You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ఇమ్రాన్‌ ఖాన్: పాకిస్తాన్ మాజీ ప్రధానికి పదేళ్ల జైలు శిక్ష

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కోర్డు పదేళ్ల జైలు శిక్ష విధించినట్లు ఏఎన్ఐ తెలిపింది. తనను పదవి నుంచి దించేయడానికి అమెరికా నుంచి కుట్ర జరుగుతోందంటూ ఇమ్రాన్ ఖాన్ తనపై అవిశ్వాస తీర్మానం నెగ్గిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఒక లేఖను చూపించారు. దీనిపై కేసు నమోదైంది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన క్రికెటర్ మయాంక్ అగర్వాల్‌

    భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్‌ అస్వస్థతకు గురైనట్లు వార్తాసంస్థ ఏఎన్ఐ తెలిపింది.

    వాంతులు చేసుకొని అసౌకర్యానికి గురి కావడంతో మయాంక్ అగర్వాల్ త్రిపురలోని అగర్తలలో ఆస్పత్రిలో చేరారని చెప్పింది.

    ప్రస్తుతం ఆయన వైద్యుల సంరక్షణలో ఉన్నారని, త్రిపుర క్రికెట్ అసోసియేషన్ అధికారులు ఆస్పత్రిలోనే ఉన్నారని తెలిపింది.

    మయాంక్ నీళ్లనుకొని ఒక బాటిల్‌లోని లిక్విడ్ తాగారని త్రిపుర క్రికెట్ అసోసియేషన్ వర్కింగ్ సెక్రటరీ బాసుదేబ్ చక్రవర్తి తెలిపారు.

  3. ఇన్ఫెక్షన్ల వల్ల ‘ఏజింగ్’ వేగంగా ఉంటుందా?

  4. 20 అంతస్తులు, ఏడు స్విమ్మింగ్ పూల్స్.. అతిపెద్ద క్రూజ్ షిప్‌లో ఇంకా ఏమేం ఉన్నాయి?

    ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ నౌక అమెరికాలో ఫ్లోరిడాలోని మయామీ నుంచి తన తొలి ప్రయాణాన్ని మొదలుపెట్టింది. దీని పేరు ‘ఐకాన్ ఆఫ్ ద సీస్’.

    ‘టైటానిక్’ షిప్‌తో పోలిస్తే ఇది చాలా పెద్దది. టైటానిక్ 882 అడుగుల పొడవుంటుంది. తొమ్మిది డెక్‌లు మాత్రమే ఉంటాయి. కానీ ఈ ఐకాన్ ఆఫ్ ద సీస్ పొడవు 1,197 అడుగులు. అంటే సుమారు 365 మీటర్లు. ఇందులో 20 డెక్‌లు ఉన్నాయి.

    గరిష్ఠంగా 7,600 మంది ఈ నౌకలో ప్రయాణించవచ్చు. ఈ నౌక రాయల్ కరీబియన్ గ్రూప్‌కు చెందినది.

    ఈ నౌక ప్రయాణంలో విడుదలయ్యే మిథేన్ ఉద్గారాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

  5. మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు అభిశంసనకు ప్రయత్నాలు, ఎన్నికైన మూడు నెలల్లోనే కీలక పరిణామాలు.. ఇండియానే కారణమా?

  6. సముద్రపు దొంగల నుంచి పాకిస్తాన్ నావికులను భారత నౌకాదళం ఎలా కాపాడింది?

  7. జరగబోయే నేరం గురించి పోలీసు వ్యవస్థ కన్నా ముందే ఏఐ టెక్నాలజీ చెప్పేస్తుందా? ఎలా?

  8. ఇమ్రాన్‌ ఖాన్: పాకిస్తాన్ మాజీ ప్రధానికి పదేళ్ల జైలు శిక్ష

    పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు రావల్పిండిలోని ప్రత్యేక కోర్డు పదేళ్ల జైలు శిక్ష విధించింది.

    అమెరికాలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం పంపిన ఒక రహస్య పత్రాన్ని బహిర్గతం చేశారన్న కేసులో మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ - ఇ - ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌కు పదేళ్ల జైలు శిక్ష పడింది. ఆయనతోపాటు ఆ పార్టీ వైస్ చైర్మన్, పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి మహమూద్ ఖురేషీ‌ని కూడా నిందితుడిగా పేర్కొంటూ ఇద్దరికీ పదేళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.

    తనపై అవిశ్వాస తీర్మానం నెగ్గి, పదవి నుంచి దిగిపోయిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఇమ్రాన్ ఖాన్ ఒక లేఖను చూపించారు. తనను పదవి నుంచి దించేయడానికి అమెరికా నుంచి కుట్ర జరుగుతోందంటూ ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.

    ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలను అమెరికా ఖండించింది.

    ఈ లేఖ అమెరికాలోని పాకిస్తానీ రాయబార కార్యాలయం నుంచి ఇస్లామాబాద్ కార్యాలయానికి వచ్చిన లేఖగా గుర్తించారు. దీంతో ఆయనపై దేశ అధికారిక రహస్య సమాచారం లీక్ చేసిన నేరం కింద అభియోగాలు నమోదయ్యాయి.

    అయితే, ఈ కుట్ర సిద్ధాంతాన్ని అటు ప్రభుత్వంగానీ, అధికారులుగానీ అంగీకరించలేదు.

  9. జార్ఖండ్ 'ముఖ్యమంత్రి కనబడుట లేదు' అంటూ బీజేపీ పోస్టర్లు

    మనీలాండరింగ్‌ కేసులో జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట విచారణకు హాజరుకాకపోవడంపై రాష్ట్రంలో కలకలం రేగుతోంది.

    ముఖ్యమంత్రి వ్యక్తిగత పనుల నిమిత్తం దిల్లీలో ఉన్నారని ఆయన పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా సోమవారం తెలిపింది. అయితే, ఈడీ బృందం దిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లినప్పుడు, హేమంత్ సోరెన్ అక్కడ లేరు.

    జార్ఖండ్ సీఎం 'అదృశ్యం' అయ్యారని బీజేపీ అంటోంది. ముఖ్యమంత్రి కనబడుట లేదంటూ పోస్టర్లు విడుదల చేసింది.

    ఇందులో హేమంత్ సోరెన్ హోదా, వివరాలను తెలియజేస్తూ, సమాచారం ఇచ్చిన వ్యక్తికి రూ.11,000 రివార్డు ఇస్తామని పోస్టర్లపై పేర్కొంది.

    “ఆయన (హేమంత్ సోరెన్) ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నిన్న రాత్రి నుంచి ఆయన కనిపించకుండా పోయారని ప్రజలు అంటున్నారు. ఆయన ఎక్కడ ఉన్నారో రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగానికి, పోలీసులకు కూడా తెలియలేదంటే, అది చాలా తీవ్రమైన విషయం'' అని బీజేపీ జార్ఖండ్ అధ్యక్షులు బాబూలాల్ మరాండీ అన్నారు.

    మరోవైపు, గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ రాష్ట్ర డీజీపీ, హోంశాఖ కార్యదర్శిని రాజ్‌భవన్‌కు పిలిపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలపై వివరణ అడిగారు.

    అలాగే, జార్ఖండ్‌లోని ముఖ్యమంత్రి నివాసం, రాజ్‌భవన్, ఈడీ కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలో సీఆర్‌పీసీ సెక్షన్ 144 విధించారు.

  10. కేరళ: బీజేపీ నేత హత్య కేసులో 15 మందికి మరణ శిక్ష

    బీజేపీ నేత, న్యాయవాది రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో కేరళలోని మావెలిక్కార సెషన్స్ కోర్టు 15 మందికి మరణశిక్ష విధించింది. ఒకే కేసులో ఇంతమందికి మరణశిక్ష విధించడం కేరళలో ఇదే తొలిసారని లైవ్ లా వెబ్‌సైట్ పేర్కొంది.

    కేసు విచారణ జరిపిన కోర్టు జనవరి 20న పీఎఫ్‌ఐ, ఎస్డీపీఐకి చెందిన 15 మందిని దోషులుగా నిర్ధరించింది. మరణశిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది.

    నిందితుల్లో మొదటి 8 మందిపై హత్యా నేరం రుజువు కాగా, ఇతర నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని కోర్టు నిర్ధరించినట్లు లైవ్ లా తెలిపింది.

    ఈ కేసులో నిజాం, అజ్మల్, అనూప్, మహ్మద్ అస్లాం, సలాం, అబ్దుల్ కలాం, సఫారుద్దీన్, మున్షాద్, జజీబ్, నవాజ్, షమీర్, జాకిర్ హుస్సేన్, షాజి, షమ్నాజ్‌లను దోషులుగా న్యాయస్థానం తేల్చింది.

