హిమాచల్‌, కశ్మీర్‌ల్లో భారీగా కురుస్తున్న మంచు.. పర్యాటకుల సందడి

భారీగా మంచు కురుస్తుండటంతో హిమాచల్‌లోని కాసోల్ రోడ్డు మార్గంలో వాహనాలు ఆగిపోయినట్లు వార్తా ఏజెన్సీ ఏఎన్ఐ తెలిపింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. స్నో లెపర్డ్స్: భారత్‌లో వీటి సంఖ్య ఎంత? ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి?

  3. ‘చదువైనా మానేస్తాం కానీ, హిజాబ్‌ను వదిలేయం’ అంటున్న ముస్లిం విద్యార్థినులు.. రాజస్థాన్‌లో బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో రాజుకున్న వివాదం

  4. హిమాచల్‌, కశ్మీర్‌ల్లో భారీగా కురుస్తున్న మంచు.. పర్యాటకుల సందడి

    హిమాచల్‌లో భారీగా కురిసిన మంచు

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, హిమాచల్‌లో భారీగా కురిసిన మంచు

    ఈ శీతాకాలంలో కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లలోని ఎత్తయిన ప్రాంతాల్లో పెద్దగా మంచు కురవకపోవడంతో, పర్యావరణవేత్తలు, రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కానీ, గురువారం వాతావరణం అనూహ్యంగా మారింది.

    హిమాచల్‌ ప్రదేశ్‌లోని పర్వత ప్రాంతాల్లో భారీగా మంచు కురిసింది.

    అనంత్‌నాగ్

    ఫొటో సోర్స్, ANI

    రెండు నెలలుగా మంచు అంతగా కురవకపోవడంతో హిమాచల్‌లోని గిరిజన ప్రాంతాల వారు తీవ్ర ఆందోళన చెందారు. సాధారణంగా నవంబర్ తర్వాత ఈ ప్రాంతాల్లో బాగా మంచు కురుస్తూ ఉంటుంది. కానీ, ఈసారి ఇప్పటిదాకా ఆ ప్రాంతమంతా పొడిపొడిగా కనిపించింది.

    మంచు దుప్పటి

    ఫొటో సోర్స్, ANI

    భారీగా మంచు కురుస్తుండటంతో హిమాచల్‌లోని కాసోల్ రోడ్డు మార్గంలో వాహనాలు ఆగిపోయినట్లు వార్తా ఏజెన్సీ ఏఎన్ఐ తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    జనవరి 26న హిమాచల్‌ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మంచు కురవడంతో చాలా మంది పర్యాటకుల సందడి కనిపించింది. కానీ, అప్పుడు కురిసిన మంచు చాలా తక్కువగా ఉండటంతో, ఆ మంచు త్వరగానే కరిగిపోయింది.

    మనాలి

    ఫొటో సోర్స్, ANI

    జమ్మూ, కశ్మీర్‌లో పూంచ్ ప్రాంతంలో ప్రస్తుతం బాగా మంచు వర్షం కురవడంతో, రోడ్లు, ఇళ్లు అక్కడ మంచు దుప్పటి కప్పినట్లు కనిపిస్తున్నాయి.

    చాలా ప్రాంతాల్లో భారీ మంచు వర్షం కురవడంతో, యాపిల్ పండించే రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    హిమపాతం

    ఫొటో సోర్స్, ANI

  5. పార్లమెంట్ భద్రతా వైఫల్యం: పోలీసులు ఎలక్ట్రిక్ షాక్‌లు ఇచ్చి హింసిస్తున్నారంటూ కోర్టులో నిందితుల ఫిర్యాదు

  6. జ్ఞానవాపి మసీదు ప్రాంగణం: వ్యాస్ బేస్‌మెంట్‌లో హిందువుల పూజలు.. ఇంతకూ ఇది ఎక్కడుంది? ఈ వివాదం ఎలా మొదలైంది?

  7. బుస్రా బీబీ: ‘నన్ను పెళ్లి చేసుకుంటే ప్రధాన మంత్రి అవుతావు’

  8. గర్భాశయ క్యాన్సర్: నిర్మల సీతారామన్ 2024 బడ్జెట్‌లో ప్రస్తావించిన ఈ వ్యాధి ఏమిటి? ఎవరికి వస్తుంది? వ్యాక్సీన్‌తో పూర్తిగా తగ్గించవచ్చా

  9. కేసీఆర్: స్పీకర్ ఛాంబర్‌లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం

    కల్వకుంట్ల చంద్రశేఖర రావు

    ఫొటో సోర్స్, UGC

    మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గురువారం స్పీకర్ ఛాంబర్‌లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.

    డిసెంబర్ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

    అనంతరం అనారోగ్య కారణాల వల్ల ప్రమాణ స్వీకారం చేయలేకపోయిన ఆయన, కోలుకున్న అనంతరం గురవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్‌లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.

