పాకిస్తాన్ ఎన్నికల ఫలితాలపై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటన

పాకిస్తాన్ ఎన్నికల్లో పీటీఐ మద్దతు ఉన్న అభ్యర్థులు అధిక సంఖ్యలో విజయం సాధించడంతో పార్టీ అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఏఐ టెక్నాలజీతో ప్రకటన విడుదల చేశారు.

లైవ్ కవరేజీ

  1. పీటర్ రోబక్: లైంగిక దాడి కేసుతో 'తీవ్ర నిరాశ'కు గురైన ఈ క్రికెటర్ 13 ఏళ్ళ కిందట ఆత్మహత్య చేసుకున్నారని తేల్చిన కోర్టు

  2. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజీ ఇంతటితో సమాప్తం.

    మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం.

    గుడ్ నైట్.

  3. ఇమ్రాన్ ఖాన్, నవాజ్ షరీఫ్ పార్టీలతో చర్చలకు బిలావల్ భుట్టో నిరాకరణ

    బిలావల్ భుట్టో

    ఫొటో సోర్స్, Getty Images

    పాకిస్తాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు బిలావల్ భుట్టో జర్దారీ ఇతర పార్టీలతో చర్చించేందుకు తిరస్కరించారు.

    ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి పీఎంఎల్(ఎన్), పీటీఐతో చర్చించబోమని ఆయన ప్రైవేటు ఛానల్ జియో న్యూస్ కు తెలిపారు.

    ‘‘అన్ని నియోజకవర్గాలలో ఓట్ల లెక్కింపు ముగిసి, ఫలితాల వెల్లడి కోసం ఎదురుచూస్తున్నాం’’ అని చెప్పారు.

    ఎన్నికల ముందు బిలావల్‌ను ప్రధాని అభ్యర్థిగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ప్రకటించింది.

    ఈ నేపథ్యంలో ‘‘ మేం నిర్ణయం మార్చుకోవాలనుకుంటే, కేంద్ర కమిటీతో మరోసారి సమావేశమై ఏకాభిప్రాయం సాధించాల్సి ఉంటుంది’’ అని చెప్పారు.

    దేశంలో రాజకీయ ఏకాభిప్రాయం సాధించాలనే ఆలోచనలో ఉన్నట్టు బిలావల్ చెప్పారు. ఈ ఐక్యత లేకుండా ఏమీ సాధించలేమని ఆయన తెలిపారు. గెలిచిన కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు తమతో టచ్‌లో ఉన్నట్టు ఆయన చెప్పారు.

  4. మాల్దీవుల వివాదంలో భారత్ పైచేయి సాధించిందా?

  5. విరిగిపడిన కొండ చరియల కింద 60 గంటలపాటు మూడేళ్ల చిన్నారి.. చివరకు ఎలా రక్షించారంటే

  6. పాకిస్తాన్ ఎన్నికలు: ఇమ్రాన్ ఖాన్ మద్దతుతో గెలిచిన ఇండిపెండెంట్లంతా ఇప్పుడు ఏం చేయబోతున్నారు

  7. పరీక్షల్లో ‘చీటింగ్’ను అరికట్టేందుకు తీసుకొచ్చిన కొత్త చట్టం వల్ల ఫలితం ఉంటుందా... అసలు ఈ చట్టంలో ఏముంది?

  8. కోహ్లీ మళ్లీ దూరం.. శ్రేయస్ ఔట్, చివరి మూడు టెస్టులకు భారత జట్టు ఇదే..

    భారత జట్టు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, భారత జట్టు (ఫైల్)

    ఇంగ్లండ్‌తో జరిగే చివరి మూడు టెస్టుల కోసం సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది. మొత్తం 17 మంది సభ్యులతో ప్రకటించిన జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

    కోహ్లీ వచ్చే మూడు టెస్టులకు కూడా అందుబాటులో ఉండడని బీసీసీఐ తెలిపింది. వ్యక్తిగత కారణాల వల్ల కోహ్లీని ఎంపిక చేయడం లేదని, అతని నిర్ణయాన్ని బోర్డు గౌరవిస్తుందని బీసీసీఐ పేర్కొంది.

    మరోవైపు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు ఎంపికైనప్పటికీ, ఇద్దరూ బీసీసీఐ వైద్య బృందం నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ పొందిన తరువాతే తుది జట్టులోకి వస్తారని తెలిపింది.

    ఇక, శ్రేయస్ అయ్యర్‌కు జట్టులో చోటు కల్పించలేదు.

    భారత జట్టు: రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్.

    మూడో టెస్టు ఫిబ్రవరి 15న రాజ్‌కోట్‌లో, నాలుగో టెస్టు ఫిబ్రవరి 23న రాంచీలో, ఐదో టెస్టు మార్చి 7న ధర్మశాలలో జరగనున్నాయి.

    హైదరాబాద్‌ టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించగా, విశాఖ టెస్టులో ఇండియా విజయం సాధించింది.

  9. పాకిస్తాన్ ఎన్నికల ఫలితాలపై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటన

    ఇమ్రాన్ ఖాన్

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, ఇమ్రాన్ ఖాన్ (ఫైల్)

    ప్రజలు ఓటు ద్వారా నిజమైన స్వేచ్ఛకు పునాది వేశారని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

    ఇమ్రాన్ ఖాన్ సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్(ట్విటర్)లో ఏఐ వాయిస్‌తో ఎడిట్ చేసిన వీడియోను పోస్టు చేశారు.

    పీటీఐ మద్దతుతో 2024 ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులను అభినందిస్తున్నానని, 170 సీట్లు గెలవబోతున్నామని తెలిపారు.

    పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలోని 265 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

    ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాల్లో పీటీఐ మద్దతిచ్చిన 84 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందగా, నవాజ్ షరీఫ్ పీఎంఎల్ (ఎన్) నుంచి 70 మంది అభ్యర్థులు విజయం సాధించారు.

    పీపీపీ 51 స్థానాల్లో, ఇతర అభ్యర్థులు 31 స్థానాల్లో విజయం సాధించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఎన్నికల తీరుపై బ్రిటన్, అమెరికా ఆందోళన

    పాకిస్తాన్‌లో జరిగిన ఎన్నికల తీరుపై అమెరికా, బ్రిటన్‌లు ఆందోళన వ్యక్తం చేశాయి.

    ప్రాథమిక మానవ హక్కులను కాపాడాలని పాకిస్థాన్‌ అధికారులకు తమ దేశం విజ్ఞప్తి చేస్తోందని బ్రిటన్‌ విదేశాంగ మంత్రి డేవిడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అధికారికంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని పార్టీలను అనుమతించకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు.

    పాకిస్థాన్ ఎన్నికల సందర్భంగా భావప్రకటనా స్వేచ్ఛ, శాంతియుత సభలపై నిషేధం విధించడాన్ని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ విమర్శించారు.

  10. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.