రోహిత్ శర్మ సారథ్యంలో టీ20 ప్రపంచకప్ భారత్ సొంతం చేసుకుంటుంది: బీసీసీఐ కార్యదర్శి జై షా
వచ్చే టీ20 వరల్డ్ కప్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని జై షా పరోక్షంగా సంకేతాలిచ్చారు.
లైవ్ కవరేజీ
పాకిస్తాన్: నా విజయం కోసం ‘రిగ్గింగ్’ చేశారంటూ గెలిచిన సీటును వదిలేసిన అభ్యర్థి
ఏడీఆర్ నివేదిక: అత్యధిక విరాళాలు బీజేపీకే
హార్దిక్ పాండ్యాను కాదని రోహిత్ శర్మకు మరోసారి టీ20 కెప్టెన్సీ ఇవ్వడానికి కారణం ఇదేనా?
యూథనేషియా: చేతిలో చెయ్యేసి మృత్యు ఒడిలోకి.. నెదర్లాండ్స్ మాజీ ప్రధాని జంట ఇలా ఎందుకు చనిపోయారు?
రైతుల ఆందోళన: శంభు బోర్డర్ వద్ద మూడో రోజు

పంజాబ్, హరియాణా మధ్యనున్న శంభు బోర్డర్ వద్ద గురువారం మూడో రోజు కూడా రైతుల ఆందోళన కొనసాగుతోంది.
బీబీసీ ప్రతినిధులు అభినవ్ గోయెల్, షాద్ మిధాత్ శంభు సరిహద్దులో ఉన్నారు.
గురువారం ఉదయం బీబీసీ రిపోర్టర్లకు కనిపించిన దృశ్యాలు ఇవే:
మందపాటి నల్లటి తీగతో రైతులు ఒక రకమైన బారికేడింగ్ తయారు చేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వంతో సమావేశం ఉందని, అప్పటి వరకు ఈ తీగ దాటి వెళ్లబోమని రైతులు చెబుతున్నారు.
ఈ వార్త రాసే సమయం వరకూ హరియాణా వైపు నుంచి ఎలాంటి టియర్ గ్యాస్ షెల్స్ పడలేదు.
ఇక్కడి పరిస్థితి శాంతియుతంగానే ఉంది. అవతలి వైపు హరియాణా పోలీసులు, పారామిలటరీ దళాలు నిల్చుని ఉన్నాయి.



ఫొటో క్యాప్షన్, పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడం బీబీసీ ప్రతినిధి చూశారు. ఈ టియర్ గ్యాస్ షెల్స్‌ను డ్రోన్స్ ద్వారా ప్రయోగించారు. టియర్ గ్యాస్ షెల్స్ చూపుతున్న రైతులు. ఖతార్ ఎమిర్‌తో ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు

ఫొటో సోర్స్, ANI
ఖతార్ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం దోహాలో ఖతార్ ఎమిర్ షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ అల్-తానితో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతం దిశగా ఇద్దరు నేతలు చర్చలు జరిపారు.
''ఖతార్ ఎమిర్ షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ అల్-తానితో అద్భుతంగా చర్చలు జరిగాయి. భారత్-ఖతార్ మధ్య మెరుగైన స్నేహ సంబంధాల దిశగా చర్చలు జరిగాయి'' అని మోదీ ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేశారు.
''వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, ఆర్థిక రంగాల్లో ద్వైపాక్షిక సహకారం పెంపుదలపై చర్చలు జరిగాయి'' అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ట్వీట్ చేశారు.
''దోహాలో ఘనస్వాగతం. ప్రవాస భారతీయులకు కృతజ్ఞతలు'' అని మోదీ ట్వీట్ చేశారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం, క్యాష్ చేసుకోని బాండ్ల సొమ్మును 15 రోజుల్లో దాతలకు తిరిగి ఇచ్చేయాలి: సుప్రీం కోర్టు స్పష్టీకరణ
రోహిత్ శర్మ సారథ్యంలో టీ20 ప్రపంచకప్ భారత్ సొంతం చేసుకుంటుంది: జై షా

ఫొటో సోర్స్, Getty Images
టీ-20 క్రికెట్ ప్రపంచకప్ టోర్నీ ఈ ఏడాది జూన్‌లో అమెరికాలో జరగనుంది.
ఈ టోర్నీలో భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు బుధవారం రాజ్‌కోట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు.
''ప్రపంచ కప్ గురించి నేను ఎందుకు ఏమీ మాట్లాడడం లేదని అందరూ ఎదురుచూస్తున్నారు. 2023 ప్రపంచ కప్‌లో వరుసగా పది విజయాలు సాధించినప్పటికీ కప్ గెలవలేకపోయాం, కానీ అందరి హృదయాలను గెలుచుకున్నాం'' అని జై షా అన్నారు.
''2024లో రోహిత్ శర్మ సారథ్యంలో బార్బడోస్‌లో భారత జెండా రెపరెపలాడుతుందని నేను హామీ ఇస్తున్నా’’ అన్నారాయన.
టీ-20 క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ బార్బడోస్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ జూన్ 29న జరగనుంది.
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
