ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజీ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం.
గుడ్ నైట్.
ఆంధ్రప్రదేశ్ శాసన సభ్ రెండో రోజు సమావేశాలు మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ఇవాళ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది.
బీబీసీ తెలుగు లైవ్ పేజీ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం.
గుడ్ నైట్.

ఫొటో సోర్స్, Getty Images
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
బెనోనిలో మంగళవారం జరిగిన సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను భారత్ రెండు వికెట్ల తేడాతో ఓడించింది.
దక్షిణాఫ్రికా నిర్దేశించిన 245 పరుగుల లక్ష్యాన్ని ఇండియా ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించింది.
భారత జట్టులో సచిన్ ధస్ 96 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ ఉదయ్ సహరన్ 81 పరుగులు చేశాడు.
ఐదో వికెట్‌కు వీరిద్దరూ 171 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు, ఈ జంట అద్భుతంగా రాణించి, జట్టును గట్టెక్కించింది.
అంతకుముందు నిర్ణీత 50 ఓవర్లలో దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది.
దక్షిణాఫ్రికా జట్టులో జువాన్ డి ప్రిటోరియస్ 76 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్ ప్రభుత్వం భారతీయ పౌరులకు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వీసా మినహాయింపును కల్పించింది. కొత్త నిబంధనలు ఫిబ్రవరి 4న అమల్లోకి వచ్చాయి.
ఇరాన్ కల్పించిన మినహాయింపులు:
1. సాధారణ పాస్‌పోర్టు ఉన్న భారతీయులు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వీసా అవసరం లేకుండా గరిష్ఠంగా 15 రోజుల పాటు ఇరాన్ సందర్శించవచ్చు. 15 రోజులకు మించి ఆ దేశంలో ఉండటానికి వీలు లేదు.
2. పర్యాటకం కోసం వచ్చే భారతీయులు మాత్రమే వీసా లేకుండా ఇరాన్‌కు వెళ్లవచ్చు.
3. ఒకవేళ ఎక్కువ కాలం పాటు ఇరాన్‌లో ఉండాలనుకున్నా లేదా ఆరు నెలల వ్యవధిలో ఎక్కువ సార్లు ఆ దేశాన్ని సందర్శించే పరిస్థితి ఉన్నా లేదా మరేదైనా వీసా కావాల్సి ఉన్నా భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం నుంచి వీసా పొందాలని తెలిపింది.
4. వాయు మార్గంలో ఇరాన్ సరిహద్దుల్లోకి ప్రవేశించాలనుకుంటున్న భారతీయులకు మాత్రమే ఈ వీసా మినహాయింపు వర్తిస్తుంది.

మధ్యప్రదేశ్‌లోని హర్దాలో ఒక బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో పెద్దసంఖ్యలు ప్రజలు గాయాలపాలైనట్లు వార్తలు అందుతున్నాయి.
ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
పేలుడు ఘటన గురించి సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మంత్రి ఉదయ్ ప్రతాప్ సింగ్, అడిషనల్ చీఫ్ సెక్రటరీ అజిత్ కేసరి, డీజీ (హోం గార్డ్) అర్వింద్ కుమార్ హెలికాప్టర్‌లో హర్దాకు వెళ్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
భోపాల్, ఇందోర్‌లోని ఆస్పత్రులను అలెర్ట్ చేశారు.
ఇందోర్, భోపాల్ నుంచి అగ్నిమాపక దళాలను పంపినట్లు సీఎంవో తెలిపింది.

ఫొటో సోర్స్, UGC
ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి.
మంగళవారం సమావేశాల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు.
ధరల పెరుగుదల, పన్నుల పెంపు అంశంపై చర్చకు తెలుగుదేశం పార్టీ ఇవాళ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనిపై చర్చకు అనుమతించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు.
దీనిలో భాగంగా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు.
దీంతో టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకరోజు సస్పెండ్ చేశారు.

ఫొటో సోర్స్, congress
పెద్దపల్లి ఎంపీ, బీఆర్ఎస్ నాయకుడు వెంకటేశ్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు.
దిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు.
ఝార్ఖండ్‌లో రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ రాష్ట్రానికి వెళ్లిన రేవంత్ రెడ్డి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లడానికి ముందు సోమవారం సాయంత్రం దిల్లీ వచ్చారు.
ఈ సందర్భంగా తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీలో కొందరు నాయకుల చేరికకు ఏర్పాట్లు చేశారు.

ఫొటో సోర్స్, UGC
ఆంధ్రప్రదేశ్ శాసన సభ్ రెండో రోజు సమావేశాలు మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి.
ఇవాళ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు.
ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెడతారు.
అనంతరం ధన్యవాద తీర్మానంపై సభలో చర్చ జరుగుతుంది. చర్చ అనంతరం సీఎం జగన్ సమాధానం ఇస్తారు.
ఏపీ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు- 2024, ఏపీ అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు -2024లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది.
అలాగే, పలు శాఖల నివేదికలను ప్రభుత్వం అసెంబ్లీకి సమర్పించనుంది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.