యువ రైతు మరణానికి మోదీ ప్రభుత్వానిదే బాధ్యత: యునైటెడ్ కిసాన్ మోర్చా

ప్రస్తుత సంక్షోభానికి, యువ రైతు మరణానికి మోదీ ప్రభుత్వానిదే బాధ్యత'' అని యునైటెడ్ కిసాన్ మోర్చా తెలిపింది.

లైవ్ కవరేజీ

  1. బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్‌ ఇంతటితో సమాప్తం.

    మళ్లీ రేపు కలుద్దాం.

  2. యుక్రెయిన్‌తో రెండేళ్ల యుద్ధం వల్ల రష్యాలో వచ్చిన మార్పులేంటి?

  3. ఐశ్వర్యా రాయ్‌ పేరును రాహుల్ గాంధీ పదేపదే ఎందుకు ప్రస్తావిస్తున్నారు?

  4. ఐపీఎల్ 2024 షెడ్యూల్: తొలి మ్యాచ్‌లో తలపడేది ఎవరంటే...

    ఐపీఎల్ తొలిమ్యాచ్‌లో సీఎస్‌కే,ఆర్‌సీబీ ఢీ

    ఫొటో సోర్స్, ANI

    ఐపీఎల్ 2024 షెడ్యూల్ విడుదలైంది. అయితే ఇది పూర్తిస్థాయి షెడ్యూల్ కాదు. పాక్షిక షెడ్యూల్ ప్రకారం ఈ లీగ్ 17 రోజులపాటు కొనసాగనుంది. ఈ షెడ్యూల్ ప్రకారం 21 మ్యాచులు జరుగుతాయి.

    తొలి మ్యాచ్‌ మార్చి 22న చెన్నైలో జరుగుతుంది.

    ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తలపడనున్నాయి.

    లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేవలం 17 రోజుల షెడ్యూల్ మాత్రమే విడుదల చేశారని భావిస్తున్నారు.

    2023లో ఐపీఎల్ చాంపియన్ షిప్‌ను చెన్నై జట్టు గెలుచుకుంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇంట్లో సీబీఐ సోదాలు

    సత్యపాల్ మాలిక్ ఇంటిలో సీబీఐ సోదాలు

    ఫొటో సోర్స్, GETTY IMAGES

    ఫొటో క్యాప్షన్, సత్యపాల్ మాలిక్ ఇంటిలో సీబీఐ సోదాలు

    జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ నివాసంలో గురువారం సీబీఐ సోదాలు నిర్వహించింది.

    మరో 29 చోట్ల కూడా సీబీఐ సోదాలు చేసింది.

    సత్యపాల్ మాలిక్ బంధువు అనుమాలిక్ పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ- ఈ సోదాలు నిజమేనని ధ్రువీకరించారు.

    ‘‘అసలు విషయం ఏమిటనేది నాకు తెలియదు. ఏడుగురు సభ్యులున్న సీబీఐ బృందం ఇక్కడకు వచ్చింది. దాదాపు 3, 4 గంటలపాటు సోదాలు నిర్వహించారు’’ అని ఆయన చెప్పారు.

    ‘‘సీబీఐ అధికారులు ఇల్లంతా వెదకడంతోపాటు సత్యపాల్ మాలిక్ గదిని కూడా శోధించారు’’ అని అనుమాలిక్ చెప్పారు.

    ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి అనేక విమర్శలు మొదలయ్యాయి.

    కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దీనిపై ‘ఎక్స్’లో స్పందించారు.

    ‘‘మాజీ గవర్నర్ నిజాలు చెబితే ఆయనింటికి సీబీఐను పంపిస్తారు. ప్రధాన ప్రతిపక్షం బ్యాంకు ఖాతాను స్తంభింపజేస్తారు. ఇదేనా ప్రజాస్వామ్యమంటే’’ అని ఆయన ప్రశ్నించారు.

  6. పీచు మిఠాయితో క్యాన్సర్ ప్రమాదం ఉందా? దీనిపై ఏపీ, తెలంగాణ పరీక్షలు ఎందుకు చేయిస్తున్నాయి?

  7. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్

    వైఎస్ షర్మిల

    ఫొటో సోర్స్, UGC

    ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను గుంటూరు జిల్లా ఉండవల్లి వద్ద పోలీసులు అరెస్టు చేశారు.

