ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజీ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం.
గుడ్ నైట్.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ కేబుల్ బ్రిడ్జి పొడవు 2.32 కిలోమీటర్లు. బేత్ ద్వారకా దీవి, ఓఖాలను కలిపే ఈ వంతెననుకు సుదర్శన్ సేతు అని పేరు పెట్టారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజీ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం.
గుడ్ నైట్.
రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ పట్టు బిగించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యంతో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు వికెట్ నష్టపోకుండా 40 పరుగులు సాధించింది.
క్రీజులో కెప్టెన్ రోహిత్ శర్మ (24 పరుగులు), యశస్వీ జైస్వాల్(16 పరుగులు) ఉన్నారు.
విజయానికి భారత్ మరో 152 పరుగులు చేయాలి.
అంతకుముందు ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 53.5 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటైంది. రవిచంద్రన్ అశ్విన్ (5 వికెట్లు), కుల్‌దీప్ యాదవ్ (4 వికెట్లు) ఇంగ్లిష్ జట్టును కుప్పకూల్చారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జాక్ క్రాలే 60 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అంతకుముందు 219/7 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా 307 పరుగులకు ఆలౌటైంది.
వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ టెయిలెండర్లతో పోరాడి, జట్టు స్కోరును మూడొందలు దాటించాడు.
కుల్దీప్ యాదవ్ (28 పరుగులు; 131 బంతుల్లో)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 76 పరుగులు, ఆ తర్వాత ఆకాశ్ దీప్ (9)తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 40 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
90 పరుగులు చేసి చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు ధ్రువ్ జురేల్.
గుజరాత్ పర్యటన సందర్భంగా ద్వారకాలో ప్రధాని నరేంద్ర మోదీ సముద్ర స్నానం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రధాని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
“మునిగిపోయిన ద్వారకా నగరంలో ప్రార్థన చేయడం ఒక పవిత్రమైన అనుభవం” అని పోస్టు చేశారు.
“నాకు ఆధ్యాత్మిక వైభవం, శాశ్వతమైన భక్తి పురాతన యుగానికి కనెక్ట్ అయినట్లు అనిపిస్తోంది. శ్రీకృష్ణుడు మనందరినీ అనుగ్రహిస్తారు" అని తెలిపారు.
అంతకుముందు ప్రధాని ద్వారకాధీష్ ఆలయంలో ప్రార్థనలు చేశారు. బెట్ ద్వారకా ద్వీపాన్ని ఓఖాకు కలిపే సుదర్శన్ వంతెనను ప్రారంభించేందుకు ఆయన ఇక్కడికి వచ్చారు.
ఈ వంతెన భారతదేశంలోనే అతి పొడవైన కేబుల్ వంతెన, దీని పొడవు 2.32 కిలోమీటర్లు.
భారత్, ఇంగ్లండ్‌ల మధ్య రాంచీలో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు ఆలౌట్ అయింది.
తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులు చేసిన ఇంగ్లండ్ జట్టు భారత జట్టును మూడో రోజున ఆలౌట్ చేసింది. నిజానికి, ఈ ఇన్నింగ్‌లో భారత్ మరింత తక్కువ పరుగులకే అలౌటయ్యే ప్రమాదంల ోపడింది. ఒక దశలో భారత జట్టు 177 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. అయితే, టెయిల్ ఎండర్స్ జాగ్రత్తగా ఆడి జట్టును గౌరవప్రదమైన స్కోర్ దిశగా నడిపించారు.
ముఖ్యంగా, వికెట్ కీపర్ - బ్యాట్స్‌మన్ ధ్రువ్ జూరెల్ అద్భుతంగా ఆడి 90 పరుగులు సాధించాడు. ఆయనకుకులదీప్ యాదవ్ అండగా నిలిచారు. వీరిద్దరి భాగస్వామ్యంలో భారత్ ఎనిమిదో వికెట్‌కు 76 పరుగులు నమోదు చేసింది.
ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ అత్యుత్తమమైన ఆటతీరుతో అయిదు వికెట్లు పడగొట్టాడు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్‌లో దేశంలోనే అత్యంత పొడవైన కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించారు. బేత్ ద్వారక దీవి, ఓఖాలను కలిపే ఈ వంతెన పొడవు 2.32 కిలోమీటర్లు.
ఏఎన్ఐ కథనం ప్రకారం ఈ వంతెనను సిగ్నేచర్ బ్రిడ్జి అని పిలిచేవారు. అయితే, ఇప్పుడు దీనికి సుదర్శన్ సేతు అని పేరు పెట్టారు.
బేత్ ద్వారకా అన్నది ఓఖా పోర్టుకు సమీపంలో ఉన్న దీవి. ప్రధాన ద్వారక నగరానికి ఇది 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడే ప్రఖ్యాత ద్వారకాధీశ్ శ్రీకృష్ణ మందిరం ఉంది.
వంతెనను ప్రారంభించడానికి ముందు ప్రధాని మోదీ మాట్లాడుతూ, "గుజరాత్ పురోగతిలో ఇదొక ముఖ్యమైన ఘట్టం" అని వ్యాఖ్యానించారు.
ఆ తరువాత ఆయన బేత్ ద్వారక ఆలయంలో పూజలు చేశారు.
హాయ్... గుడ్ మార్నింగ్.
తాజా వార్తలను ఎప్పటికప్పుడు మీకు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.