బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్ ఇంతటితో సమాప్తం.
రేపు కలుద్దాం.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే జి.లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హైదరాబాద్ పఠాన్‌చెరు సమీపంలోని ఔటర్ రింగు రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ని ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్ ఇంతటితో సమాప్తం.
రేపు కలుద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన సీనియర్ నేత మనోహర్ జోషి (86) కన్నుమూశారు.
ముంబైలోని హిందూజా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల కిందట, ఫిబ్రవరి 21న మనోహర్ జోషి గుండెపోటుతో హిందూజా ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ప్రజల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఈరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆయన మాతుంగా వెస్ట్ నివాసంలో ఉంచుతారు.
దాదర్ శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఆయనకు నివాళులర్పించారు.
సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, లోక్‌సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని గడ్కరీ రాశారు.

ఫొటో సోర్స్, Lasya Nanditha/FB
బీఆర్ఎస్ ఎమ్మెల్యే జి.లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హైదరాబాద్ పఠాన్‌చెరు సమీపంలోని ఔటర్ రింగు రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ని ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించారు.
ఆమె డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.
ప్రస్తుతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు. 34 ఏళ్ల లాస్య నందిత గతంలో కవాడిగూడ కార్పొరేటర్‌గా పనిచేశారు.

ఫొటో సోర్స్, UGC
ఆమె తండ్రి జి.సాయన్న సుదీర్ఘ కాలం కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సాయన్న మరణం తరువాత, ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి లాస్య నందిత పోటీ చేసి గెలిచారు.
ఇటీవల ఫిబ్రవరి 13న కూడా నార్కట్‌పల్లి సమీపంలో ఆమె రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తలకు చిన్న గాయంతో బయటపడ్డారు. నల్లగొండలో బీఆర్ఎస్ సభ నుంచి తిరిగి వస్తున్నప్పుడు ఆమె కారు - లారీ ఢీకొన్నాయి. ఆ సమయంలో ఆమె కారు ముందు టైరు ఊడిపోయింది.
ప్రమాదం గురించి తెలుసుకున్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ నాయకులు ఆ మరుసటి రోజు ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు.
ఇంతలోనే మరో ప్రమాదంలో ఆమె ప్రాణాలు విడిచారు.
లాస్య నందిత తండ్రి సాయన్న కూడా ఫిబ్రవరి నెలలోనే చనిపోయారు. నిరుడు ఫిబ్రవరి 19న ఆయన మృతి చెందారు.

ఫొటో సోర్స్, UGC
బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
ఎప్పటికప్పుడు తాజా వార్తలను మీకందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.