ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
తమిళ నటుడు విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. శుక్రవారం 'తమిళగ వెట్రి కళగం' పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించారు విజయ్.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, ANI
పూనమ్ పాండే మరణించినట్లు తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో శుక్రవారం ఉదయం వచ్చిన పోస్టుపై ఆమె కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు.
నటి పూనమ్ పాండే సోషల్ మీడియా పేజీలో ఆమె మరణించారనే ప్రకటన వెలువడిన తర్వాత చాలా మంది నెటిజన్లు ఈ వార్తను నమ్మడం లేదు.
అంతేకాదు, పూనమ్ పాండే కుటుంబం కూడా ఇప్పటివరకు ఆమె మరణాన్ని ధ్రువీకరించలేదు, మీడియా ముందు ఎలాంటి ప్రకటనా చేయలేదు.
పరుల్ చావ్లా మూడేళ్లుగా పూనమ్ పాండే ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పుకొంటున్నారు. దీంతో పరుల్ చావ్లాతో బీబీసీ మాట్లాడింది. పూనమ్ పాండే కుటుంబంతో తాను టచ్‌లో ఉన్నానని పరుల్ చావ్లా చెప్పారు. పూనమ్ అనారోగ్యం గురించి తనకు తెలియదన్నారు.
తదుపరి సమాచారం ఇవ్వడానికి నిరాకరించిన పరుల్, కుటుంబ సభ్యుల అంగీకారంతో పూర్తి సమాచారాన్ని మీడియాతో పంచుకుంటామని చెప్పారు.
సమాచారం లేదు: పోలీసులు
పూనమ్ పాండే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో 'మరణానికి కారణం ‘సర్వికల్(గర్భాశయ) క్యాన్సర్' అని తెలిపారు. అయితే పూనమ్ పాండేకు సర్వికల్ క్యాన్సర్ ఉందనే సమాచారం గతంలో మీడియాకు లేదు.
ఆమె కాన్పూర్‌లో మరణించారని సోషల్ మీడియాలో చర్చ జరిగింది, అయితే పూనమ్ మరణం గురించి తమకు సమాచారం లేదని కాన్పూర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
రాష్ట్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీకి బానిసలుగా మారాయని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఏపీ పీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు.
టీడీపీ, వైసీపీ ఏపీ ప్రజలను మోసం చేస్తున్నందుకు తాను ఈ రోజు దిల్లీలో ధర్నా చేస్తున్నట్లు షర్మిల తెలిపారు.
‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరుపతిలో సభ పెట్టి ఏపీ ప్రజలకు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని మాట ఇచ్చారు. కానీ, ఇవన్నీ ఏమయ్యాయని కాంగ్రెస్ పార్టీ, ఏపీ ప్రజల తరపున నేను ప్రశ్నిస్తున్నా’’ అని షర్మిల అన్నారు.
కడపలో స్టీల్ ఫ్యాక్టరీ, వైజాగ్‌లో రైల్వే జోన్, దుగరాజ పట్నానికి పోర్ట్, వైజాగ్ నుంచి చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్ తెస్తామని ఇచ్చిన హామీని ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు.
ఇవేమీ నిలబెట్టుకోకపోగా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కూడా ప్రైవేట్ పరం చేయాలని బీజేపీ చూస్తోందని ఆమె విమర్శించారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రజల నుంచి కోటి సంతకాలు సేకరించి ప్రతి ఏటా కాంగ్రెస్ పార్టీ ప్రధానికి లేఖ ఇస్తూనే ఉందని షర్మిల తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధాని అయిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదాపై సంతకం చేస్తానని హామీ ఇచ్చారని చెప్పారు.
ప్రత్యేక హోదా అనే కాదు విభజన హామీలు నెరవేర్చే వరకు కాంగ్రెస్ కొట్లాడుతూనే ఉంటుందని ఆమె తెలిపారు.

ఫొటో సోర్స్, reuters
కెన్యా రాజధాని నైరోబిలో సంభవించిన భారీ పేలుడులో ముగ్గురు మృతి చెందగా, 300 మంది గాయాల పాలయ్యారు.
‘‘స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఎంబకాసి జిల్లాలో గ్యాస్‌ను తీసుకెళ్లే ట్రక్కులో భారీ పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి’’ అని ప్రభుత్వ అధికార ప్రతినిధి చెప్పారు.

ఫొటో సోర్స్, Philip Awinyo Jeremiah/Handout via Reuters
ఈ పేలుడుతో, దగ్గర్లో ఉన్న ఇళ్లు, వాహనాలు, వ్యాపార సంస్థలకు కూడా నిప్పంటుకుంది.
గ్యాస్ ప్లాంట్‌లో ఈ అగ్నిప్రమాదం సంభవించిందని ప్రభుత్వం తొలుత చెప్పింది. కానీ, ఆ తర్వాత ప్లాంట్‌కు చెందిన పార్కింగ్ యార్డులో ఉన్న ట్రక్కులో పేలుడు సంభవించిందని తెలిపింది.
ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు.

ఫొటో సోర్స్, Reuters/Thomas Mukoya
ఈ పేలుడులో ఒక చిన్నారి చనిపోయినట్లు ఎంబకాసి జిల్లా పోలీసు అధికారి వెస్లీ కిమెటో చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందన్నారు.
గాయపడ్డ 271 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, 27 మందికి ప్రమాద స్థలంలోనే చికిత్స అందించినట్లు కెన్యా రెడ్ క్రాస్ తెలిపింది.
పెద్ద ఎత్తున చెలరేగిన అగ్నికీలలు ఆ ప్రాంతమంతా విస్తరించాయని, ఈ మంటలకు ఎగసిపడిన గ్యాస్ సిలిండర్ పక్కనే ఉన్న టెక్స్‌టైల్ ప్లాంట్‌పై పడిందని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఐజాక్ మౌరా చెప్పారు.
ఈ ప్రమాదం వల్ల ప్లాంట్ అంతా మంటల్లో తగలబడి, బూడిదైంది.

