ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన ఛైర్మన్‌గా మాజీ డీజీపీ ఎం. మహేందర్ రెడ్డిని నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు జీవో విడుదల చేసింది.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

కేంద్ర ప్రభుత్వం పలు రంగాల్లో విశేష కృషి చేసిన 34 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది.
వీరిలో ముగ్గురు తెలుగువారికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి.
తెలంగాణలోని దామరగిద్దకు చెందిన బుర్ర వీణ వాయిద్యకారులు దాసరి కొండప్ప, యక్షగాన కళాకారులు గడ్డం సమ్మయ్య, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరి తెలుగు రాష్ట్రాల తరఫున ఎంపికయ్యారు.
పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన 34 మంది జాబితా:
1.డి. ఉమామహేశ్వరి - ఆంధ్రప్రదేశ్
2.గడ్డం సమ్మయ్య - తెలంగాణ
3.దాసరి కొండప్ప - తెలంగాణ
4.జానకీలాల్ - రాజస్థాన్
5.గోపీనాథ్ స్వైన్ - ఒడిశా
6.స్మృతి రేఖ ఛక్మా - త్రిపుర
7.ఓంప్రకాశ్ శర్మ - మధ్యప్రదేశ్
8.నారాయణన్ ఈపీ - కేరళ
9.భాగబత్ పదాన్ - ఒడిశా
10.సనాతన్ రుద్ర పాల్ - పశ్చిమ బెంగాల్
11.భద్రప్పన్ ఎం - తమిళనాడు
12.జోర్డాన్ లేప్చా - సిక్కిం
13.మచిహన్ సాసా - మణిపుర్
14.శాంతిదేవీ పాసవాన్, శివన్ పాసవాన్ - బిహార్
15.రతన్ కహార్ - పశ్చిమ బెంగాల్
16.అశోక్ కుమార్ బిశ్వాస్ - బిహార్
17.బాలకృష్ణన్ సాధనమ్ పుథియ వీతిల్ - కేరళ
18.బాబూ రామ్‌యాదవ్ - ఉత్తర్‌ప్రదేశ్
19.నేపాల్ చంద్ర సూత్రధార్ - పశ్చిమ బెంగాల్
సామాజిక సేవా విభాగం
20.సోమన్న - కర్ణాటక
21.పార్బతి బారువా - అస్సాం
22.జగేశ్వర్ యాదవ్ - ఛత్తీస్‌గఢ్
23.ఛామి ముర్మూ - ఝార్ఖండ్
24.గుర్విందర్ సింగ్ - హరియాణా
25.దుఖు మాఝీ - పశ్చిమ బెంగాల్
26.సంగ్థాన్‌కిమా - మిజోరం
వైద్య విభాగం
27.హేమచంద్ మాంఝీ - ఛత్తీస్‌గఢ్
28.యజ్దీ మాణెక్ షా ఇటాలియా - గుజరాత్
29.ప్రేమ ధన్‌రాజ్ - కర్ణాటక
క్రీడా విభాగం
30.ఉదయ్ విశ్వనాథ్ దేశ్‌పాండే - మహారాష్ట్ర
31.యనుంగ్ జామోహ్ లెగో - అరుణాచల్ ప్రదేశ్
32.సర్బేశ్వర్ బాసుమతరి - అస్సాం
33.సత్యనారాయణ బెలేరి - కేరళ
34.కె.చెల్లామ్మళ్ - అండమాన్ నికోబార్

ఫొటో సోర్స్, TSPOLICE
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్‌గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, మాజీ డీజీపీ ఎం.మహేందర్ రెడ్డిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
గురువారం విడుదల చేసిన గెజిట్‌లో ఛైర్మన్‌తోపాటు ఐదుగురు సభ్యుల పేర్లను కూడా ప్రకటించింది.
సభ్యులుగా, రిటైర్డ్ ఐఏఎస్ అనిత రాజేంద్ర, పాల్వాయి రజనీ కుమారి, అమీర్ ఉల్లాఖాన్, ప్రొఫెసర్ నర్రి యాదయ్య, వై. రామ్మోహన్ రావులు నియమితులయ్యారు.
ఈ నియామకాలకు గవర్నర్ ఆమోదం తెలిపారు.

ఫొటో సోర్స్, TELANGANA GOVT

ఫొటో సోర్స్, Reuters
హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ జట్టు ఇంగ్లండ్ జట్టును తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌట్ చేసింది.
భారత జట్టులో రవీంద్ర జడేజా, అశ్విన్‌లు చెరో మూడు వికెట్లు తీయగా, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రాలు చెరో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్ జట్టును కట్టడి చేశారు.
ఇంగ్లండ్ జట్టులో బెన్ స్టోక్స్ ఒక్కడే అత్యధికంగా 70 పరుగులు చేశాడు.
ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మాథ్యూ ఎబ్డెన్, భారత్‌కు చెందిన రోహన్ బోపన్న జోడీ ఫైనల్స్‌కు చేరుకుంది. సెమీస్‌లో ఈ జోడీ చెక్ రిపబ్లిక్‌కు చెందిన టోమస్ మఖచ్, చైనాకు చెందిన జాంగ్ జిజెన్‌లను ఓడించింది.
మూడు సెట్లలో బోపన్న, మాథ్యూ ఎబ్డెన్ జోడీ 6-6, 3-6, 7-6 తేడాతో టోమస్ మఖచ్, జాంగ్ జిజెన్‌లను ఓడించింది.
సెమీఫైనల్స్‌కు చేరడం ద్వారా బోపన్న-మాథ్యూలు పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నంబర్ వన్‌గా నిలిచారు.

ఫొటో సోర్స్, UGC
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించామని తెలంగాణ ఏసీబీ తెలిపింది.
శివబాలకృష్ణ నివాసంతో పాటు, సమీప బంధువులు, స్నేహితులు, సహచర ఉద్యోగుల ఇళ్లు సహా 17 ప్రదేశాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచి ఏసీబీ సోదాలు నిర్వహించింది.
ఆయన ఇంట్లో 84 లక్షల 60 వేల రూపాయల నగదు, 2 కిలోల బంగారం, 5.5 కిలోల వెండి, 32 లక్షలు విలువైన వాచ్‌లు, ఖరీదైన ఫోన్లు దొరికాయని ఏసీబీ అధికారులు తెలిపారు.
శివబాలకృష్ణకు మూడు విల్లాలు, మూడు ఫ్లాట్లు, 90 ఏకరాల భూమి ఉన్నట్టు గుర్తించామని చెప్పారు.
ఆయన పేరుతో పాటు బినామీల పేర్లపై కూడా భూములున్నట్లు గుర్తించామన్నారు. శివబాలకృష్ణను కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ అధికారులు చెప్పారు.
శివబాలకృష్ణ గతంలో హెచ్‌ఎండీఏలో టౌన్ ప్లానింగ్ విభాగం డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం మెట్రో రైల్ ప్లానింగ్ అధికారిగా, రెరా సెక్రటరీగా పని చేస్తున్నారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.