అలెక్సీ నవాల్నీ మరణం తర్వాత విడుదల చేసిన వీడియోలో ఆయన భార్య ఏమన్నారు..

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నవాల్నీ మరణం తర్వాత, ఈ పోరాటం ఆగదని ఆయన భార్య అన్నారు. "స్వేచ్ఛాయుత, శాంతియుత, సంతోషకరమైన రష్యా కోసం పోరాటాన్ని" మరింత బలోపేతం చేస్తానని ఆమె చెప్పారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజీ ఇంతటితో సమాప్తం.

    మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం.

    గుడ్ నైట్.

  2. రూ.2,800 కోట్ల జాక్‌పాట్ తగిలిన వ్యక్తికి డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన లాటరీ కంపెనీ

  3. యువ ఆటగాళ్ల ఆట కోహ్లీ, రోహిత్ లాంటి సీనియర్ల రిటైర్మెంట్‌కు కారణమవుతుందా?

  4. అధిక బరువును ఉపవాసంతో తగ్గించుకోవచ్చా... ఫాస్టింగ్‌తో శరీరంలో ఏం జరుగుతుంది?

  5. చండీగఢ్ మేయర్‌గా బీజేపీ అభ్యర్థి ఎన్నికను రద్దు చేసిన సుప్రీంకోర్టు.. మేయర్‌గా ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్‌

    సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్

    ఫొటో సోర్స్, ANI

    చండీగఢ్ మేయర్‌గా బీజేపీ అభ్యర్థి మనోజ్ కుమార్ సోంకర్ ఎన్నికను సుప్రీంకోర్టు మంగళవారం రద్దు చేసింది.

    జనవరి 30, 2024న జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నిక ఓటింగ్‌కు సంబంధించిన బ్యాలెట్ పేపర్లను తమకు సమర్పించాలని సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది.

    తిరిగి ఎన్నికలు నిర్వహించడానికి బదులు, బ్యాలెట్ పేర్లను తిరిగి లెక్కించాలని ధర్మాసనం నిర్ణయించింది. ఈ మేరకు చేపట్టిన రీకౌంటింగ్‌లో ఆప్ అభ్యర్థికి అనుకూలంగా ఓట్లు వచ్చాయని సుప్రీంకోర్టు గుర్తించింది.

    సోమవారం నాటి విచారణలో రిటర్నింగ్ అధికారి అనిల్ మసిహ్‌‌కు ధర్మాసనం పలు ప్రశ్నలు వేసింది. మంగళవారం జరిగే విచారణలో బ్యాలెట్ పేపర్లన్నంటిన్నీ తమ ముందు ఉంచాలని చెప్పింది.

    బ్యాలెట్ పేపర్‌పై క్రాస్ మార్క్‌ను తానే పెట్టినట్లు అనిల్ మసిహ్ కోర్టు ముందు ఒప్పుకున్నారు.

    చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ కుల్దీప్ కుమార్‌ను సుప్రీంకోర్టు ప్రకటించింది.

    బీజేపీ అభ్యర్థి గెలుపును భారత సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది.

    ఆప్ అభ్యర్థి గెలుపు

    ఫొటో సోర్స్, ANI

    ఆప్ అభ్యర్థికి వచ్చిన ఎనిమిది ఓట్లను ట్యాంపర్ చేశారన్న ఆరోపణలపై మేయర్ ఎన్నికలు నిర్వహించిన రిటర్నింగ్ అధికారి అనిల్ మసిహ్‌కు సుప్రీంకోర్టు షోకాజు నోటీసు జారీ చేసింది .

    ఎన్నికలనే ప్రజాస్వామ్య ప్రక్రియను కుట్రలు, కుతంత్రాలకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత ఆర్టికల్ 142 కింద తమపై ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.

    రిటర్నింగ్ అధికారి చెల్లని ఓట్లుగా ప్రకటించిన ఎనిమిది ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కుల్దీప్ కుమార్‌కు అనుకూలంగా వచ్చాయని ధర్మాసనం తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  6. అలెక్సీ నవాల్నీ: పుతిన్‌ను ఎదిరించిన నేతతో పెళ్లిపై యూలియా నవాల్నియా ఏమన్నారు?