ఫొటో సోర్స్, reuters
‘‘చాలా వాహనాలు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు చెందిన ఎన్నో వాణిజ్య సంస్థలు ఈ మంటలకు ఆహుతయ్యాయి. దగ్గర్లో ఉన్న నివాస ప్రాంతాలకు కూడా మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదం రాత్రి పూట చోటు చేసుకోవడంతో, చాలా మంది ప్రజలు ఇళ్లలోనే చిక్కుకున్నారు’’ అని ప్రభుత్వ అధికార ప్రతినిధి తన ప్రకటనలో చెప్పారు.

ఈ పేలుడు తర్వాత తమకు భూకంపం వచ్చినట్లు అనిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
ఊపిరితిత్తుల్లో పొగ చేరడంతో చాలా మంది ఇబ్బంది పడ్డారు. వారిలో 25 మంది చిన్నారులు ఉన్నారు.

ఫొటో సోర్స్, actorvijay/instagram
తమిళ నటుడు విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. శుక్రవారం 'తమిళగ వెట్రి కళగం' పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించారు విజయ్.
ఇందుకు సంబంధించిన వివరాలను వార్తా సంస్థ ఏఎన్ఐ వెల్లడించింది.
'2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ బరిలో నిలుస్తుంది' అని, పార్టీ ఏర్పాటుకు సంబంధించిన అంశాలు, సిద్ధాంతాలను పేర్కొంటూ పార్టీ పేరుతో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
ఆయన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి 'టీవీకే విజయ్' అనే పేరుతో ఉన్న ట్వీట్‌ను షేర్ చేశారు.
2024 లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయబోవడం లేదని స్పష్టత ఇచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, actorvijay/instagram

ఫొటో సోర్స్, ANI
ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా జేఎంఎం వైస్ ప్రెసిడెంట్ చంపయీ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం రాాంచీలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం కాంగ్రెస్ నాయకుడు ఆలంగిర్ ఆలం కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకరం చేశారు. రాష్ట్రీయ జనతాదళ్‌కు చెందిన సత్యానంద్ భోక్త కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే కన్నుమూశారని సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి.
సర్వైకల్ క్యాన్సర్‌తో ఆమె చనిపోయినట్లు పేర్కొంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ కనిపించింది. 32 ఏళ్ల వయసున్న పూనమ్ పాండే మరణ వార్తను ఆమె ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ పేర్కొంది.ఫిబ్రవరి 2, శుక్రవారం ఉదయం ఆమె మరణించినట్లుగా ఆ పోస్ట్‌లో రాశారు.
వార్తా సంస్థ ఏఎన్ఐ, పూనమ్ పాండే మరణ వార్తను ఆమె మీడియా మేనేజర్ పరూల్ చావ్లా తెలిపినట్లుగా పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పూనమ్ పాండే 2013లో విడుదలైన నషా చిత్రం ద్వారా సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
భారత్, ఇంగ్లండ్‌ల మధ్య మొదలైన రెండో టెస్టులో, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 29.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి, 99 పరుగులు చేసింది.
విశాఖ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్‌లు బరిలోకి దిగారు. రోహిత్ శర్మ 14 పరుగులకే వెనుదిరిగాడు. యశస్వి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. శుభమన్‌గిల్ 35 పరుగుల వద్ద ఔటయ్యాడు.
జట్ల వివరాలు..
భారత జట్టు : యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్‌గిల్, రజత్ పటీదార్, శ్రేయస్ అయ్యర్, శ్రీకర్ భరత్, అశ్విన్, అక్షర్ పటేల్, బుమ్రా, ముకేశ్, కుల్‌దీప్ యాదవ్
ఇంగ్లండ్ జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, పోప్, జో రూట్, బెయిర్‌స్టో, బెన్‌స్టోక్స్(కెప్టెన్), బెన్‌ఫోక్స్, రెహాన్, హార్ట్‌లీ, షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్

ఫొటో సోర్స్, @Dr_Shuvendu_JMM
శుక్రవారం ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపయీ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఝార్ఖండ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ గురువారం రాత్రి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆహ్వానించారు.
శుక్రవారం మధ్యాహ్నం 12:15 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అంతకు ముందు ఈడీ విచారణను ఎదుర్కొంటున్న హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆయన స్థానంలో జేఎంఎమ్ కూటమి చంపయీ సోరెన్ పేరును ఖరారు చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్, ఇంగ్లండ్‌ల మధ్య రెండో టెస్ట్ ప్రారంభమైంది. విశాఖ వేదికగా జరుగుతున్న ఈ టెస్ట్‌లో టాస్ గెలిచి, బ్యాటింగ్‌ను ఎంచుకుంది భారత జట్టు.
ఇంగ్లండ్‌తో ప్రారంభమైన ఐదు టెస్టుల సిరీస్‌లో మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు విజయం సాధించింది.
అంతకుముందు ఎలెవన్ జట్టులో ఉన్న ప్లేయర్ల పేర్లను టీమిండియా మేనేజ్మెంట్ ప్రకటించింది.
సర్ఫరాజ్ ఖాన్‌ను తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం ఉందని భావించినప్పటికీ తుది జట్టులో స్థానం లభించలేదు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.