ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజీ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం.
గుడ్ నైట్.
దిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులకు భారత రెజ్లర్లు సాక్షి మలిక్, బజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్ మద్దతుగా నిలిచారు. రైతుల మీద పోలీసుల చర్యపై రెజ్లర్లు విచారం వ్యక్తం చేశారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజీ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం.
గుడ్ నైట్.

ఫొటో సోర్స్, AFP
లెబనాన్‌లో ప్రతీకార వైమానిక దాడులకు దిగామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
ఇంతకుముందు ఇజ్రాయెల్‌లోని పలు లక్ష్యాలపై లెబనాన్ వైపు నుంచి క్షిపణులు ప్రయోగించారని ఐడీఎఫ్ తెలిపింది.
దాడిలో సఫెద్‌లోని నార్తర్న్ కమాండ్ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.
ఈ దాడిలో ఒక మహిళ మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఇజ్రాయెల్‌పై దాడికి పాల్పడినట్లు భావిస్తున్న హిజ్బుల్లా దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
లెబనాన్‌లో జరిగిన వైమానిక దాడులకు గ్రామాలు దెబ్బతిన్నాయని, భవనాలు అగ్నికి ఆహుతయ్యాయని అక్కడి మీడియా పేర్కొంది.

ఫొటో సోర్స్, ANI
దిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులకు భారత రెజ్లర్లు సాక్షి మలిక్, బజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్ మద్దతుగా నిలిచారు. రైతుల మీద పోలీసుల చర్యపై రెజ్లర్లు విచారం వ్యక్తం చేశారు.
‘‘దేశానికి అన్నం పెట్టే రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు చాలా బాధేస్తోంది. ప్రభుత్వం రైతులతో మాట్లాడి, వారి సమస్యలు పరిష్కరించాలి. వారికిచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నా’’ అని సాక్షి మలిక్ సోషల్ మీడియా వేదిక ఎక్స్(ట్విటర్)లో తెలిపారు.
"దేశానికి తిండి పెట్టే రైతులకు గౌరవం దక్కాలి, ఈ రకంగా కాదు. వారిని బాధపెట్టే బదులు ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించాలి" అని బజరంగ్ పూనియా కోరారు.
రైతుల సమస్యలను పరిష్కరించాలని, వారిపై ఇలాంటి దౌర్జన్యాలను ఖండించాలని మరో రెజ్లర్ వినేష్ ఫోగట్ ట్వీట్‌లో తెలిపారు.
గత సంవత్సరం అప్పటి రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా దిల్లీలో ఈ రెజ్లర్లు ఆందోళన నిర్వహించారు.

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి వచ్చిన సోనియా గాంధీ జైపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఒక ప్రకటన విడుదల చేశారు. నాలుగు రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నామినేట్ చేస్తూ విడుదల చేసిన ఆ ప్రకటనలో, రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ పోటీలో ఉన్నట్లు పేర్కొన్నారు.
సోనియా గాంధీ ఈసారి రాజ్యసభకు పోటీ చేస్తారని గత కొద్దికాలంగా ప్రచారం జరిగింది.
ప్రస్తుతం సోనియా గాంధీ లోక్ సభ సభ్యురాలు. రాయ్‌బరేలీ నుంచి ఆమె లోక్ సభకు ఎన్నికయ్యారు.
ఈ ఎన్నికలో విజయం సాధిస్తే ఆమె ఈ పదవిని తొలిసారి చేపట్టినట్లు అవుతుంది.
ఇంతకు ముందు ఆమె ఐదుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు. 1999లో జరిగిన ఎన్నికల్లో సోనియా గాంధీ తొలిసారి విజయం సాధించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, RAHAT DAR/EPA-EFE/REX/SHUTTERSTOCK
పాకిస్తాన్‌లో నవాజ్ షరీఫ్ పార్టీ పీఎంఎల్-ఎన్, బిలావల్ భుట్టో నేతృత్వంలోని పీపీపీ మధ్య సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది.
ప్రధాన మంత్రి ఎన్నికలో పీఎంఎల్-ఎన్‌కు మద్దతు ఇస్తామని పీపీపీ గత వారం ఎన్నికల అనంతరం తెలిపింది.
ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేసినప్పటికీ దేశ ప్రయోజనాల దృష్ట్యా పీఎంఎల్-ఎన్, పీపీపీ ఒక్కటవుతాయని పీపీపీ నేత అసిఫ్ అలీ జర్దారీ విలేఖరుల సమావేశంలో తెలిపారు.
రాజకీయ సుస్థిరత కోసం పరస్పరం సహకరించుకునేందుకు ఇరుపార్టీలు అంగీకరించాయని పీఎంఎల్-ఎన్ ఒక ప్రకటనలో తెలిపింది.
2022లో ఇమ్రాన్ ఖాన్‌ను అధికారం నుంచి దించడంలో ఈ రెండు పార్టీలు కూటమిగా పనిచేశాయి.
అయితే, ఈసారి ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుతో ఎన్నికల బరిలో దిగిన స్వతంత్ర అభ్యర్థులు అనూహ్యంగా అత్యధిక స్థానాలను గెలుచుకున్నారు.
మొత్తం 266 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పీటీఐ 93 స్థానాలను కైవసం చేసుకోగా, పీఎంఎల్ - ఎన్ 75, పీపీపీ 54 స్థానాల్లో విజయం సాధించాయి. దీంతో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే దానిపై గత కొన్నిరోజులుగా సందిగ్ధత నెలకొంది.

ఫొటో సోర్స్, Getty Images
కేంద్ర ప్రభుత్వంతో రైతు సంఘాల చర్చలు విఫలం కావడంతో నిరసనగా బయలుదేరిన రైతులు దిల్లీ వైపు చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి ఆందోళన కొనసాగుతోంది.
పంజాబ్ - హరియాణా మధ్యనున్న శంభు బోర్డర్ వద్ద రైతులను చెదరగొట్టేందుకు మంగళవారం రాత్రి భద్రతా బలగాలు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించినట్లు ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.
పంజాబ్, హరియాణా, యూపీ రైతుల 'దిల్లీ చలో' పిలుపుతో దిల్లీ చుట్టుపక్కల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ రైతులను అడ్డుకునేందుకు భారీగా పోలీసులను మోహరించారు.
అయినప్పటికీ దిల్లీ చలో కార్యక్రమం కొనసాగుతుందని రైతులు ప్రకటించారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లు, ఇనుప కంచెలతో భద్రతా చర్యలు చేపట్టారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.