You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలుగుదేశం, జనసేన తొలి ఉమ్మడి జాబితాను ప్రకటించిన చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉమ్మడి అభ్యర్థుల జాబితాను టీడీపీ, జనసేన అధ్యక్షులు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ విడుదల చేశారు.
లైవ్ కవరేజీ
ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజీ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం.
గుడ్ నైట్.
భార్య ఫోన్‌కాల్స్ విని ఇన్‌సైడర్ ట్రేడింగ్‌తో రూ. 14.5 కోట్లు సంపాదించిన భర్త.. భార్య ఉద్యోగం పోవడంతో విడాకులకు దరఖాస్తు
సమ్మక్క సారలమ్మ: వనమంతా జనమే - మేడారం జాతర చిత్రాలివి
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్: రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు 219/7
రాంచీ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.
భారత బ్యాటర్లలో ఓపెనర్ యశస్వీ జైస్వాల్ చేసిన 73 పరుగులే అత్యధికం. క్రీజులో ధ్రువ్ జురేల్ (30 పరుగులు), కుల్దీప్ యాదవ్ (17 పరుగులు) ఉన్నారు.
భారత జట్టులో శుభ్‌మన్ గిల్ 38, రోహిత్ శర్మ 2 పరుగులు, రజత్ పాటిదార్ 17, రవీంద్ర జడేజా 12, సర్ఫరాజ్ ఖాన్ 14 పరుగులు, రవిచంద్రన్ అశ్విన్ ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యారు.
ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ 4 వికెట్లు పడగొట్టాడు.
అంతకుముందు 7 వికెట్ల నష్టానికి 302 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ 353 పరుగులకు ఆలౌటైంది.
జోయ్ రూట్ 122 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రవీంద్ర జడేజా నాలుగు, ఆకాశ్ దీప్‌లు మూడు వికెట్లు తీశారు.
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్: 177 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన భారత్
రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ తడబడింది. రెండో రోజు ఆటలో మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 177 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది.
భారత్ తరఫున యశస్వి జైస్వాల్ చేసిన 73 పరుగులే అత్యధికం. కెప్టెన్ రోహిత్ శర్మ 2 పరుగులు, శుభ్‌మన్ గిల్ 38 పరుగులు, రజత్ పాటిదార్ 17 పరుగులు, రవీంద్ర జడేజా 12 పరుగులు, సర్ఫరాజ్ ఖాన్ 14 పరుగులు, రవిచంద్రన్ అశ్విన్ ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యారు.
క్రీజులో ధ్రువ్ జురేల్ (20 పరుగులు), కుల్దీప్ యాదవ్ (14 పరుగులు) ఉన్నారు.
ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ 4 వికెట్లు పడగొట్టాడు.
అంతకుముందు 7 వికెట్లు కోల్పోయి 302 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ 353 పరుగులకు ఆలౌటైంది. జోయ్ రూట్ 122 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు, ఆకాశ్ దీప్‌లు మూడు వికెట్లు తీశారు.
టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా ఇదే
త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం, జనసేన కూటమి 118 స్థానాలలో తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఉండవల్లిలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు నివాసంలో శనివారం జరిగిన ఉమ్మడి మీడియా సమావేశంలో మొత్తం 118 స్థానాలకు అభ్యర్థులను ఇరుపార్టీల నేతలు వెల్లడించారు.
ప్రస్తుతం ప్రకటించిన 118 స్థానాలలో తెలుగుదేశం పార్టీ 94 అసెంబ్లీ, స్థానాలు, జనసేన 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలలో పోటీ చేస్తుందని ప్రకటించారు.
ముందుగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తమ పార్టీ పోటీచేయనున్న 24 స్థానాలలో ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. జనసేన తరపున
తెనాలి -నాదెండ్ల మనోహర్.
నెల్లిమర్ల - లోకం మాధవి,
అనకాపల్లి - శ్రీ కొణతాల రామకృష్ణ
రాజానగరం - శ్రీ బత్తుల బలరామ కృష్ణ
కాకినాడ రూరల్ - శ్రీ పంతం నానాజీ పేర్లను పవన్ ప్రకటించారు.
మిగిలిన వారి వివరాలు తరువాత తెలుపుతామన్నారు.
ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితాను చంద్రబాబునాయుడు ప్రకటించారు. మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీ చేయనున్నారు. టీడీపీ, జనసేన తరపున పోటీచేస్తున్నవారి జాబితా ఈ కింది విధంగా ఉంది.
అమెరికాలో జాహ్నవి కందుల మృతి కేసులో పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలన్న భారత్
తెలుగు విద్యార్ధి జాహ్నవి కందుల మృతి కేసులో అమెరికా పోలీసు అధికారిపై అభియోగాలు నమోదు చేయకపోవడాన్ని తిరిగి పరిశీలించాలని భారత్ డిమాండ్ చేసింది.
సదరు పోలీసు అధికారికి విరుద్ధంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేనందున అభియోగాలు దాఖలు చేయడం సాధ్యం కాదని ప్రాసిక్యూటర్ కోర్టుల ో చెప్పారు.
జాహ్నవి గత ఏడాది జనవరి 23న సియాటిల్ నగరంలో ఒక పోలీసు అధికారం కారు డీకొనడంతో మృతి చెందారు. ఆ ప్రమాదం జరిగినప్పుడు పోలీసు అధికారి వాహనం 120 మైళ్ళ వేగంతో వెళ్తోంది. ఆ పోలీసు అధికారి బాడీకామ్ ఆడియో వైరల్ కావడంతో ఆ ఘటనపై అనుమానాలు రేకెత్తాయి.
ఆ యాక్సిడెంట్ గురించి ఆయన సహోద్యోగి నవ్వుతున్నట్లుగా ఆ ఆడియోలో వినిపించింది.
సియాటిల్‌లోని భారత కాన్సులేట్ కార్యాలయం తాము జాహ్నవి కుటుంబంతో టచ్‌లో ఉన్నామని ప్రకటించింది. "ఈ కేసును రివ్యూ కోసం సియాటిల్ సిటీ అటార్నీ కార్యాలయానికి బదిలీ చేశారు" అని వారు తెలిపారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
నమస్తే...
తాజా అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీకు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.