    చలో సచివాలయం కార్యక్రమంలో భాగంగా విజయవాడలోని ఏపీ కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ నుంచి వెలగపూడిలోని సచివాలయానికి బయలుదేరిన వైఎస్ షర్మిలను ఉండవల్లి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    వైఎస్ షర్మిల అరెస్టుతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.

    ఆమెను పోలీసులు దుగ్గిరా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

  8. హరియాణా పోలీసుల దాడుల తర్వాత ఆరుగురు అదృశ్యమయ్యారు: రైతు సంఘాలు

    శ:భు బోర్డర్

    ఫొటో సోర్స్, ANI

    శంభు బోర్డర్ వద్ద పారామిలటరీ బలగాలు, హరియాణా పోలీసులు సరిహద్దు దాటి వచ్చి పంజాబ్‌లోని రైతుల శిబిరంపై దాడి చేశారని, ఆ తర్వాత ఆరుగురు వ్యక్తులు కనిపించకుండా పోయారని రైతు సంఘాల నేతలు ఆరోపించారు.

    వారు గురువారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. పారామిలటరీ బలగాలు, హరియాణా పోలీసులు సరిహద్దులు దాటి పంజాబ్‌లోకి ప్రవేశించి, రైతుల శిబిరంపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని, ఇది ఎలా జరిగిందో పంజాబ్ పోలీసులు సమాధానం చెప్పాలని రైతు నాయకుడు ఒకరు డిమాండ్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    "మా ట్రాక్టర్లు తనిఖీ చేశారు. ఆ తర్వాత నుంచి మా వాళ్లు ఆరుగురు కనిపించకుండా పోయారు. వారిని నిన్న ఎత్తుకెళ్లారు. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా పారామెడికల్ సిబ్బందిపై మానవతా దృక్పథంతో ఎవరూ దాడి చేయరు. కానీ, నిన్న ఖానౌరీలోని వైద్య శిబిరంలో, గాయపడిన వారికి చికిత్స అందిస్తున్న వైద్యులను కూడా కొట్టి, దోచుకున్నారు. ఈ ప్రభుత్వ అనాగరికత హద్దులు దాటిందని ఇది స్పష్టంగా తెలియజేస్తోంది'' అన్నారు.

  9. రైతుల ఆందోళనల అప్‌డేట్స్ పోస్ట్ చేస్తున్న అకౌంట్లను బ్లాక్ చేయాలని భారత ప్రభుత్వం ఆదేశించింది: ఎక్స్

    సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తన అకౌంట్‌లో భారత ప్రభుత్వ ఆదేశాల గురించి ఒక ప్రకటన చేసింది.

    ఆ ప్రకటనలో “ భారత ప్రభుత్వం ఒక ఆర్డర్ జారీ చేసింది. అందులో ఎక్స్‌లో పోస్ట్ చేస్తున్న కొన్ని అకౌంట్లపై చర్యలు తీసుకోవాలని అందులో కోరింది. ఆ అకౌంట్లు, అందులో చేస్తున్న పోస్టులను బ్లాక్ చెయ్యాలని, అవి భారత చట్టాలకు వ్యతిరేకమని తెలిపింది.

    “ఆ ఆదేశాల ప్రకారం మేం ఆ అకౌంట్లను భారత దేశంలోనే బ్లాక్ చేస్తాం. అయితే, దీనితో మేం ఏకీభవించడం లేదు. భావప్రకటన స్వేచ్చను మేం విశ్వసిస్తున్నాము. “ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా మేము దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ఉంది. మా సంస్థ నియమాలను అనుసరించి ఆ అకౌంట్ల నిర్వాహకులకు ఈ విషయం తెలియజేశాం. న్యాయపరమైన అంశాల దృష్ట్యా భారత ప్రభుత్వ ఆదేశాలను మేం ఇక్కడ షేర్ చేయలేకపోతున్నాం. అయితే ప్రభుత్వ ఆదేశాల గురించి ఈ ప్రకటన చెయ్యడం పారదర్శకతకు నిదర్శనం అని భావిస్తున్నాం అంటూ ఎక్స్ ప్రకటనలో పేర్కొంది.

    రైతుల ఆందోళనలకు సంబంధించిన అకౌంట్లుగా భావిస్తున్న 177 అకౌంట్లను తాత్కాలికంగా నిషేధించాలని కేంద్ర హోంశాఖ ఐటీశాఖనుకోరినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  10. వైఎస్ షర్మిల ‘చలో సెక్రటేరియేట్’ ఉద్రిక్తం, కాంగ్రెస్ నేతల అరెస్ట్

    Sharmila

    ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, మెగా డీఎస్సీ ప్రకటించాలని కోరుతూ ఏపీసీసీ ఆధ్వర్యంలో చలో సెక్రటేరియేట్ కి పిలుపునిచ్చారు.

    పీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ఆపార్టీ నాయకులు గురువారం సెక్రటేరియేట్ వద్ద ఆందోళనకు సిద్ధమయ్యారు.

    కాంగ్రెస్ నిరసనలకు అనుమతిలేదంటూ పోలీసులు రంగంలో దిగారు.

    ముందస్తుగా నాయకులను అరెస్ట్ చేశారు. కొందరు కాంగ్రెస్ నేతలను గృహనిర్బంధంలో ఉంచారు.

    బుధవారం రాత్రే విజయవాడ చేరుకుని కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ లో నిద్రించిన షర్మిల కూడా యలో సెక్రటేరియేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరగా ఆమెను పోలీసులు అడ్డుకున్నారు.

    కాంగ్రెస్ కార్యాలయం నుంచి ప్రదర్శనగా బయలుదేరే ప్రయత్నం చేయగా నిలువరించారు. అంతకుముందు కాంగ్రెస్ నేతలు గిడుగు రుద్రరాజు, మస్తాన్ వలీ వంటి వారిని అదుపులోకి తీసుకున్నారు.

    ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం నిరుద్యోగులను వంచించిందని విమర్శించారు.

    మెగా డీఎస్సీ హామీ ఇచ్చి దగా చేశారని మండిపడ్డారు. నిరుద్యోగులకు తమ పార్టీ అండగా ఉంటుందని అన్నారు.

  11. రాచ్‌డేల్ గ్రూమింగ్: 'నన్ను వందకంటే ఎక్కువసార్లు రేప్ చేశారు'

  12. స్మైల్ సర్జరీ తరువాత పెళ్లికొడుకు మృతి.. అనస్తీషియా ఓవర్‌డోస్ కావడంతో చనిపోయారా?

  13. చంద్రగిరి నది: వంద కేజీల బరువుండే అత్యంత అరుదైన మంచి నీటి తాబేలును గుర్తించిన పరిశోధకులు

  14. యువ రైతు మరణానికి మోదీ ప్రభుత్వానిదే బాధ్యత: యునైటెడ్ కిసాన్ మోర్చా

    రైతు ఆందోళన

    ఫొటో సోర్స్, Getty Images

    భద్రతా బలగాలు, నిరసనకారుల మధ్య బుధవారం జరిగిన ఘర్షణలో యువ రైతు మరణానికి సంతాపం వ్యక్తం చేసిన యునైటెడ్ కిసాన్ మోర్చా, ''ప్రస్తుత సంక్షోభానికి, యువ రైతు మరణానికి మోదీ ప్రభుత్వానిదే బాధ్యత'' అని పేర్కొంది.

    రైతు సంఘం ఫిబ్రవరి 22న జాతీయ సమన్వయ కమిటీని సమావేశానికి పిలుపునిచ్చింది. ప్రస్తుత పరిస్థితి, నిరసనను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై విధాన రూపకల్పన గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు.

    రైతులు, భద్రతాబలగాల ఘర్షణలో బుధవారం మృతి చెందిన 21 ఏళ్ల యువకుడిని శుభ్ కరణ్ సింగ్‌గా గుర్తించారు. శుభ్ కరణ్ సింగ్ భటిండా జిల్లా బలోక్ గ్రామానికి చెందిన వారు.

    పంజాబ్, హరియాణా మధ్య ఖనౌరీ సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఘర్షణలో ఆయన మరణించారు. మరికొందరు గాయాలపాలయ్యారు.

    "హరియాణా - పంజాబ్ బోర్డర్‌లో పోలీసుల క్రూరమైన అణచివేత, కాల్పులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం" అని రైతు సంఘం ఎస్‌కేఎం ఒక ప్రకటనలో పేర్కొంది.

    ఈ ఘర్షణ తర్వాత, రైతులు 'దిల్లీ కూచ్ మార్చ్'ను రెండురోజులపాటు నిలిపివేశారు.

  15. నమస్కారం

    బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    ఎప్పటికప్పుడు తాజా వార్తలను మీకందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  16. గుంటూరులో డయేరియా పదేపదే ఎందుకు ప్రబలుతోంది