INDvsENGLAND: ఉప్పల్ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ పై ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో విజయం
భారత విజయంపై ఆశలు కల్పించిన భారత జోడీ శ్రీకర్ భరత్, రవిచంద్రన్ అశ్విన్ అవుటవ్వడంతో మ్యాచ్ ఇంగ్లండ్ వైపు మొగ్గింది.
లైవ్ కవరేజీ
షూస్, బూట్లు, స్నీకర్స్ పాతవి కొనుక్కోవడం మేలా, అవి ఎక్కువ రోజులు మన్నేలా చేసుకోవడం ఎలా?
#INDvsENG: విజయం ముంగిట భారత్ బోల్తా, తొలి టెస్టులో 28 పరుగులతో ఇంగ్లండ్ గెలుపు

ఫొటో సోర్స్, Getty Images
హైదరాబాద్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించింది
తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది.
ఇంగ్లండ్ నిర్దేశించిన 231 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 202 పరుగులకే పరిమితమైంది.
నిర్ణీత సమయం ప్రకారం, నాలుగో రోజు ఆట ముగియడానికి సరిగ్గా రెండు ఓవర్ల ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
భారత విజయంపై ఆశలు కల్పించిన భారత జోడీ శ్రీకర్ భరత్, రవిచంద్రన్ అశ్విన్ అవుటవ్వడంతో మ్యాచ్ ఇంగ్లండ్ వైపు మొగ్గింది.
జట్టు విజయానికి 55 పరుగులు కావాల్సి ఉండగా హార్ట్‌లీ వేసిన అద్భుత బంతికి శ్రీకర్ భరత్ బౌల్డయ్యాడు.
భరత్ 59 బంతుల్లో 3 ఫోర్లతో 28 పరుగులు చేశాడు.
తర్వాత మరో 7 బంతులకే అశ్విన్ (28) కూడా అవుటవ్వడంతో ఇంగ్లండ్ గెలుపుకు ఒక వికెట్ దూరంలో నిలిచింది.
231 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలో దిగిన భారత్ 177 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌గా అశ్విన్ వికెట్‌ను కోల్పోయింది.
ఈరోజే ఆటను ముగించాలనే ఉద్దేశంతో ఇంగ్లండ్ ఆటను 30 నిమిషాలు పొడిగించింది.
క్రీజులో కాసేపు పోరాడిన బుమ్రా (6 నాటౌట్), సిరాజ్ (12) జట్టును గెలిపించలేకపోయారు.
ఇంగ్లండ్ స్పిన్నర్ టామ్ హర్ట్‌లీ 7 వికెట్లతో భారత్‌ను దెబ్బతీశాడు.
బ్రేకింగ్ న్యూస్, బిహార్ సీఎంగా మళ్లీ నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం

ఫొటో సోర్స్, ANI
బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ తొమ్మిదోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ప్రభుత్వాన్ని రద్దు చేసిన ఆయన సాయంత్రం మరోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఈసారి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ), బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది.
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నేత చిరాగ్ పాసవాన్‌తో పాటు పలువురు బీజేపీ నేతలు నితీశ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.
కొకైన్ గాడ్ మదర్: ముగ్గురు భర్తలను చంపిన ఈ క్రూరమైన మహిళ కథేంటి?
వైఎస్ షర్మిల వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం?
20 అంతస్తులు, ఏడు స్విమ్మింగ్ పూల్స్.. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ షిప్‌లో ఇంకా ఏమేం ఉన్నాయి?
బిహార్: ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు నితీశ్ కుమార్ రాజీనామా పత్రం సమర్పించారు. బిహార్ ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు ఆయన ఆదివారం రాజీనామా పత్రాన్ని అందజేశారు.
పదవికి రాజీనామా చేశానని గవర్నర్‌తో సమావేశం అనంతరం నితీశ్ కుమార్ మీడియాతో చెప్పారు.
బిహార్‌లో మహాకూటమి నుంచి విడిపోతున్నట్లు నితీశ్ కుమార్ చెప్పారు.
2022 నుంచి ఆర్జేడీ మద్దతుతో జేడీయూ ఆధ్వర్యంలోని నితీశ్ కుమార్ ప్రభుత్వం కొనసాగుతూ వచ్చింది. ఆర్జేడీ సీనియర్ నేత తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.
మహాకూటమి నుంచి నితీశ్ కుమార్ బయటికి వెళ్లిపోవడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ- ఇలా జరుగుతుందని ముందే ఊహించామన్నారు. ఇలా వచ్చి పోయే వాళ్లు దేశంలో చాలా మంది ఉన్నారని విమర్శించారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
122 మంది మద్దతు అవసరం
243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో లాలు ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీకి 79 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. బీజేపీకి 78 మంది ఎమ్మెల్యేలున్నారు. జేడీయూకు 45 మంది ఎమ్మెల్యేల బలముంది. కాంగ్రెస్ పార్టీకి 19 మంది ఎమ్మెల్యేలున్నారు.
సీపీఐ (ఎం-ఎల్) పార్టీకి 12, హిందుస్థానీ అవామ్ మోర్చా పార్టీకి నలుగురు, సీపీఐ, సీపీఐ (ఎం)లకు ఇద్దరేసి ఎమ్మెల్యేలు, ఏఐఎంఐఎం పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఇండిపెండెంట్ ఉన్నారు.
ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.
బీజేపీతో కలిసి నితీశ్ కుమార్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఎన్డీఏలోని హిందుస్థానీ అవామ్ మోర్చా పార్టీ చీఫ్ జీతన్ రామ్ మాంఝీ తెలిపారు.
బీజేపీ మద్దతుతో నితీశ్ కుమార్ సీఎంగా ప్రమాణం చేస్తారన్న జీతన్ రామ్ మాంఝీ

