ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజీ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం.
గుడ్ నైట్.
పంజాబ్ - హరియాణా మధ్యనున్న శంభు బోర్డర్ వద్ద ఆందోళన చేస్తున్న రైతులు ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజీ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం.
గుడ్ నైట్.

ఫొటో సోర్స్, ANI
పంజాబ్ - హరియాణా మధ్యనున్న శంభు బోర్డర్ వద్ద ఆందోళన చేస్తున్న రైతులు ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించారు.
కేంద్ర ప్రభుత్వం తమ ముందు ఉంచిన ప్రతిపాదనను తిరస్కరించినట్లు శంభు బోర్డర్ వద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన రైతు సంఘాల నేతలు చెప్పారు.
రైతులతో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశంలో ఐదు పంటలకు కనీస మద్దతు ధర ఇస్తామని ప్రతిపాదించారు. కానీ, దీని కోసం నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఐదేళ్ల ఒప్పందంపై రైతులు సంతకం పెట్టాల్సి ఉంటుంది.
అయితే, చర్చల తర్వాత ప్రభుత్వ ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయని రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ చెప్పారు. 23 పంటలకు కనీస మద్దతు ధరను తాము కోరుతున్నట్లు తెలిపారు.

ఫొటో సోర్స్, TSPSC
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2022 ఏప్రిల్ 26న ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దు చేసిన కొద్ది సేపట్లోనే కొత్తగా గ్రూప్-1 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది టీఎస్‌పీఎస్‌సీ.
రద్దయిన నోటిఫికేషన్లో ఉన్న 503 పోస్టులకు మరో 60 ఖాళీలను కలుపుకొని మొత్తంగా 563 పోస్టులకు సోమవారం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నెల 23 నుంచి వచ్చే నెల 14 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని టీఎస్‌పీఎస్‌సీ తన ప్రకటనలో తెలిపింది.

ఫొటో సోర్స్, BHANU PRAKASH BJYM/FACEBOOK
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు అయింది. 2022 ఏప్రిల్ 26న ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్‌సీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
503 పోస్టులకు గ్రూప్-1 పరీక్షను గతంలో రెండుసార్లు నిర్వహించినప్పటికీ,మొదటిసారి పేపర్‌లీక్ కావడంతో, రెండోసారి బయోమెట్రిక్ తీసుకోనందున ఈ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.
దీనిపై టీఎస్‌పీఎస్‌సీ గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
అయితే ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరాక టీఎస్‌పీఎస్‌సీకి కొత్త చైర్మన్, సభ్యులను నియమించింది.
ఆ తర్వాత సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను టీఎస్‌పీఎస్‌సీ ఉపసంహరించుకుంది.

ఫొటో సోర్స్, TSPSC
తాజాగా కొత్తగా గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వడానికి గతంలో ఉన్న నోటిఫికేషన్ అడ్డంకిగా మారడంతో దాన్ని రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్‌సీ ప్రకటన విడుదల చేసింది.
గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులకు దరఖాస్తు ఫీజును వెనక్కి ఇస్తారా లేదా అన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు.

ఫొటో సోర్స్, Getty Images
పాపువా న్యూ గినియాలోని రిమోట్ హైలాండ్స్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో 64 మందికి పైగా మృతి చెందారు.
ఎంగా ప్రావిన్స్‌లో ఈ వారాంతంలో గిరిజనుల వివాదం కారణంగా కాల్పులు జరిగినట్లు ఆ దేశ పోలీసు ప్రతినిధి బీబీసీతో చెప్పారు.
హైలాండ్స్ ప్రాంతంలో గతంలోనూ హింసాత్మక ఘటనలు జరిగిన చరిత్ర ఉంది. గత కొన్నేళ్లతో పోలిస్తే ఇదే అతిపెద్ద హింస. ఈ ప్రాంతంలో అక్రమ ఆయుధాలు పెరిగాయి, ఇక్కడ హింస పెరగడానికి ఇది కూడా ఒక ముఖ్యమైన కారణం.
రాజధాని పోర్ట్ మోర్స్బీకి వాయువ్యంగా దాదాపు 600 కిలోమీటర్ల దూరంలోని వాబాగ్ పట్టణానికి సమీపంలో ఈ హింస చోటుచేసుకుంది. ఘటనా స్థలంలో మృతదేహాలను గుర్తిస్తున్నారు.
భూమి, ఆస్తి పంపిణీకి సంబంధించి తరచూ జరుగుతున్న గిరిజన వివాదాలు నిరుడు జూలైలో ఎంగాలో మూడు నెలల లాక్‌డౌన్‌కు దారితీశాయి. ఆ సమయంలో పోలీసులు కర్ఫ్యూ, ప్రయాణ ఆంక్షలు విధించారు.

ఫొటో సోర్స్, Reuters
గాజాలో బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలను మార్చి 10వ తేదీలోపు విడుదల చేయకుంటే రఫాపై దాడులు చేస్తామని ఇజ్రాయెల్ వార్ క్యాబినెట్ సభ్యుడు బెన్నీ గాంజ్ హెచ్చరించారు.
గాజా దక్షిణ ప్రాంతంలోకి తమ సైన్యం ప్రవేశిస్తుందని ఇజ్రాయెల్ చెప్పడం ఇదే తొలిసారి. గాజాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పాలస్తీనియన్లు ఇక్కడ తలదాచుకుంటున్నారు. దాదాపు 15 లక్షల మంది ప్రజలు రఫాలో ఆశ్రయం పొందుతున్నారు.
ఇజ్రాయెల్ దాడి తరువాత, దక్షిణ గాజాలోని ఒక పెద్ద ఆసుపత్రి మూతపడిందని యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ తెలిపింది. అక్కడి పరిస్థితిని అంచనా వేసేందుకు రఫా ప్రాంతంలోని ఖాన్ యూనిస్ పట్టణంలో ఉన్న నాజర్ ఆస్పత్రికి వెళ్లేందుకు అనుమతించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) గురువారం ఆసుపత్రి కాంపౌండ్‌లోకి ప్రవేశించాయి. బందీలను ఈ ఆస్పత్రిలో ఉంచినట్లు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సమాచారం.
ఇది కచ్చితమైన సమాచారమని, ఆస్పత్రులన హమాస్ టెర్రరిజం కోసం వాడుకుంటోందని ఐడీఎఫ్ ఆరోపించింది.
"రంజాన్ నాటికి మా బందీలు ఇంటికి రాకపోతే, రఫాతో పాటు అన్ని ప్రాంతాలపై దాడులు కొనసాగుతామయని ప్రపంచానికి తెలియాలి, హమాస్‌కి తెలియాలి'' అని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మాజీ మంత్రి, వార్ క్యాబినెట్ సభ్యుడు గాంజ్ అన్నారు.
ఈ ఏడాది మార్చి 10 నుంచి రంజాన్ ప్రారంభం కానుంది.
బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
ఎప్పటికప్పుడు తాజా వార్తలను మీకందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి