ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజీ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం.
గుడ్ నైట్.
బిహార్ అసెంబ్లీలో సోమవారం నిర్వహించిన బలపరీక్షలో నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మెజార్టీ దక్కించుకుంది.
బీబీసీ తెలుగు లైవ్ పేజీ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం.
గుడ్ నైట్.

'దిల్లీ మార్చ్' నినాదంతో తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ నిరసనకు పిలుపునిచ్చిన రైతు నాయకుల బృందం చండీగఢ్‌కు చేరుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందంతో ఈ నాయకులు చర్చలు జరపనున్నారు.
ప్రభుత్వం తరఫున వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, హోమ్ శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రైతులతో మాట్లాడనున్నారు.
రైతుల సమస్యలను పరిష్కరించాలని, తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రైతు సంఘాలు యునైటెడ్ కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా ఫిబ్రవరి 13న 'దిల్లీ మార్చ్'కి పిలుపునిచ్చాయి.
అలాగే, ఫిబ్రవరి 16న ఒకరోజు గ్రామీణ భారత్ బంద్‌కు యునైటెడ్ కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది.
‘‘కనీస మద్దతు ధర కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దానితో పాటు ఉద్యమ సమయంలో రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని కూడా చెప్పింది. అలాగే, లఖింపూర్ ఖేరిలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు, గాయపడిన వారికి పది లక్షల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పింది’’ అని రైతులు చెప్పారు. వీటిని అమలు చేయాలని కోరుతున్నామన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
రైతుల నిరసన నేపథ్యంలో దిల్లీ-హర్యానా సరిహద్దులో ఉన్న సింఘు బోర్డర్ వద్ద భారీ ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు.
ఈ నిరసన నేపథ్యంలో దిల్లీ ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధిస్తూ ప్రకటన విడుదల చేశారు.

ఫొటో సోర్స్, DELHI POLICE

ఫొటో సోర్స్, Bihar Vidhan Sabha TV
బిహార్ అసెంబ్లీలో సోమవారం నిర్వహించిన బలపరీక్షలో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మెజార్టీ దక్కించుకుంది.
విశ్వాస పరీక్షకు ఓటింగ్ జరగడానికి ముందు, ఆర్‌జేడీతో సహా విపక్ష పార్టీలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశాయి.
విశ్వాస పరీక్షకు అనుకూలంగా 129 ఓట్లు పడ్డాయి. ఈ పరీక్షలో నెగ్గేందుకు 122 ఓట్లు అవసరం.
అసెంబ్లీలో విశ్వాస పరీక్ష తీర్మానాన్ని నితీశ్ కుమార్ ప్రవేశపెట్టారు. తొలుత ఈ తీర్మానంపై చర్చ జరిగింది. ఆ తర్వాత నితీశ్ కుమార్ అసెంబ్లీలో ప్రసంగించారు.
దీనికి ముందు, స్పీకర్ అవధ్ బిహారీ చౌధరికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి కూడా ఆమోదం లభించింది.

ఫొటో సోర్స్, Bihar Legislative Assembly TV
బిహార్ అసెంబ్లీలో స్పీకర్‌కు వ్యతిరేకంగా చేపట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించారు.
125 మంది సభ్యులు స్పీకర్‌ను తొలగించేందుకు ఓటేయగా.. స్పీకర్‌గా ఆయనే కొనసాగాలని 112 మంది ఓటేశారు.
అవిశ్వాస తీర్మానానికి ముందు బిహార్ అసెంబ్లీ స్పీకర్ అవధ్ బిహారీ చౌధరి తన స్పీకర్ పదవి నుంచి వైదొలిగారు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ మహేశ్వర్ హజారి స్పీకర్ పదవిని చేపట్టారు.
బీజేపీ ఎమ్మెల్యే నంద్ కిశోర్ యాదవ్ ఈ ప్రతిపాదనను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

ఫొటో సోర్స్, BHANU PRAKASH BJYM/FACEBOOK
తెలంగాణలో గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకునేందుకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) సిద్ధమైంది.
నిరుడు అక్టోబర్ 21న దాఖలు చేసిన ఈ స్పెషల్‌లీవ్ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించాలంటూ ఈ నెల 8న మరో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ కేసు విత్‌డ్రాకు సుప్రీం కోర్టు అనుమతిస్తే గతంలో నిర్వహించిన పరీక్ష రద్దవడంతో పాటు అభ్యర్థులు మరోసారి పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
దీంతో సుప్రీం కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

ఫొటో సోర్స్, Getty Images
దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ 'హింసాత్మక' వైమానిక దాడులు జరిపినట్లు వార్తలు వస్తుండగా, రఫాలో జరిగిన దాడుల్లో ఇద్దరు బందీలను కాపాడినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.
బందీల పరిస్థితి బాగానే ఉందని, వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించామని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
అయితే, రఫాలో దాడులు జరుగుతూనే ఉన్నాయని, ఈ దాడుల్లో చాలా మంది మరణించారని అంతకుముందు పాలస్తీనియన్ రెడ్ క్రెసెంట్ చెప్పింది.
ఇజ్రాయెల్ మాత్రం దక్షిణ గాజాలో దాడులు చేస్తున్నట్లు చెబుతోంది, అంతకుమించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

ఫొటో సోర్స్, Reuters
బిహార్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, అంతకంటే ముందు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సభలో బలం నిరూపించుకోవాల్సి ఉంది.
పట్నాలో ముఖ్యమంత్రి నితీశ్ నివాసంలో ఆదివారం సాయంత్రం జేడీయూ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. అందరు ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరైనట్లు చెబుతున్నారు.
బల నిరూపణకు 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం అవుతుంది.
బలపరీక్షకు ముందు ఆదివారం రాత్రి ఆర్జేడీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ నివాసం బయట భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
అసెంబ్లీలో ఏ పార్టీ బలమెంత?
అధికార పక్షం వైపు..
జేడీయూ - 45
బీజేపీ - 78
డబ్ల్యూఈ - 4
ఇండిపెండెంట్ - 1
ప్రతిపక్షం వైపు..
ఆర్జేడీ - 79
కాంగ్రెస్ - 19
వామపక్షాలు - 16
ఏఐఎంఐఎం - 1
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.