  7. అలెక్సీ నవాల్నీ మరణం తర్వాత విడుదల చేసిన వీడియోలో ఆయన భార్య ఏమన్నారంటే..

    యులియా నావల్నయా

    ఫొటో సోర్స్, Youtube

    రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నవాల్నీ మరణంతో ఈ పోరాటం ఆగదని ఆయన భార్య అన్నారు.

    పుతిన్ అధికారానికి వ్యతిరేకంగా తన భర్త సాగించిన పోరాటాన్ని తాను కొనసాగిస్తానని యూలియా నవాల్నియా సోమవారం ప్రకటించారు. "స్వేచ్ఛాయుత, శాంతియుత, సంతోషకరమైన రష్యా కోసం పోరాటాన్ని" మరింత బలోపేతం చేస్తానని ఆమె చెప్పారు.

    నలభై ఏడేళ్ల నావల్నాయ యూట్యూబ్‌లో ఒక వీడియోను విడుదల చేశారు. ఆర్కిటిక్ జైలులో నవాల్నీకి విషం ఇచ్చారని, అందువల్లే ఆయన జైలులో హఠాత్తుగా మరణించారని ఆ వీడియోలో ఆమె ఆరోపించారు.

    ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ “ఈ వీడియోలో నేను ఉండాల్సింది కాదు. నా స్థానంలో మరొకరు ఉండాల్సింది. కానీ, ఆయనను (నవాల్నీ) వ్లాదిమిర్ పుతిన్ చంపేశారు. మూడు రోజుల కిందట, పుతిన్ నా భర్త అలెక్సీ నవాల్నీని చంపేశారు."

    “నా పిల్లల తండ్రిని పుతిన్ చంపేశారు. నా జీవితంలో అత్యంత విలువైన వ్యక్తిని, నేను అమితంగా ఇష్టపడే వ్యక్తిని పుతిన్ నాకు దూరం చేశారు. అలెక్సీని పుతిన్ ఎందుకు చంపారో మనకు తెలుసు, త్వరలోనే అసలు నిజాలు తెలుస్తాయి. ఎవరు, ఎలా ఈ నేరానికి పాల్పడ్డారో తెలుస్తుంది. వారందరినీ మీ ముందు నిలబెడతాను'' అన్నారామె.

    యులియా నావల్నయా

    ఫొటో సోర్స్, Getty Images

    ''నవాల్నీ ఆశయాలను నేను ముందుకు తీసుకెళ్తా. ఈ దేశం కోసం పోరాటం కొనసాగిస్తా, అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నా. నేను నా బాధను మీతో పంచుకోవడమే కాదు, మన భవిష్యత్తును కాలరాయాలని చూస్తున్న వారిపై మీ కోపాన్ని కూడా నాతో పంచుకోవాలని కోరుకుంటున్నా.''

    అలెక్సీ నవాల్నీ రష్యన్ జైలులో శుక్రవారం మరణించారు. నవాల్నీ స్పృహ లేకుండా పడిపోయారని, తిరిగి ఆయన లేవలేదని జైలు అధికారులు తెలిపారు.

    ఆయన మరణవార్త తెలిసిన వెంటనే, ఆయన తల్లి, అతని తరఫు న్యాయవాది ఆయన జైలులో చనిపోయిన సైబీరియన్ కాలనీకి చేరుకున్నారు.

    అయితే, ఆయన 'భౌతిక కాయంపై రసాయన విశ్లేషణ జరుగుతున్నందున' రెండు వారాలపాటు మృతదేహాన్ని అప్పగించలేమని ఆయన తల్లికి రష్యా ప్రభుత్వం చెప్పినట్లు నవాల్నీ అధికార ప్రతినిధి తెలిపారు.

  8. నమస్కారం

    బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    ఎప్పటికప్పుడు తాజా వార్తలను మీకందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి