భారత్ వర్సెస్ ఇంగ్లండ్: 255 పరుగులకు భారత్ ఆలౌట్, ఇంగ్లండ్ టార్గెట్ 399
శుభ్‌మన్ గిల్ అత్యధికంగా 104 పరుగులు సాధించాడు. అక్షర్ పటేల్ 45 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు రాణించకపోవడంతో టీమిండియా తక్కువ స్కోరుకే పరిమితమైంది.
లైవ్ కవరేజీ
ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజీ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం.
గుడ్ నైట్.
న్యూరాలింక్: మెదడులో చిప్ అమర్చే ఎలాన్ మస్క్ ఐడియా ఈ ప్రపంచాన్ని ఎలా మార్చేయగలదు?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: కశ్మీరీ రగ్గులు, తివాచీల తయారీపై ఏఐ ఎలాంటి ప్రభావం చూపగలదు?
భారత్ వర్సెస్ ఇంగ్లండ్: 255 పరుగులకు భారత్ ఆలౌట్, ఇంగ్లండ్ టార్గెట్ 399

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, శుభ్‌మన్ గిల్ 104 పరుగులు చేశాడు. విశాఖపట్నంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. మూడో రోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్సింగ్స్‌లో ఒక వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది.
అంతకుముందు రెండో ఇన్సింగ్స్‌లో భారత్ 255 పరుగులకు ఆలౌటైంది. శుభ్‌మన్ గిల్ అత్యధికంగా 104 పరుగులు సాధించాడు. అక్షర్ పటేల్ 45 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు రాణించకపోవడంతో టీమిండియా తక్కువ స్కోరుకే పరిమితమైంది.
ఇంగ్లండ్ బౌలర్లలో టామ్ హార్ట్లే 4 వికెట్లు, రెహాన్ అహ్మద్ 3 వికెట్లు తీశారు.
ఈ 255 పరుగులు, తొలి ఇన్సింగ్స్‌లో వెనకబడిన 143 పరుగులు మొత్తంగా 399 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్సింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్, దూకుడుగా ఆడింది. ఓపెనర్లు బెన్ డకెట్ , జాక్ క్రాలే లు ఓవర్‌కు నాలుగుకు పైగా పరుగులు సాధించారు.
వీరిద్దరి జోడీని రవిచంద్రన్ అశ్విన్ 11 ఓవర్లో విడదీశాడు. 27 బంతుల్లో 28 పరుగులు చేసిన డకెట్ అశ్విన్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ వికెట్ అశ్విన్ తీశాడు. ఆటకు ఇంకా రెండు రోజులు మిగిలి ఉంది. భారత్ గెలవాలంటే మరో తొమ్మిది వికెట్లు తీయాలి. ఇంగ్లండ్ విజయం సాధించాలంటే మరో 332 పరుగులు చేయాలి. క్రీజులో జాక్ క్రాలే (29), రెహాన్ అహ్మద్ (8) ఉన్నారు.
ఉండవల్లిలో పవన్ కల్యాణ్, చంద్రబాబు సమావేశం

ఫొటో సోర్స్, TeluguDesamParty/X
ఫొటో క్యాప్షన్, చంద్రబాబును కలిసిన పవన్ టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల మధ్య కీలక భేటీ జరుగుతోంది. ఆదివారం ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లారు. ఆ సమయంలో ఏపీటీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఉన్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయనున్నట్లు గతంలో చంద్రబాబు, పవన్‌లు ప్రకటించారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
శుభ్‌మన్ గిల్ సెంచరీ, భారీ స్కోరు దిశగా భారత్

ఫొటో సోర్స్, Getty Images
విశాఖపట్నంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ సెంచరీ చేశాడు. గిల్ అద్భుత సెంచరీతో రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు మెరుగైన స్థితికి చేరుకుంది.
ప్రస్తుతం భారత జట్టు స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. భారత జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. భారత్ 363 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
గిల్ 132 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. టెస్టుల్లో ఇది మూడో సెంచరీ.
ప్రస్తుతం అక్షర్ పటేల్ (45 పరుగులు), వికెట్ కీపర్ ఎస్.భరత్ క్రీజులో ఉన్నారు. మూడో రోజు లంచ్ తర్వాత ఆట కొనసాగుతోంది.
చిలీ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు, 46 మందికి పైగా మృతి