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, జితన్ రామ్ మాంఝీ, నితీశ్ కుమార్ (ఫైల్) ఆదివారం (జనవరి 28) మధ్యాహ్నం 3 గంటలకు బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ అవామ్ మోర్చా చీఫ్ జీతన్ రామ్ మాంఝీ అన్నారు.
నితీశ్ కుమార్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. ఎన్డీయేలో భాగమైన తన పార్టీ కూడా నితీశ్ ప్రభుత్వంలో చేరుతుందని మాంఝీ చెప్పారు.
నితీశ్‌కుమార్ ఎమ్మెల్యేల మద్దతు పత్రాన్ని ఆదివారం గవర్నర్‌కు అందజేస్తారని మాంఝీ చెప్పారు.
మరోవైపు ఇవాళ పాట్నాలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం, నితీశ్ కుమార్ నివాసంలో జేడీయూ ఎమ్మెల్యేల సమావేశాలు నిర్వహిస్తున్నారు.
సమావేశం గురించి బిహార్ మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ ఎమ్మెల్యే తార్కిషోర్ ప్రసాద్ వార్తాసంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ ‘శాసనసభాపక్ష సమావేశం పెట్టారు. దానికోసమే ఇక్కడికి వచ్చాం. ఎజెండా స్పష్టంగా తెలీదు. రావాలని చెప్పారు కాబట్టి వచ్చాం’ అని తెలిపారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
హమాస్ దాడుల్లో యూఎన్ఆర్‌డబ్ల్యూఏ ఉద్యోగుల పాత్రపై ఆరోపణలు.. నిధులు నిలిపివేసిన అమెరికా, బ్రిటన్

ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడుల్లో ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (యూఎన్ఆర్‌డబ్ల్యూఏ) ఉద్యోగుల పాత్ర ఉందంటూ ఇజ్రాయెల్ ఆరోపించింది.
దీంతో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, ఫిన్లాండ్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ దేశాలు ఈ సంస్థకు నిధులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.
ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను తొలగించినట్లు, దీనిపై దర్యాప్తు చేయనున్నట్లు యూఎన్ఆర్‌డబ్ల్యూఏ తెలిపింది.
గాజాలోని పాలస్తీనియన్లకు విద్య, వైద్యం, తదితర సేవలు అందించేందుకు ఈ సంస్థ పనిచేస్తోంది.
నిధులు నిలిపివేస్తున్నట్లు ఆయా దేశాలు తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని యూఎన్ఆర్‌డబ్ల్యూఏ చీఫ్ ఫిలిప్ లాజారి కోరారు.
"గాజాలో 20 లక్షల మంది ప్రజలు యూఎన్ఆర్‌డబ్ల్యూఏపై ఆధారపడి ఉన్నారు" అని ఫిలిప్ చెప్పారు.
పీతలకు ‘రక్షణ కవచం’గా బాటిల్ మూతలు.. హృదయం ముక్కలైందన్న శాస్త్రవేత్తలు
శుభోదయం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్‌డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
