ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ఫ్రాన్స్ అధ్యక్షులు మేక్రాన్, భారత ప్రధాని మోదీల భేటీలో చర్చకు వచ్చిన అంశాలపై భారత విదేశాంగ శాఖ సెక్రటరీ వినయ్ ఖ్వత్రా మీడియా సమావేశం నిర్వహించారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, MEA/Youtube
భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్‌ల భేటీలో చర్చకు వచ్చిన అంశాల గురించి భారత విదేశాంగ శాఖ సెక్రటరీ వినయ్ ఖ్వత్రా మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాల గురించే కాక, ఇతర ప్రధాన అంశాలు, ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు, ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలు, గాజా, మానవాతాసాయం వంటి చాలా అంశాలపై చర్చించారని తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
స్పేస్, డిఫెన్స్, ఎనర్జీ సెక్టార్లలో ఇరుదేశాల భాగస్వామ్యం గురించి చర్చలు జరిగాయని తెలిపారు.
హెచ్125 హెలికాఫ్టర్ల తయారీకి సంబంధించి టాటా, ఎయిర్ బస్ హెలికాఫ్టర్స్ ఏవియేషన్ సంస్థల మధ్య పారిశ్రామిక భాగస్వామ్యంపై కూడా చర్చ జరిగినట్లు తెలిపారు.

ఫొటో సోర్స్, Jana Sena Party
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల పొత్తుకు సంబంధించి ముఖ్య పరిణామం చోటుచేసుకొంది.
రిపబ్లిక్ డే సందర్భంగా మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ- ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు, రాజానగరం అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందంటూ కీలక ప్రకటన చేశారు.
వచ్చే ఎన్నికల్లో పొత్తు ధర్మానికి తాము కట్టుబడి ఉన్నామని చెబుతూనే, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆయనపై ఒత్తిడి కారణంగా రెండు సీట్లు ప్రకటించారని,అదే విధంగా తన మీద కూడా ఒత్తిడి ఉందని, కాబట్టి తాము కూడా రెండు సీట్లలో పోటీలో ఉండబోతున్నామని ప్రకటించారు. అయితే అభ్యర్థుల పేర్లు ఏవీ వెల్లడించలేదు.
ఇటీవల మండపేట బహిరంగ సభలో టీడీపీ సిటింగ్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పేరును చంద్రబాబు ప్రకటించడంతో జనసేన అసంతృప్తి వ్యక్తం చేసింది. నియోజకవర్గానికి చెందిన నేతలు అభ్యంతరం తెలిపారు. తాజాగా పవన్ కళ్యాణ్ దానికి కొనసాగింపుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండు సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు.
"పొత్తు ధర్మం ప్రకారం ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించకూడదు. లోకేశ్, ముఖ్యమంత్రి పదవిపై మాట్లాడినా నేను పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రజల కోసం మౌనంగా ఉన్నాను. పొత్తు ఎమ్మెల్యే సీట్ల దగ్గరే ఆగిపోదు. టీడీపీ-జనసేన కలిస్తే బలమైన నిర్మాణం చేసుకోవచ్చు. ఒక మాట అటున్నా, ఇటున్నా కలిసే వెళ్తున్నాం. వాళ్లు రెండు సీట్లు ప్రకటించారు. కాబట్టి మేము రెండు సీట్లు ప్రకటిస్తాం. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుంది" అని పవన్ చెప్పారు.
వార్డు స్థాయి నుంచి ప్రతి దశలోనూ మూడో వంతు స్థానాలు జనసేన తీసుకోబోతోందని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. టీడీపీ పునర్నిర్మాణం, జనసేన బలోపేతం రెండూ ఉమ్మడిగా జరుగుతాయన్నారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది

ఫొటో సోర్స్, WHNT/CBS
అమెరికాలోని అలబామా రాష్ట్రంలో తొలిసారి నైట్రోజన్ గ్యాస్ ఉపయోగించి మరణ శిక్ష అమలు చేశారు.
కెన్నెత్ యూజిన్ స్మిత్ అనే ఖైదీకి నైట్రోజన్ గ్యాస్‌ను వినియోగించి ప్రభుత్వం ఈ శిక్షను అమలు చేసింది.
అంతేకాకుండా ప్రపంచంలోనే తొలిసారి నైట్రోజన్ గ్యాస్‌తో మరణ శిక్ష పడ్డ తొలి ఖైదీ కెన్నెత్ యూజిన్ స్మిత్‌నే.
1998 నాటి హత్య కేసులో కెన్నెత్ యూజిన్ స్మిత్ మరణ శిక్ష పడింది.
తన మరణశిక్షపై 58 ఏళ్ల స్మిత్ చివరిగా సుప్రీంకోర్టులో రెండు అప్పీళ్లను, ఫెడరల్ అప్పీళ్ల కోర్టులో ఒకటి దాఖలు చేశారు. కానీ, ఆ అప్పీళ్లు తిరస్కరణకు గురయ్యాయి.

