ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజీ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం.
గుడ్ నైట్.
దేశాన్ని సుడిగుండం నుంచి గట్టెక్కించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, అందుకోసం అన్ని పార్టీలూ కలిసి రావాలని పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆహ్వానించారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజీ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం.
గుడ్ నైట్.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ శుక్రవారం సాయంత్రం లాహోర్‌లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఆయనతో పాటు షాబాజ్ షరీఫ్, మరియం నవాజ్ కూడా ఉన్నారు.
‘‘దేశాన్ని సుడిగుండం నుంచి గట్టెక్కించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. దేశం ఆశలను నెరవేర్చే విధంగా మనం పనిచేయాలి. అప్పుడే ఈ సుడిగుండం నుంచి బయటపడగలం’’ అని ఆయన పిలుపు ఇచ్చారు. కనీసం పదేళ్లు స్థిరత్వం అవసరమని, అప్పుడే దేశ పరిస్థితులు మెరుగుపడతాయన్నారు.
దేశంలోని అన్ని పార్టీలు కలిసి కూర్చుని, ఎలా ముందుకెళ్లాలనే విషయంపై నిర్ణయం తీసుకుందామని ఆయన పిలుపునిచ్చారు.
పీపీఎం, ఎంక్యూఎం, మౌలానా ఫజల్-ఉర్-రెహ్మాన్‌లను కలిసే బాధ్యతను షాబాజ్ షరీఫ్‌కు అప్పగించినట్లు నవాజ్ షరీఫ్ చెప్పారు.
ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమనేంత విశ్వాసం తమకు లేదని, అందువల్ల తమతో కలిసి రావాలని ఇతర పార్టీలను ఆహ్వానిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
తెలుగు వ్యక్తి, మాజీ ప్రధాని పాములపర్తి వెంకట (పీవీ) నరసింహారావుకు భారతరత్న అవార్డు ప్రకటించారు.
ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఎక్స్ (ట్విటర్) ద్వారా వెల్లడించారు.
ఆయనతో పాటు మరో మాజీ ప్రధాని చౌధురి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్‌లకు కూడా భారతరత్న అవార్డులు ప్రకటించారు.
నరసింహారావు భారతదేశానికి వివిధ హోదాలలో విస్తృతంగా సేవలందించారని,భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో పీవీ దూరదృష్టి కీలకపాత్ర పోషించిందని, దేశం శ్రేయస్సు, అభివృద్ధికి బలమైన పునాది వేసిందని మోదీ కొనియాడారు.
చౌధురి చరణ్ సింగ్ తన జీవితమంతా రైతుల హక్కులు, వారి సంక్షేమం కోసం అంకితం చేశారని ప్రధాని ప్రశంసించారు.
డాక్టర్ స్వామినాథన్ దార్శనిక నాయకత్వం భారతీయ వ్యవసాయాన్ని మార్చడమే కాకుండా దేశంఆహార భద్రత, శ్రేయస్సుకు హామీ ఇచ్చిందని మోదీ ప్రశంసించారు.
కరీంనగర్ నుంచి దిల్లీకి..
పి.రంగారావు కుమారులైన శ్రీ పి.వి. నరసింహారావు 1921 జూన్ 28న కరీంనగర్‌లో జన్మించారు. హైదరాబాద్ ఉస్మానియా, ముంబయి, నాగ్‌పూర్ యూనివర్శిటీలలో చదువుకున్నారు. నరసింహారావుకు ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.
వ్యవసాయవేత్తగా, న్యాయవాదిగా ఉన్న నరసింహారావు రాజకీయాల్లో చేరి కొన్ని ముఖ్యమైన పదవులు నిర్వహించారు.
1950 దశకం నుంచి 1970 దశకం వరకు అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్న పీవీ 1977లో లోక్‌సభకు ఎన్నికై 1980 నుంచి కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. 1991 జూన్ 21 నుంచి 1996 మే 16 వరకు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌లో సార్వత్రిక ఎన్నికల ఓట్ల కౌంటింగ్ జరుగుతోంది. జాతీయ అసెంబ్లీలోని 265 స్థానాల ఫలితాలు వెల్లడి కానున్నాయి.
ఇప్పటివరకు 11 స్థానాలకు పాకిస్తాన్ ఎన్నికల సంఘం ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాల్లో పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీ ఐదు స్థానాల్లో విజయం సాధించింది.
ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ)కి మద్దతుగా పోటీ చేసిన నలుగురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ రెండు స్థానాల్లో విజయం సాధించింది.
పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో 336 సీట్లున్నాయి. వీటిలో 266 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. మిగతా 70 సీట్లు మహిళలు, మైనారిటీలకు కేటాయిస్తారు. అయితే ఒక స్థానంలో అభ్యర్థి చనిపోవడంతో 265 సీట్లకు మాత్రమే ఎన్నికలు జరిగాయి.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.