరకూ ఫ్లైట్ లేదు. ఒక ఇరుకు ప్రదేశంలో ఉండాల్సి వచ్చింది. తిండి తినడానికి కూడా ఇబ్బందిపడాల్సి వచ్చింది. దుప్పటి, దిండు వంటి కనీస అవసరాల కోసం కూడా ఎయిర్‌పోర్ట్ సిబ్బందికి డజన్ల సార్లు ఫోన్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మరో 12 గంటలు ప్రయాణించి తిరిగి లండన్ చేరుకున్నా.'' అని నితాశా కౌల్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో రాశారు.
''మేం ఏం చేయలేం. దిల్లీ నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పారు'' అని ఆమె రాశారు.
రష్యా దాడులలో 31వేల మంది సైనికులు మరణించారన్న యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీ
ఏడోసారీ ఈడీ విచారణకు హాజరుకాని దిల్లీ సీఎం కేజ్రీవాల్, బీజేపీ ఏమందంటే..

ఫొటో సోర్స్, Getty Images
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఏడోసారి సమన్లు ఇచ్చినప్పటికీ సోమవారం కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరుకావడం లేదు.
కేజ్రీవాల్‌కి ఈడీ ఏడోసారి సమన్లు ఇచ్చిందని, ఈసారి కూడా ఆయన విచారణకు హాజరుకావడం లేదని ఆమ్ ఆర్మీ పార్టీ వర్గాలు చెప్పినట్లుగా వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
ఈడీ విచారణకు కేజ్రీవాల్ హాజరుకాకపోవడంపై భారతీయ జనతా పార్టీ విమర్శలు చేసింది. ''ముందు అవినీతికి పాల్పడి, ఆ తర్వాత దౌర్జన్యాలు.. దౌర్జన్యాలు అంటూ నినాదాలు చేస్తున్నారు. బాధితుల కార్డు ప్లే చేసినందుకు కేజ్రీవాల్‌కి నోబెల్ బహుమతి దక్కాలి'' అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
సందేశ్‌ఖాలీ కేసులో మరో టీఎంసీ నేత అరెస్టు, షాజహాన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు

ఫొటో సోర్స్, SHIB SHANKAR CHATTERJEE / BBC
సందేశ్‌ఖాలీ కేసులో నార్త్ 24 పరగణాల జిల్లాకి చెందిన మరో టీఎంసీ నేత అజిత్ మైతీని పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
భూకబ్జా ఆరోపణలపై ఆయన్ను అరెస్టు చేసినట్లు సోమవారం ఒక పోలీసు అధికారి తెలిపారు.
పరారీలో ఉన్న టీఎంసీ కీలక నేత షాజహాన్ షేక్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
షాజహాన్ షేక్‌కు సన్నిహితుడిగా చెబుతున్న మైతీని ఆదివారం సాయంత్రం ఒక సివిక్ వాలంటీర్ ఇంటి నుంచి అదుపులోకి తీసుకున్నామని, స్థానికులు వెంబడించడంతో ఆయన నాలుగు గంటలకు పైగా ఓ ఇంట్లో తాళాలు వేసుకుని ఉన్నట్లు పోలీసు అధికారి తెలిపారు.
"భూకబ్జాలకు సంబంధించి గ్రామస్తుల నుంచి ఫిర్యాదులు అందడంతో అతడిని అరెస్టు చేశాం. కోర్టులో హాజరుపరుస్తాం" అని పోలీసు అధికారి పీటీఐకి చెప్పారు.
ఐసీఐసీఐ బ్యాంక్: 'బ్యాంకు మేనేజర్ నా అకౌంట్లో నుంచి 16 కోట్లు కొట్టేశారు'
నుస్రత్ జహాన్: సందేశ్‌ఖాలీ లైంగిక ఆరోపణల ఘటనపై మౌనం వీడిన స్థానిక టీఎంసీ ఎంపీ

ఫొటో సోర్స్, Getty Images
సందేశ్‌ఖాలీ విషయంలో నోరువిప్పడం లేదనే విమర్శలపై స్థానిక, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ స్పందించారు.
సందేశ్‌ఖాలీ ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న బసీర్‌హాట్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఇప్పటివరకూ ఈ వివాదంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఒక వర్గం నుంచి ఆమె విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఈ విషయంపై ఇప్పటి వరకూ ఆమె ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదని వస్తున్న విమర్శలపై ఆమె సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా స్పందించారు.
''ఇలాంటి ఆరోపణలు హృదయ విదారకరం. ఒక మహిళగా, ప్రజాప్రతినిధిగా ఎల్లప్పుడూ పార్టీ మార్గదర్శకాలను పాటిస్తున్నా. సందేశ్‌ఖాలీ విషయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి స్పందించి సాయం చేశారు. అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. మేం చట్టానికి అతీతులం కాదు, కాబట్టి చట్టాన్ని అనుసరించడం, పాలనా యంత్రాంగానికి మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యం'' అని ఆమె రాశారు.
''నేను నా నియోజకవర్గ ప్రజల సుఖదు:ఖాల్లో తోడుగా ఉన్నా. పార్టీ మార్గదర్శకాల ప్రకారం పనిచేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం, పాలనా యంత్రాంగంపై విశ్వాసం ఉంచాలని, ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం కాకుండా, శాంతి నెలకొల్పేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని అనుకుంటున్నా.''
''ప్రజా భద్రత, శ్రేయస్సు మాకు ముఖ్యం. ఎవరు ఎవరి గురించి, ఏం మాట్లాడినా ఫర్వాలేదు. గతంలో చెప్పినట్లు నా పని నేను చేస్తా, ఇలాంటి విషయాల్లో రాజకీయాలు ఆపండి'' అని నుస్రత్ జహాన్ రాశారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఫిబ్రవరి 7 నుంచి సందేశ్‌ఖాలీలో నిరసనలు జరుగుతున్నాయి. ఈ నిరసనలకు మహిళలు నాయకత్వం వహిస్తున్నారు.
తృణమూల్ కాంగ్రెస్ నాయకులు షేక్ షాజహాన్, ఆయన అనుచరులు శివ్ ప్రసాద్ హజ్రా, ఉత్తమ్ సర్దార్ తమను లైంగికంగా వేధించారని, ప్రజల భూములను బలవంతంగా లాక్కున్నారని వారు ఆరోపిస్తున్నారు.
నమస్కారం
తాజా వార్తలు, అప్డేట్లు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