ఫొటో సోర్స్, ALABAMA DEPARTMENT OF CORRECTIONS
నైట్రోజన్‌తో మరణ శిక్ష అమలు చేయడం హింసాత్మకమైనది, క్రూరమైనది, అమానవీయమైనది అని స్మిత్ తరఫు న్యాయవాదులు వాదించారు.
అలబామాలో 2022లో స్మిత్‌కు విషపు ఇంజెక్షన్ ద్వారా మరణ శిక్ష విధించాలని ప్రయత్నించి, విఫలమయ్యారు.
దీంతో నైట్రోజన్ గ్యాస్ ద్వారా కెన్నెత్ యూజిన్ స్మిత్‌కు మరణ శిక్ష అమలు చేశారు. స్మిత్ ముఖానికి గట్టిగా మాస్క్ ధరించేలా చేసి, బలవంతంగా నైట్రోజన్ పీల్చేలా చేశారు.
లెథాల్ ఇంజెక్షన్లలో డ్రగ్స్ దొరకడం కష్టతరమవుతుండటంతో, నైట్రోజన్ గ్యాస్‌ను ఉపయోగించి మరణ శిక్ష వేసేందుకు అలబామాతో పాటు మరో రెండు అమెరికా రాష్ట్రాలు ఇప్పటికే ఆమోదం పొందాయి.

ఫొటో సోర్స్, DD News
గణతంత్ర దినోత్సవ వేడుకలు కర్తవ్యపథ్‌లో ప్రారంభమయ్యాయి.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, వేడుకల ముఖ్య అతిథి, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతం పలికారు.
ఈ వేడుకల కోసం మేక్రాన్, గురువారమే భారత్‌కు వచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా భారత గొప్ప సాంస్కృతిక వైవిధ్యతను, ‘ఆత్మనిర్భర్’ సైన్య ప్రదర్శనను, నారీశక్తిని చాటేలా 90 నిమిషాల పాటు పరేడ్ జరుగుతుంది.
తొలిసారి అందరూ మహిళలే సభ్యులుగా ఉన్న త్రివిధ దళాల కంటింజెంట్ పరేడ్‌లో పాల్గొంటుందని వార్తాసంస్థ ఏఎన్ఐ తెలిపింది.
పరేడ్‌లో వందమందికి పైగా మహిళల బృందం భారతీయ సంగీతాన్ని దేశ ప్రజలకు వినిపించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, Getty Images
దేశ రాజధాని దిల్లీలోని ‘కర్తవ్యపథ్’లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ హాజరవుతున్నారు.
ఈ వేడుకల కోసం మేక్రాన్, గురువారమే భారత్‌కు వచ్చారు. భారత్‌కు వచ్చిన మేక్రాన్‌తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జైపూర్‌లో రోడ్ షో నిర్వహించారు.
గురువారం సాయంత్రం ప్రధానమంత్రి, మేక్రాన్ కలిసి ఈ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో జరుగుతున్నంత సేపు మోదీ, మేక్రాన్ ఓపెన్ టాప్ కారులో నిల్చుని ప్రజలకు అభివాదం చేశారు. ఆయన్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
మేక్రాన్‌ను హవా మహల్‌కు, జైపూర్‌లోని జంతర్ మంతర్‌కు తీసుకెళ్లారు. అయోధ్యలోని శ్రీరామ మందిర ప్రతిమను ఆయనకు బహుమతిగా ఇచ్చారు. దీంతో పాటు, ఒక టీ దుకాణంలో మేక్రాన్ టీ కూడా తాగారు.