    2021 డిసెంబర్ 19వ తేదీ ఉదయం బీజేపీ ఓబీసీ మోర్చా నేత, న్యాయవాది అయిన రంజిత్ శ్రీనివాసన్‌ను అలప్పుజాలోని ఆయన నివాసంలో కుటుంబ సభ్యుల ముందే నరికి చంపారు.

    ఎస్డీపీఐ కార్యకర్త కేఎస్ ఖాన్ హత్య జరిగిన కొద్ది గంటల తర్వాత ఈ ఘటన జరిగింది.

  11. మియన్మార్ సరిహద్దుల్లో కంచె వేయాలని భారత్ ఎందుకు అనుకుంటోంది, ఇది సాధ్యమేనా?

  12. పాకిస్తానీలను సముద్ర దొంగల నుంచి రక్షించిన ఇండియన్ నేవీ

    సోమాలియా తూర్పు తీరంలో సముద్రపు దొంగల నుంచి మరో మత్స్యకార బోటులో ఉన్న 19 మంది పాకిస్తానీలను భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ సుమిత్ర రక్షించింది. ఐఎన్‌ఎస్ సుమిత్ర కాపాడిన బోటుపై ఇరాన్‌కు చెందింది.

    సోమాలియా తూర్పు ప్రాంతంతో పాటు గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో సముద్ర దొంగతనాలను అరికట్టేందుకు, భద్రతా కార్యకలాపాల కోసం ఐఎన్ఎస్ సుమిత్రను మోహరించారు.

    సోమాలియా తూర్పు తీర ప్రాంతంలో సముద్రపు దొంగలకు వ్యతిరేకంగా చేపట్టిన మరో ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇండియన్ నేవీ అధికార ప్రతినిధి, కమాండర్ వివేక్ మధ్వాల్ తెలిపినట్లు వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.

    చేపల బోటు అల్ నైమితో పాటు 19 మంది సిబ్బందిని ఐఎన్ఎస్ సుమిత్ర రక్షించింది. అలాగే, 11 మంది సోమాలియా దొంగలను కూడా అదుపులోకి తీసుకుంది.

    ఈ బోటు అరేబియా సముద్రంలో హైజాక్ అయిన రెండో బోటు కాగా, దానిలోని సిబ్బందిని ఐఎన్‌ఎస్ సుమిత్ర, 36 గంటల్లోనే రక్షించిందని కమాండర్ మధ్వాల్ తెలిపారు. అందులో 17 మంది ఇరాన్‌కు చెందిన వారు కాగా, 19 మంది పాకిస్తానీలు.

    జనవరి 28న, హైజాక్ అయిన ఒక ఇరాన్ నౌకను ఐఎన్‌ఎస్ సుమిత్ర రక్షిచింది.

  13. ఎలాన్ మస్క్- న్యూరాలింక్: మనిషి మెదడులో విజయవంతంగా చిప్ అమరిక

    మొదటిసారిగా వైర్‌లెస్ బ్రెయిన్ చిప్‌ను తమ కంపెనీ న్యూరాలింక్ మనుషుల్లో విజయవంతంగా అమర్చిందని బిలియనీర్ ఎలాన్ మస్క్ వెల్లడించారు.

    ప్రాథమిక ఫలితాలు మెరుగైన న్యూరాన్ స్పైక్‌లను గుర్తించాయని, వాటిని అమర్చిన పేషంట్ కూడా క్షేమంగా ఉన్నాడని మస్క్ చెప్పారు.

    మానవ మెదడును కంప్యూటర్‌లకు అనుసంధానం చేయాలనుకుంటున్నామని, తద్వారా సంక్లిష్టమైన నాడీ సంబంధిత వ్యాధులను ఎదుర్కోవడంలో ఇది సహాయపడుతుందని కంపెనీ తెలిపింది.

    ఈ చిప్‌ను మనుషులపై పరీక్షించేందుకు మస్క్ కంపెనీకి గతేడాది మేలో ఎఫ్‌డీఏ అనుమతి ఇచ్చింది. ఇంతకుముందు, జుట్టు కంటే సన్నగా ఉండే ఈ చిప్‌ను రోబోట్‌లో ఉపయోగించారు.

    ఈ చిప్‌ను తయారు చేసేందుకు ఈ కంపెనీ ఆరేళ్లపాటు ప్రయోగాలు చేసింది.

  14. గుడ్ మార్నింగ్.

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

  15. 20 అంతస్తులు, ఏడు స్విమ్మింగ్ పూల్స్.. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ షిప్‌లో ఇంకా ఏమేం ఉన్నాయి?