ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజీ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం.
గుడ్ నైట్.
విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌పై భారత్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
బీబీసీ తెలుగు లైవ్ పేజీ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం.
గుడ్ నైట్.

ఫొటో సోర్స్, ANI
ఝార్ఖండ్ శాసనసభలో జరిగిన విశ్వాస పరీక్షలో కొత్త ముఖ్యమంత్రి చంపయీ సోరెన్ విజయం సాధించారు.
ఝార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 80 కాగా, మెజారిటీ మార్కు 41.
విశ్వాస పరీక్షలో నెగ్గేందుకు 41 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా, చంపయీ సోరెన్‌కు అనుకూలంగా 47 మంది ఓటేశారు. 29 మంది వ్యతిరేకంగా ఓటేశారు.
మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా విశ్వాస పరీక్షకు హాజరయ్యారు.
హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేయడంతో ఆయన స్థానంలో ముఖ్యమంత్రిగా చంపయీ సోరెన్ ఇటీవల బాధ్యతలు చేపట్టారు. చంపయీ సోరెన్ ఈ రోజు బలపరీక్షను ఎదుర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నాయకత్వంలోని పాలక సంకీర్ణ కూటమిలో జేఎంఎం ఎమ్మెల్యేలు 29 మంది, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 17 మంది, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్) నుంచి ఒక్కో ఎమ్మెల్యే ఉన్నారు.
మొత్తంగా కూటమిలో 48 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యే రామ్‌దాస్ సోరెన్ ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఓటింగ్‌లో ఆయన పాల్గొనలేదు.

ఫొటో సోర్స్, Getty Images
విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌పై భారత్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
399 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ జట్టు 292 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ తలా మూడు వికెట్లు తీశారు. ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు.
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులు చేసింది. ఇంగ్లండ్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ 300లోపే ఆలౌట్ అయ్యింది. మొదటి ఇన్నింగ్స్‌లో 253 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 292 పరుగులు చేసింది.
భారత్ విజయంలో ప్రధాన పాత్ర పోషించిన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు. అతడు మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు.
ఐదు మ్యాచుల సిరీస్‌లో ఇప్పటివరకు ఇంగ్లండ్, భారత్ చెరో మ్యాచ్ గెలిచాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, UGC
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి.
తొలి రోజు ఉభయ సభల సంయుక్త సమావేశం జరిగింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమయ్యాయి.
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు గవర్నర్ ప్రసంగంలో తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రస్తావించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా పయనిస్తోందని అన్నారు.
తొలుత సమావేశాల ప్రారంభం సందర్భంగా టీడీపీ సభ్యులు ర్యాలీ నిర్వహించారు.
గవర్నర్ ప్రసంగంపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులకు ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆందోళనకు దిగారు. సభలో నినాదాలు చేసి నిరసన తెలిపారు.
గవర్నర్ ప్రసంగం పూర్తిగా వాస్తవాలకు దూరంగా ఉందంటూ టీడీపీ నేత అచ్చెన్నాయుడు విమర్శించారు. టీడీపీ సభ్యుల తీరుని మంత్రి అంబటి రాంబాబు తప్పుబట్టారు.
గవర్నర్ ప్రసంగం అనంతరం సమావేశాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి.

ఫొటో సోర్స్, YANG HENGJUN/TWITTER
ఆస్ట్రేలియన్-చైనీస్ రచయిత యాంగ్ హెంగ్జున్‌కు చైనా కోర్టు 'సస్పెండ్ డెత్' శిక్ష విధించింది.
చైనీస్ చట్టం ప్రకారం, సస్పెండెడ్ డెత్ శిక్ష విధించిన వారికి వెంటనే మరణశిక్ష అమలు చేయరు.
అమలుకు రెండేళ్ల సమయం ఉంటుంది. ఈ రెండేళ్లలో ఆ మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చే అవకాశం ఉంది.
హెంగ్జున్ కేసులో కూడా రెండేళ్ల తర్వాత మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
డాక్టర్ యాంగ్ ఓ స్కాలర్, రచయిత. చైనా వ్యవహారాలపై బ్లాగ్‌లో రాసేవారు. గూఢచర్యం ఆరోపణలపై ఐదేళ్ల కిందట చైనాలో అరెస్టయ్యారు.
యాంగ్‌ను విడుదల చేయించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం చాలాకాలంగా పిటిషన్లు వేస్తోందని, ఈ తీర్పుతో దిగ్భ్రాంతికి గురైనట్లు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ అన్నారు.
యాంగ్ గతంలో చైనా రక్షణ శాఖలో పనిచేశారు. ఆయన్ను "డెమోక్రసీ పెడ్లర్"గా పిలుస్తారు.
57 ఏళ్ల యాంగ్‌ను గూఢచర్యం ఆరోపణలతో 2019లో గ్వాంగ్‌జౌ విమానాశ్రయంలో అరెస్టు చేశారు.
యాంగ్ కేసులో రహస్య విచారణ జరిగింది, ఆయన తరఫు వాదనలు బహిర్గతం కాలేదు.