  10. బడ్జెట్ 2024 : ఇన్‌కం ట్యాక్స్‌లో ఎలాంటి మార్పులు ఉండవు: నిర్మల సీతారామన్

  11. లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

    కేంద్ర బడ్జెట్

    ఫొటో సోర్స్, ANI

    కొద్దిసేపటి క్రితమే లోక్‌సభలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.

    బడ్జెట్ ప్రసంగంలో "సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్" నినాదం భారత ఆర్థిక వ్యవస్థ ప్రగతికి ఉపకరించిందని తెలిపారు.ప్రస్తుతం బడ్జెట్‌లో పేర్కొన్న అంశాలపై ప్రసంగిస్తున్నారు.

  12. పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసు: 'మమ్మల్ని చిత్రవధ చేసి 70 ఖాళీ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారు', ఉమాంగ్ పొద్దార్, బీబీసీ ప్రతినిధి

    పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం కేసు

    ఫొటో సోర్స్, ANI

    తమను విద్యుత్ షాక్‌తో చిత్రవధ చేసి, 70 ఖాళీ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారని ఆరోపిస్తూ, పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం కేసు నిందితుల్లోని ఐదుగురు దిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

    మొత్తం ఆరుగురు నిందితులు ఉండగా, వీరిలో ఐదుగురు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.

    యూఏపీఏ కింద, జాతీయ పార్టీలతో సంబంధాలు ఉన్నట్లుగా పేర్కొన్న పత్రాలపై సంతకాలు చేయించారని ఆరోపించారు నిందితులు.

    నిందితుల్లో ఇద్దరితో ఓ రాజకీయ పార్టీ/ ప్రతిపక్ష పార్టీ నాయకుడితో సంబంధాలు ఉన్నాయని పేపర్‌పై రాయించుకున్నారు అని పిటిషన్‌లో ఆరోపించారు.

    డి.మనోరంజన్, సాగర్ శర్మ, లలిత్ ఝా, అమోల్ షిండే, మహేష్ కుమావత్‌లు ఈ దరఖాస్తును దాఖలు చేశారు.

    ఫిబ్రవరి 17వ తేదీన దీనిపై వాదనలు జరుగుతాయి. నిందితులను మార్చి 1 వరకు జ్యూడిషియల్ కస్టడీకి అప్పగించారు.

  13. వారణాసి: జ్ఞానవాపి మసీదులోని వ్యాస్ బేస్‌మెంట్‌లో ప్రారంభమైన పూజలు

    జ్ఞానవాపి మసీదు

    ఫొటో సోర్స్, ANI

    ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లా న్యాయస్థానం ఆదేశాలను అనుసరించి గురువారం ఉదయం నుంచి జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలోని వ్యాస్ బేస్‌మెంట్‌లో పూజలు ప్రారంభమయ్యాయి.

    గురువారం జిల్లా మెజిస్ట్రేట్ ఎస్.రాజలింగం ఈ విషయం జర్నలిస్టులకు తెలియజేశారు.

    వ్యాస్ బేస్‌మెంట్‌కు చేరుకునేందుకు వీలుగా మార్గాన్ని ఏర్పాటు చేసినట్లు ఏఎన్ఐతో, ఈ కేసులో పిటిషన్ దాఖలు చేసిన సోహన్ లాల్ ఆర్య తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ఆయన మాట్లాడుతూ, “ఈ ఆదేశాలు మాకు ఎంతో ఉత్సాహాన్నిచ్చాయి. ప్రస్తుతానికి ప్రజలకు ప్రవేశ అనుమతి లేదు. మేం ఈ క్షణాల కోసం నలభై ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం” అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  14. కాసేపట్లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నిర్మల సీతారామన్

    మధ్యంతర బడ్జెట్

    ఫొటో సోర్స్, Getty Images

    సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రం 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది.

    ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఉదయం 11 గంటలకు ఆమె బడ్జెట్ ప్రసంగం ప్రారంభిస్తారు.

    ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతూ గ్రామీణ ఆర్థిక రంగానికి ఊతమిచ్చేలా చర్యలు తీసుకోవాలనే ఒత్తిడిని ప్రభుత్వం ఎదుర్కొంటోంది. అలాగే వేతన జీవులపై పన్ను భారం తగ్గించాలనే ఒత్తిడీ ఉంది.

    ఇక కిసాన్ సమ్మాన్ యోజన కింద ఏటా రైతులకు అంచే 6వేల రూపాయల ఆర్థిక సాయాన్ని పెంచుతారని భావిస్తున్నారు.

    ఈ ఆకాంక్షలన్నీ ఎంతవరకు నెరవేరతాయనే విషయం బడ్జెట్ ప్రవేశపెట్టాకే తెలుస్తుంది.

    2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి నాలుగు నెలల వ్యయానికి పార్లమెంట్ అనుమతి కోసం ఈ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడతారు.

  15. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.