ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజీ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం.
గుడ్ నైట్.
ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రూ. 2,86,389 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ద్రవ్యలోటు రూ. 55,817 కోట్లుగా ప్రకటించారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజీ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం.
గుడ్ నైట్.

ఫొటో సోర్స్, ANI
ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్ - యూసీసీ) బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ బుధవారం ఆమోదం తెలిపింది. దేశంలో యూసీసీ బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రం ఇదే.
ఉత్తరాఖండ్‌లో బీజేపీ ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ మంగళవారం ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.
బిల్లుపై జరిగిన చర్చకు సీఎం పుష్కర్ సింగ్ ధామీ సమాధానమిస్తూ- ఇది చరిత్రాత్మకమైనదని, దీనిపై అర్థవంతమైన చర్చ జరిగిందని వ్యాఖ్యానించారు.
ఇది సాధారణ బిల్లు కాదని, ఇది దేశ ఐక్యతకు తోడ్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులెవరూ ఈ బిల్లును వ్యతిరేకించలేదు.
యూసీసీ బిల్లు ముఖ్యమైనదని, అయితే దీనిని సెలక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్ష నేత యష్పాల్ ఆర్య, కాంగ్రెస్ ఇతర ఎమ్మెల్యేలు కోరారు.

ఫొటో సోర్స్, Getty Images
ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా నంబర్ వన్ స్థానంలో నిలిచాడు.
టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఓ భారత పేసర్ అగ్రస్థానంలో నిలవడం ఇదే మొదటిసారి.
విశాఖలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో బుమ్రా 9 వికెట్లు పడగొట్టాడు. దీంతో ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి అగ్రస్థానానికి చేరుకున్నాడు.

ఫొటో సోర్స్, i&PR
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
2024–25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ రూ. 2,86,389 కోట్లుగా అందులో రెవెన్యూ వ్యయం రూ.2,30,110 కోట్లు, ద్రవ్యలోటు రూ.55,817 కోట్లుగా బుగ్గన ప్రకటించారు.
మూలధన వ్యయం రూ.30,530 కోట్లు, రెవెన్యూ లోటు రూ.24,758 కోట్లు, జీఎస్టీపీలో రెవెన్యూ లోటు 1.56 శాతం, జీఎస్టీపీలో ద్రవ్యలోటు 3.51 శాతంగా తెలిపారు.
బుధవారం మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు.

ఫొటో సోర్స్, I & PR
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఉదయం అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.
ఆర్థిక సంవత్సరం మొత్తానికి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించినా ఏప్రిల్, మే, జూన్, జులై నెలలకు మాత్రమే బడ్జెట్ ఆమోదం తీసుకుంటారు.
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
సచివాలయంలోని ముఖ్యమంత్రి చాంబర్‌లో బుగ్గన రాజేంద్రనాథ్, ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు సీఎం జగన్‌కు బడ్జెట్ ప్రతులను అందజేశారు.

ఫొటో సోర్స్, Getty Images
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, అజిత్ పవార్ వర్గానిదేనని ఎన్నికల సంఘం నిర్ణయించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని శరద్ పవార్ వర్గం ఆరోపించింది.
మంగళవారం ఎన్నికల సంఘం అజిత్ పవార్ వర్గాన్ని నిజమైన ఎన్‌సీపీగా ప్రకటించడమే కాకుండా వారికి పార్టీ ఎన్నికల చిహ్నం 'గోడ గడియారం' కూడా ఇచ్చింది.
ఒత్తిడి మేరకే ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్లు శరద్ పవార్ వర్గం నాయకుడు అనిల్ దేశ్‌ముఖ్ ఆరోపించారు. శివసేన విషయంలో కూడా ఇదే నిర్ణయం తీసుకున్నట్లు దేశ్‌ముఖ్ ఆరోపించారు.
మరోవైపు ఎన్నికల సంఘం ప్రకటనపై అజిత్ పవార్ వర్గం నేత ప్రఫుల్ పటేల్ సంతోషం వ్యక్తం చేశారు.
2023 జులైలో ఎన్‌సీపీలో తిరుగుబాటు చేసి అజిత్ పవార్ అధికార ఎన్టీయేలో చేరిపోయారు. ఆయనతో పాటు పలువురు ఎమ్మెల్యేలూ వెళ్లారు. మరో వర్గం శరద్ పవార్‌తో ఉంది. దీంతో పార్టీ, పార్టీ గుర్తు ఎవరిదనే వివాదం ఎన్నికల సంఘం వద్దకు చేరింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.