గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌: చమురు ట్యాంకర్ల షిప్‌పై హూతీ తిరుగుబాటుదారుల క్షిపణి దాడి

గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ల షిప్‌పై హూతీ తిరుగుబాటుదారులు శుక్రవారం క్షిపణి దాడి చేశారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. క్లస్టర్ హెడేక్స్: ‘‘తలనొప్పి తట్టుకోలేక తలను గోడకేసి బాదుకుంటా’’, అప్పుడెలా అనిపిస్తుందంటే?

  3. ఆస్ట్రేలియన్ ఓపెన్: రోహన్ బోపన్న రికార్డు, 43 ఏళ్ల వయస్సులో గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుపు

    రోహన్ బోపన్న

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, రోహన్ బోపన్న

    భారత టెన్నిస్ క్రీడాకారుడు రోహన్ బోపన్న చరిత్ర సృష్టించాడు.

    ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో మ్యాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి ఆడిన రోహన్ బోపన్న డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.

    43 ఏళ్ల వయస్సులో అతను గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను గెలిచాడు.

    రోహన్ బోపన్న

    ఫొటో సోర్స్, Reuters

    దీంతో అతిపెద్ద వయస్సులో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలిచిన ఆటగాడిగా బోపన్న నిలిచాడు.

    మెల్‌బోర్న్‌లో శనివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్)- మ్యాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జంట 7-6, 7-5తో ఇటలీకి చెందిన సిమోనె బోలెలీ- ఆండ్రీ వబాసోరీ జోడీపై గెలుపొందింది.

    రోహన్ బోపన్న పురుషుల డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవడం ఇదే తొలిసారి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  4. ఐఎన్‌‌ఎస్ విశాఖపట్నం: 22 మంది భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై హుతీల క్షిపణి దాడి, స్పందించిన భారత నౌకాదళం

  5. వెంకి రామకృష్ణన్: ముసలితనాన్ని, మృత్యువును ఆపగలమా...భారత సంతతి నోబెల్ గ్రహీత ఏం చెబుతున్నారు?

  6. జపాన్: మోస్ట్ వాంటెడ్ నేరస్తుడి ఆచూకి 49 ఏళ్ల తర్వాత ఎలా దొరికిందంటే...

  7. కేరళ గవర్నర్ తీవ్ర ఆగ్రహం, రోడ్డుపైనే బైఠాయింపు

    కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్

    ఫొటో సోర్స్, ANI

    కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. కొల్లాం జిల్లాలో ఆయన కాన్వాయ్ వెళ్తుండగా ఎస్ఎఫ్ఎ నేతలు నల్లజెండాలతో నిరసనలు తెలిపారు.

    దీంతో, కారు దిగిపోయిన గవర్నర్ మహమ్మద్ ఖాన్, రోడ్డు పక్కన టీ షాపు వద్ద బైఠాయించారు.

    వారిని ఎందుకు అడ్డుకోలేదంటూ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అక్కడి నుంచి కదిలేది లేదని, పోలీసులే వారికి రక్షణ ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. కాగా.. నిరసనకారులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు గవర్నర్‌కు తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. మూత్రం నల్లగా ఎప్పుడు వస్తుంది, అది ఎంత ప్రమాదం?

  9. మసీదు ప్రారంభోత్సవంలో ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు

  10. చిన్న పిల్లలకు ‘స్కిన్ కేర్’ ఉత్పత్తులు వాడితే సమస్యలే: డెర్మటాలజిస్టులు

  11. మరణ శిక్షను ఏయే పద్ధతుల్లో అమలు చేస్తున్నారు?

  12. గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌: చమురు ట్యాంకర్ల షిప్‌పై హూతీ తిరుగుబాటుదారుల క్షిపణి దాడి

    ఓడ

    ఫొటో సోర్స్, FRANK FINDLER

    ఫొటో క్యాప్షన్, యెమెన్ తీరంలో మెర్లిన్ లువాండా ఓడలోని ఆయిల్ ట్యాంకర్‌పై హూతీ తిరుగుబాటుదారులు దాడులు చేశారు.

    గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ల షిప్‌పై హూతీ తిరుగుబాటుదారులు క్షిపణి దాడి చేశారు.

    పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు ప్రతీకారంగా కొంత కాలంగా ఎర్ర సముద్రంలో ఇరాన్ మద్దతుగల హూతీ తిరుగుబాటుదారులు వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నారు.

    ఈ క్రమంలోనే మెర్లిన్ లువాండా షిప్‌పై దాడి చేసినట్లు హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు.

    శుక్రవారం క్షిపణి దాడి జరగడంతో ఓడలోని కార్గో ట్యాంక్‌లో మంటలు చెలరేగాయని దాని ఆపరేటర్ ట్రాఫిగురా బీబీసీకి తెలిపారు. మంటలను ఆర్పే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

    ట్యాంకర్‌పై 'యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణి' దాడి జరిగిందని అమెరికా తెలిపింది.

    ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.

    ఏడెన్‌కు ఆగ్నేయంగా 60 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగిందని యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ప్రకటించింది.

  13. ఏపీలో శ్మశానం అభివృద్ధికి తెలంగాణ ఎంపీ నిధులపై వివాదం ఎందుకు రేగింది?

  14. పరువు నష్టం కేసులో డొనాల్డ్ ట్రంప్‌కు రూ. 692 కోట్ల జరిమానా

    డోనాల్డ్ ట్రంప్

    ఫొటో సోర్స్, Getty Images

    పరువు నష్టం కేసులో రచయిత జీన్ కారోల్‌కు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూ. 692 కోట్లు (83.3 మిలియన్ డాలర్లు) చెల్లించాలని అక్కడి మాన్‌హాటన్ జ్యూరీ శుక్రవారం తీర్పు చెప్పింది.

    ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించారని కారోల్ అమెరికాలోని మాన్‌హాటన్ కోర్టులో దావా వేశారు.

    కేసును విచారించిన జ్యూరీ, కారోల్‌ పరువుకు నష్టం కలిగించినందుకు 91.43 కోట్లు (11 మిలియన్ డాలర్లు), మానసికంగా దెబ్బతీసినందుకు 60.67 కోట్లు (7.3 మిలియన్ డాలర్లు), దీనికి అదనంగా మరో రూ. 540.29 కోట్లు (65 మిలియన్ డాలర్లు) ‘ప్యునిటివ్ డ్యామేజెస్’ కింద పరిహారంగా చెల్లించాలని తీర్పు చెప్పింది.

    మహిళలను కించపరిచేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తికి ఇది పెద్ద ఓటమని కారోల్ అన్నారు.

    తీర్పు కచ్చితంగా హాస్యాస్పదమని, న్యాయవ్యవస్థను రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు.

  15. ధోర్డో: ఎడారి మధ్యలోని ఈ గుజరాత్ గ్రామానికి లక్షల మంది టూరిస్టులు ఎందుకు వస్తున్నారు?

  16. శుభోదయం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్‌డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.