ఫొటో సోర్స్, @RecordingAcad
శంకర్ మహదేవన్ మ్యూజిక్ బ్యాండ్ 'శక్తి' రూపొందించిన 'దిస్ మూమెంట్' ఆల్బమ్ బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్‌గా ఎంపికై గ్రామీ అవార్డును సొంతం చేసుకుంది.
ఈ శక్తి బ్యాండ్‌లో గిటారిస్ట్ జాన్ మెక్‌లాఫ్లిన్, తబలా ప్లేయర్ ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, సింగర్ శంకర్ మహదేవన్ ఉన్నారు.
ఇదొక ఫ్యూజన్ బ్యాండ్. బొకాంటే, సుసానా బాకా, డేవిడో, బర్నా బే వంటి కళాకారులు ఈ వర్గంలో నామినేట్ అయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
టేలర్ స్విఫ్ట్, మైలీ సైరస్, సెజా, బిలీ ఐలిష్‌లను ఈ ఏడాది గ్రామీ అవార్డులు వరించాయి.
టేలర్ స్విఫ్ట్ ఆల్బమ్ 'మిడ్‌నైట్స్' ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకుంది.
మైలీ సైరస్ సాంగ్ 'ఫ్లవర్' రికార్డ్ ఆఫ్ ది ఇయర్, బెస్ట్ పాప్ షో కేటగిరీల్లో గ్రామీ అవార్డును అందుకుంది.
'వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్' పాటకు బిలీ ఐలిష్ 'సాంగ్ ఆఫ్ ది ఇయర్' కేటగిరీలో అవార్డు అందుకున్నారు.
సెజా-ఫిబి బ్రిడ్జర్స్ 'ఘోస్ట్ ఇన్ మెషీన్' పాట బెస్ట్ పాప్ డ్యుయో కేటగిరీలో గ్రామీ అవార్డును సొంతం చేసుకుంది.
సంగీత ప్రపంచంలో ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరుగుతోంది. మొత్తం 94 కేటగిరీల్లో కళాకారులకు అవార్డులు ప్రదానం చేస్తారు.

ఫొటో సోర్స్, EPA-EFE/REX/SHUTTERSTOCK
చిలీలోని వాల్‌పరైసో అటవీ ప్రాంతంలో రేగిన కార్చిచ్చు కారణంగా 112 మందికి పైగా మరణించారని స్థానిక అధికారులు తెలిపారు.
చిలీ అధ్యక్షులు గాబ్రియెల్ బోరిక్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
చిలీలో జరిగిన అత్యంత ఘోరమైన కార్చిచ్చుగా దీనిని చెబుతున్నారు. ఈ మంటల బారిన పడిన వారిలో సెలవుల్లో తీర ప్రాంత సందర్శనకు వచ్చిన వారే ఎక్కువ.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాల్‌పరైసో హెల్త్ అలెర్ట్ జారీ చేసింది. అత్యవసరం కాని ఆపరేషన్లను నిలిపివేయాలని, స్థానికంగా తాత్కాలిక ఫీల్డ్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ కోరింది.
కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాలకు ప్రయాణాలు చేయొద్దని చిలీ ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఉమ్మడి పౌరస్మృతి(యూనిఫాం సివిల్ కోడ్) తుది ముసాయిదాకు ఉత్తరాఖండ్ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం పలికింది. సోమవారం నుంచి ఆ రాష్ట్రంలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శాసనసభ సమావేశాలలో ఈ ముసాయిదా ప్రవేశపెట్టి చర్చించనున్నారు.
740 పేజీల ఈ ముసాయిదాను సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ రంజన్ ప్రకాశ్ దేసాయ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల కమిటీ రూపొందించింది.
ముసాయిదాకు అసెంబ్లీ ఆమోదం దక్కితే స్వాతంత్ర్యానంతరం యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేసే తొలి రాష్ట్రం ఉత్తరాఖండ్ కానుంది.
ఉత్తరాఖండ్‌కు పుష్కర్ సింగ్ ధామి ముఖ్యమంత్రి అయిన వెంటనే యూనిఫాం సివిల్ కోడ్‌పై కమిటీ 2022లో ఏర్పాటు చేశారు.
కమిటీ ఫిబ్రవరి 2న(2024) ముసాయిదా సమర్పించింది. రాష్ట్ర మంత్రిమండలి ఫిబ్రవరి 4న(2024) దీనికి ఆమోదం పలికింది.
ఇప్పుడు శాసనసభ ఆమోదం దొరికితే కోడ్ అమలులోకి వస్తుంది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసంఈ లింక్‌పై క్లిక్ చేయండి.