ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేయాలని నిర్ణయించడంతో కొత్త సీఎంగా చంపాయి సోరెన్‌ను ఎంపిక చేసినట్లు అంతకుముందు జేఎంఎం-కాంగ్రెస్ కూటమి వర్గాలు వెల్లడించాయి.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, ANI
జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా చంపాయి సోరెన్‌ను ఎంపిక చేసినట్లు జేఎంఎం-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వంలోని మంత్రి బన్నా గుప్తా ఏఎన్ఐ వార్తాసంస్థకు చెప్పారు.
ముఖ్యమంత్రి పదవికి జేఎంఎం నేత హేమంత్ సోరెన్ రాజీనామా చేయాలని నిర్ణయించడంతో కొత్త సీఎంగా చంపాయి సోరెన్‌ను ఎంపిక చేసినట్లు జేఎంఎం-కాంగ్రెస్ కూటమి వర్గాలు అంతకుముందు వెల్లడించాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

ఫొటో సోర్స్, Twitter/Champai Soren
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
రాంచీలో బుధవారం ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు జరిగాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశ్నించారు.
ఆరోపిత భూకుంభకోణంతో సంబంధం ఉన్న మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు.
హేమంత్ సోరెన్ తన రాజీనామా పత్రాన్ని సమర్పించేందుకు ఈడీ అధికారుల సమక్షంలో రాజ్‌భవన్‌కు వచ్చినట్లు జేఎంఎం ఎంపీ మహువా మాజీ చెప్పారని ఏఎన్ఐ వార్తా సంస్థ రిపోర్టు చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3

ఫొటో సోర్స్, ANI
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణ నేపథ్యంలో సీఎం ఇంటికి ప్రభుత్వ కార్యదర్శితో పాటు డీజీపీ కూడా చేరుకున్నారు.
హేమంత్ సోరెన్‌ను అరెస్ట్ చేయబోతున్నారంటూ ఊహాగానాలు వస్తుండటంతో, జిల్లా కలెక్టర్, ఎస్ఎస్‌పీ కూడా ముఖ్యమంత్రి నివాసానికి వచ్చినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ రిపోర్టు చేసింది.
గవర్నర్‌తో అపాయింట్‌మెంట్ కోరుతూ ప్రభుత్వ కూటమి ఒక ఫ్యాక్స్ పంపిందని బీబీసీ ప్రతినిధి రవి ప్రకాశ్ చెప్పారు.
రాజ్ భవన్, సీఎం ఇల్లు, రాంచిలోని ఈడీ కార్యాలయం వద్ద 100 మీటర్ల దూరం వరకు సెక్షన్ 144 విధించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
వారణాసి జ్ఞానవాపి మసీదు కేసులో, హిందూ పక్షానికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. జ్ఞానవాపి మసీదుకు చెందిన బేస్‌మెంట్‌లో(నేల మాళిగలో) పూజలు చేసుకునేందుకు హిందువులకు అనుమతి ఇచ్చింది.
కోర్టు జారీ చేసిన ఉత్తర్వులలో ‘‘వారణాసి జిల్లా, తానా-చౌక్ సెటిల్‌మెంట్ ప్లాట్ నెంబర్ 9130 వద్దనున్న భవనానికి దక్షిణం వైపున ఉన్న నేలమాళిగలో పూజలకు చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా మెజిస్ట్రేట్( జిల్లా కలెక్టర్)ను ఆదేశించింది. కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ బోర్డు నియమించిన పూజారి పూజలు నిర్వహించాలి. ఈ పూజలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను ఏడు రోజుల్లో పూర్తి చేయాలి’’ అని తెలిపింది.
‘‘పూజలు చేసుకునేందుకు ఏడు రోజుల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా పరిపాలన యంత్రాంగాన్ని కోర్టు ఆదేశించింది. జిల్లా పరిపాలన యంత్రాంగం ఈ ఏర్పాట్లు చేసిన వెంటనే, పూజలు ప్రారంభిస్తాం’’ అని హిందువుల తరఫున వాదించిన న్యాయవాది విష్ణు శంకర్ జైన్ మీడియాతో చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
మాల్దీవుల అడ్వకేట్ జనరల్ హుస్సేన్ షమీమ్‌పై దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన తీవ్ర గాయాలు పాలయ్యారు.
అడ్వకేట్ జనరల్‌గా షమీమ్‌ను గత ప్రభుత్వం నియమించింది. షమీమ్‌పై ఈ దాడిని పోలీసు అధికారులు ధ్రువీకరించారు. ఏడీకే ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.
మాల్దీవుల రాజధాని మాలేలో ఆయనపై దాడి జరిగినట్లు స్థానిక వార్తా సంస్థ సన్ ఆన్‌లైన్ రిపోర్టు చేసింది.
‘‘ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది’’ అని అడ్వకేట్ జనరల్ కార్యాలయ అధికార ప్రతినిధి చెప్పారు. ఈ దాడికి గల కారణాన్ని తెలుసుకునేందుకు విచారణ ప్రారంభించారు.
అధ్యక్షుడు మొహమ్మద్ మయిజ్జూకు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానం తీసుకురావాలని విపక్షాలు సిద్ధమవుతుండటంతో ఆ దేశ పార్లమెంట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో, అడ్వకేట్ జనరల్‌పై దాడి జరిగింది.

ఫొటో సోర్స్, EPA-EFE/REX/SHUTTERSTOCK
అవినీతికి ఆరోపణల కేసులో ఇప్పటికే మూడేళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మరో 14 ఏళ్లు జైలు శిక్ష విధించింది పాకిస్తాన్ న్యాయస్థానం.
ఆయనతోపాటు, ఆయన భార్య బుష్రా బీబీని కూడా నిందితురాలిగా పేర్కొంటూ జైలు శిక్ష విధించింది. మంగళవారం దేశ రహస్యాలను బహిర్గతం చేశారన్న అభియోగాలపై తీర్పునివ్వగా, అవినీతి కేసులో మరో 14 ఏళ్లు జైలు శిక్షను విధిస్తూ బుధవారం న్యాయస్థానం తీర్పునిచ్చింది.
అయితే, రాజకీయ ప్రోద్భలంతోనే తనపై కేసులు పెట్టారని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

ఫొటో సోర్స్, ANI
భారీగా కురిసిన మంచు కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో ఉన్న అటల్ టన్నెల్ సౌత్ పోర్టల్ సమీపంలో యాభై వాహనాలు చిక్కుకుపోయాయి.
మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఆ వాహనాల్లో ప్రయాణిస్తున్న 300 మంది పర్యటకులు అక్కడే ఉండిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
కులు ఎస్పీ సాక్షి వర్మ వివరాలు తెలుపుతూ, “హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్‌కు చెందిన సుమారు 50 వాహనాలు అటల్ టన్నెల్‌లోని సౌత్ పోర్టల్ సమీపంలో చిక్కుకుపోయాయి.
300 మంది ప్రయాణీకులు ఆ వాహనాల్లో ఉన్నారు. అందరినీ బయటకు తీసుకుని వచ్చాం” అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఫిబ్రవరి 2 వరకు భారీగా మంచు కురిసే సూచనలు..
వాతావరణ శాఖ అంతకుముందే జనవరి 30 అర్ధరాత్రి నుంచి ఫిబ్రవరి 2 వరకు హిమాచల్ ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ మంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ముఖ్యంగా చంబా, కంగ్రా, కిన్నోర్, కులు, లాహౌల్, స్పిటి, మండి, షిమ్లా జిల్లాల్లో భారీగా మంచు కురుస్తుందని తెలిపింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.