ఫొటో సోర్స్, Getty Images
మేక్రాన్‌కు ఇచ్చిన రామ మందిర ప్రతిమను ప్రధాని మోదీ రూ.500కు కొనుగోలు చేశారని, యూపీఐ ద్వారా చెల్లింపులు చేశారని దుకాణదారు వార్తాసంస్థ పీటీఐకి తెలిపారు.
ఆ తర్వాత ఇద్దరు నేతలు కలిసి మళ్లీ కారులోకి ఎక్కి రోడ్ షో నిర్వహించారు. రాంబాగ్ ప్యాలెస్ వద్ద రోడ్ షో ముగిసింది. ఆ తర్వాత ఇద్దరు నేతలు భోజనం చేసి, ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

మనోజ్ జరంగే పాటిల్ నేతృత్వంలో మరాఠా కమ్యూనిటీ ఉద్యమ కార్యకర్తలు ఇవాళ(జనవరి 26న) రాజధాని ముంబయిలోకి ప్రవేశించేందుకు సిద్ధమయ్యారు.
మనోజ్ జరంగేతోపాటు ఆయన మద్దతుదారులు నగర శివారుకు చేరుకున్నారు. ప్రస్తుతం నేవి ముంబయిలోని వాషిలో ఉన్నారు.
జరంగే, ఆయన మద్దతుదారులు ముంబయి నగరంలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
మనోజ్ జరంగే పాటిల్, లక్షల మంది మరాఠా కార్యకర్తలు ఇవాళ దక్షిణ ముంబయిలోని ఆజాద్ మైదాన్‌లో నిరసనకు పిలుపునిచ్చారు.
కానీ, ఈ నిరసనకు ముంబయి పోలీసులు అనుమతి నిరాకరించారు.
ముంయిలో రోజూ 60 లక్షల నుంచి 70 లక్షల మంది రాకపోకలు సాగిస్తుంటారని, ఇలాంటి పరిస్థితుల్లో లక్షల మంది నిరసనకారులు నగరంలోకి ప్రవేశిస్తే, ట్రాఫిక్ సిస్టమ్ కుప్పకూలుతుందని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ మనోజ్ జరంగేకు లేఖ రాశారు.
ఆజాద్ మైదాన్ సామర్థ్యం కేవలం 5 వేల నుంచి 6 వేలు అని, అంతమంది నిరసనకారులకు స్థలం లేదని పోలీసులు స్పష్టం చేశారు.
జరంగేతో ఇప్పటికే ప్రభుత్వ ప్రతినిధులు పలుమార్లు చర్చలు జరిపారు. కానీ, ఆ చర్చలు ఫలవంతం కాలేదు.
మరాఠా కమ్యూనిటీకి కుంబి సర్టిఫికేట్ ఇవ్వాలని ఆయన ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ సర్టిఫికేట్ ఇస్తే ఓబీసీ కేటగిరీలో వారు రిజర్వేషన్‌కు అర్హులు అవుతారు.

ఫొటో సోర్స్, UGC
మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కొణిదెల చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.
వీరిద్దరితోపాటు దేశంలో మరో ముగ్గురికి కూడా ఈ రెండో అత్యున్నత పౌర పురస్కారాన్నిప్రకటించింది.
ఈ పురస్కారానికి ఎంపిక చేసిన వారిలో కళారంగం నుంచి తమిళనాడుకు చెందిన వైజయంతీ మాల బాలి, ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మాసుబ్రహ్మణ్యంలు ఉన్నారు.
సామాజిక సేవా విభాగంలో మరణానంతరం బిహార్‌కు చెందిన సులభ్ శౌచాలయ వ్యవస్థాపకులు బిందేశ్వర్ పాఠక్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించింది.
పద్మభూషణ్ గ్రహీత అయిన బిందేశ్వర్ పాఠక్, 1970లో సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీసెస్‌ను ప్రారంభించారు.
దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బస్సు స్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, ఇతర పబ్లిక్ ప్రదేశాల్లో టాయిలెట్లను ఏర్పాటు చేశారు.
నేడు దేశవ్యాప్తంగా ఉన్న ఈ మరుగుదొడ్లను ‘సులభ్ టాయిలెట్ల’ పేరుతో పిలుస్తున్నారు.
‘నవభారత నిర్మాణంలో భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరికీ ఈ పురస్కారం అంకితం’
అమృత కాలం దిశగా భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న తరుణంలో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మవిభూషణ్ పురస్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నానని వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.
దేశంలోని రైతులు, యువత, మహిళలు సహా నవభారత నిర్మాణంలో భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరికీ ఈ పురస్కారాన్ని సగర్వంగా అంకితం చేస్తున్నానని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.