పాకిస్తాన్ ఎన్నికల్లో గెలుపు తమదేనన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ, ఫలితాల జాప్యంపై నిరసనలు

పాకిస్తాన్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించామని పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) ప్రకటించుకుంది, అయితే ఫలితాల వెల్లడిలో జాప్యంపై దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. దిల్లీ సరిహద్దుల్లో ఈ నెల 13న రైతుల నిరసన, భద్రత కట్టుదిట్టం

    రైతుల నిరసన

    ఫొటో సోర్స్, ANI

    రైతులు ఈ నెల 13వ తేదీన చేపట్టనున్న ‘దిల్లీ-చలో’ నిరసన నేపథ్యంలో దేశ రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

    సింఘ్ బోర్డర్‌ సమీపంలో భద్రతను పెంచడంతో, జీటీ కర్నాల్ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

    దిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా ఘజియాబాద్ బోర్డర్‌కు వెళ్లి భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు.

    ఉత్తరప్రదేశ్ బోర్డర్‌లో సెక్షన్ 144 కింద ప్రత్యేక ఆంక్షలు విధించారు.

    దిల్లీ, ఉత్తర ప్రదేశ్ సరిహద్దుల్లో ప్రజలు గుమ్మికూడటాన్ని నిషేధిస్తున్నట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. దిల్లీలోకి నిరసనకారులు రాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.

    కనీస మద్దతు ధరతో పాటు రైతుల ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసనకు పిలుపునిచ్చారు. రైతులు తమ డిమాండ్లు నెరవేరే వరకు దిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తామన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. పాకిస్తాన్ ఎన్నికలు: షరీఫ్, భుట్టో పార్టీల కూటమి సాధ్యమవుతుందా?

  4. అండర్-19 మెన్స్ వరల్డ్ కప్‌: భారత్‌ను ఓడించిన ఆస్ట్రేలియా

  5. ఆంధ్రప్రదేశ్: అసెంబ్లీ ఎన్నికల్లో దశాబ్దాలుగా ఆ కుటుంబాలదే హవా, ఎవరు వారు, ఏయే సీట్లు...

  6. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్: టాస్ గెలిచిన ఆసీస్, మొదట బౌలింగ్ చేయనున్న భారత్

    అండర్ 19 క్రికెట్ ప్రపంచకప్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, అండర్-19 ప్రపంచకప్

    ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా జ‌రుగుతున్న అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ తుది పోరుకు భారత్, ఆస్ట్రేలియా జట్లు సిద్ధమయ్యాయి.

    ఫైనల్లో టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టుకు ఉదయ్ సహారన్, ఆసీస్ జట్టుకు హ్యూ వీబ్ జెన్ నాయకత్వం వహించనున్నారు.

    భారత జట్టు : ఉదయ్ సహారన్ (కెప్టెన్), ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ముషీర్ ఖాన్, ప్రియాంషు మోలియా, సచిన్ దాస్, ఆరవెల్లి అవనీష్(కీపర్), మురుగన్ అభిషేక్, రాజ్ లింబానీ, నమన్ తివారీ, సౌమీ పాండే.

    ఆస్ట్రేలియా జట్టు: హ్యూ వీబ్‌జెన్ (కెప్టెన్), హ్యారీ డిక్సన్, సామ్ కొన్‌స్టాస్, హర్జాస్ సింగ్, ర్యాన్ హిక్స్(కీపర్), ఆలివర్ పీక్, రాఫ్ మాక్‌మిల్లన్, చార్లీ ఆండర్సన్, టామ్ స్ట్రాకర్, మహ్లీ బార్డ్‌మాన్, కల్లమ్ విడ్లర్.

  7. అండర్-19 క్రికెట్ ప్రపంచకప్‌ను భారత్ ఆరోసారి గెలుస్తుందా... ఆస్ట్రేలియాతో ఫైనల్ పోరులో ఎవరిది పైచేయి?

  8. బీజేపీ 'వైట్ పేపర్' x కాంగ్రెస్ 'బ్లాక్ పేపర్': ఆర్థిక వ్యవస్థ ఎవరి పాలనలో ఎలా ఉంది?

  9. పీటర్ రోబక్: లైంగిక దాడి కేసుతో 'తీవ్ర నిరాశ'కు గురైన ఈ క్రికెటర్ 13 ఏళ్ళ కిందట ఆత్మహత్య చేసుకున్నారని తేల్చిన కోర్టు

  10. పాకిస్తాన్ ఎన్నికల్లో గెలుపు తమదేనన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ, ఫలితాల జాప్యంపై నిరసనలు

    పాకిస్తాన్ ఎన్నికలు

    ఫొటో సోర్స్, Getty Images

    పాకిస్థాన్‌లో ఎన్నికల కౌంటింగ్ మొదలై రెండు రోజులు గడుస్తున్నా ఫలితాలు పూర్తిగా ప్రకటించలేదు. ఇంకా ఏడు చోట్ల ఫలితాలు రావాల్సి ఉంది.

    ఫలితాల వెల్లడిలో జాప్యాన్ని ఖండిస్తూ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తోంది. ఎన్నికల్లో గెలుపు తమదేనని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ తెలిపింది.

    ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో పీటీఐ మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థులు అత్యధికంగా 93 సీట్లు సాధించారు.

    మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్-ఎన్) 74 స్థానాల్లో గెలిచి, రెండో స్థానంలో ఉంది.

    మూడో స్థానంలో బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ 54 సీట్లు గెలుచుకుంది. ఇతర రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు 37 స్థానాల్లో విజయం సాధించారు.

  11. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.