ఫొటో సోర్స్, Reuters
సెంట్రల్ చిలీలోని వాల్‌పరైసో అటవీ ప్రాంతంలో కార్చిచ్చు కారణంగా 46 మందికి పైగా మరణించారని చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ తెలిపారు.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
సముద్రతీర పర్యాటక ప్రాంతమైన వినా డెల్ మార్ సిటీ చుట్టుపక్కల ప్రాంతాలపై అగ్నిప్రమాదం ప్రభావం తీవ్రంగా ఉందని అధికారులు తెలిపారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అగ్నిప్రమాద ప్రాంతాలకు చేరుకునేందుకు సహాయక బృందాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
పట్టణంలో 200 మందికి పైగా అదృశ్యమయ్యారని వినా డెల్ మార్ సిటీ మేయర్ చెప్పారు.
ఆ దేశ హోం శాఖ లెక్కల ప్రకారం, ఈ భారీ అగ్నిప్రమాదం దాదాపు 430 చదరపు కిలోమీటర్ల ప్రాంతంపై ప్రభావం చూపింది.
ఇన్ఫెక్షన్లు, అలర్జీలు రాకుండా కషాయం తాగొచ్చా
అడ్వాణీకి భారత రత్న ప్రకటించడంపై ఎంఐఎం నేత ఒవైసీ ఏమన్నారంటే..

ఫొటో సోర్స్, YEARS
భారత మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అడ్వాణీకి భారత రత్న పురస్కారం ప్రకటించడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ తీవ్రస్థాయిలో స్పందించారు.
మీడియా సమావేశంలో మాట్లాడుతూ అడ్వాణీకి భారత రత్న ఇవ్వడం ఆ పురస్కారానికే అవమానకరమని ఒవైసీ అన్నారు. అది తప్పుడు నిర్ణయమని ఆయన వ్యాఖ్యానించారు.
అడ్వాణీ వల్లే దేశంలో అల్లర్లు జరిగాయని, బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిందని ఒవైసీ ఆరోపించారు.
1990లో అడ్వాణీ రథయాత్ర తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగిన అల్లర్లు, ఆ అల్లర్లలో మరణించిన వారి వివరాలు అంటూ అసదుద్దీన్ ఒవైసీ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో షేర్ చేశారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
"ఎల్‌కే అడ్వాణీకి భారత రత్న దక్కింది. ఇది హింసలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల సమాధులు పెరగడానికి సూచనే తప్ప మరోటి కాదు" అని ఆయన ఎక్స్‌లో వ్యంగ్యంగా రాశారు.
''అడ్వాణీ రథయాత్ర రథయాత్ర ఎక్కడికి వెళ్తే అక్కడ హిందూ - ముస్లిం అల్లర్లు జరిగాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆయనకు అత్యున్నత పౌర పురస్కారం ఇవ్వడం దురదృష్టకరం'' అని ఒవైసీ అన్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
పాకిస్తాన్ పర్యటన సందర్భంగా దేశ విభజనకు కారణమైన మహమ్మద్ జిన్నాను అడ్వాణీ ప్రశంసించారని కూడా ఆయన ప్రస్తావించారు.
అడ్వాణీ చేపట్టిన 'రామ్ రథయాత్ర' 1990 సెప్టెంబర్ 25న గుజరాత్‌లోని సోమ్‌నాథ్‌లో ప్రారంభమై అక్టోబర్ 30న ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో ముగియాల్సి ఉంది. ఈ యాత్ర ఉద్దేశం అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడమే.
అయితే, ఈ ప్రయాణంలో అక్టోబర్ 23న బిహార్‌లోని సమస్తిపూర్‌లో ఆయన అరెస్టయ్యారు.
ఈ యాత్ర సమయంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో మతఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో చాలా మంది మరణించారు.
నమస్కారం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
