ఆస్కార్ అవార్డుల్లో 13 నామినేషన్లు దక్కించుకున్న ఒపెన్‌హైమర్

96వ ఆస్కార్ అవార్డులకు నామినేష‌న్స్‌ను ప్ర‌క‌టించారు. క్రిస్టోఫ‌ర్ నోల‌న్ 'ఓపెన్‌హైమ‌ర్' చిత్రం 13 నామినేష‌న్స్ దక్కించుకుంది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. అయోధ్య: శ్రీరాముడిని గెలిపించిన 'రామ్‌లల్లా' ఎవరో తెలుసా?

  3. విరాట్ కోహ్లీ హైదరాబాద్ టెస్టుకు దూరం కావడం ఇంగ్లండ్‌కు టానిక్‌లా పని చేస్తుందా?

  4. క్యాన్సర్‌ను జయించిన ఈ మహిళలు క్యాలెండర్ కోసం ఇలా ఎందుకు పోజులిచ్చారు?

  5. అయోధ్య: రోడ్ల విస్తరణలో దుకాణాలు కోల్పోయిన వ్యాపారుల పరిస్థితేంటి?

  6. బ్రేకింగ్ న్యూస్, యుక్రెయిన్ సరిహద్దుల్లో కూలిన రష్యా మిలిటరీ విమానం

    కూలిన రష్యా విమానం

    ఫొటో సోర్స్, RUSSIAN TELEGRAM

    రష్యాకు చెందిన ఇల్యూషిన్-76 మిలిటరీ రవాణా విమానం యుక్రెయిన్ సరిహద్దులోని దక్షిణ బెల్‌గోరోడ్ ప్రాంతంలో కూలిపోయింది.

    అందులోని 65 మంది చనిపోయారని రక్షణ మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ రష్యా మీడియా కథనాలు పేర్కొన్నాయి.

    బందీలైన యుక్రెయిన్ సాయుధ బలగాల సభ్యులు కూడా ఆ విమానంలో ఉన్నట్లు రియా నోవోస్తీ అనే వార్తా సంస్థ చెప్పింది.

    ఈ ఘటన గురించి తనకు తెలిసిందని చెప్పిన రీజినల్ గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్‌కోవ్ తదుపరి వివరాలేమీ వెల్లడించలేదు.

    స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటల సమయంలో యాబ్లోనోవా గ్రామం సమీపంలో ఒక విమానం కిందకు పడిపోతుండటం తర్వాత పేలుడు సంభవించినట్లుగా సోషల్ మీడియాలో ఉన్న ఒక వీడియో చూపుతోంది.

  7. లోక్‌సభ ఎన్నికలకు ఒంటరిగానే : మమత ప్రకటన

    mamata

    ఫొటో సోర్స్, ani

    రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు.

    ‘‘సీట్ల పంపకంపై మేం ఎవరితో మాట్లాడం’’ అని మమత బుధవారం చెప్పారు.

    ‘‘ఆయన భారత జోడో యాత్ర చేస్తున్నారు. ఆయన కనీసం దీదీ నేను మీ రాష్ట్రానికి వస్తున్నాను. అని నాతో ఓ మాట చెప్పాల్సి ఉంది. కానీ నాకు వారేమీ చెప్పలేదు. మేం ఇండియా కూటమిలో భాగస్వాములం. కానీ బెంగాల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. ఎన్నికల తరువాత దేశస్థాయిలో ఏం చేయాలనేది నిర్ణయిస్తాం. మాది లౌకిక పార్టీ. మేం బీజేపీని ఎదుర్కోగలం’’ అని చెప్పారు.

    పశ్చిమ బెంగాల్లో 42 లోక్‌సభ సీట్లున్నాయి. 2019 ఎన్నికల్లో టీఎంసీ 22 సీట్లు గెలచుకోగా, బీజేపీ 18 స్థానాల్లో గెలిచింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  8. అస్సాం రైఫిల్స్ సైనికుడి కాల్పులు : ఆరుగురు జవాన్లకు గాయాలు

    అస్సాం రైఫిల్స్

    ఫొటో సోర్స్, Getty Images

    మణిపుర్‌లో అస్సాం రైఫిల్స్ ‌కు చెందిన సైనికుడు తన తోటి సైనికులపై కాల్పులు జరిపాడు.

    ఈ ఘటనలో ఆరుగురు సైనికులు గాయపడినట్లు మణిపుర్ పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.

    ‘దక్షిణ మణిపుర్‌లో భారత్, మయన్మార్ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న అస్సాం రైఫిల్స్ సైనికుడు ఒకరు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు సహచర సైనికులు గాయపడ్డారు. గాయపడినవారిలో ఎవరూ మణిపుర్‌కు చెందినవారు లేరు. కాల్పులు జరిపిన సైనికుడు అనంతరం తనను తాను కాల్చుకున్నాడు. క్షతగాత్రులందరూ సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అందరి ఆరోగ్యం స్థిరంగా ఉంది’’ అని పోలీసులు ఆ ప్రకటనలో తెలిపారు.

    ఈ ఘటనను మణిపుర్ హింసతో ముడిపెట్ట వద్దని పోలీసులు కోరారు.

  9. చిప్స్, కూల్ డ్రింక్స్‌తో ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉంటుంది, పూర్తిగా మానేయాలా? ఎంత తినొచ్చు

  10. టీచర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలన్న ప్రభుత్వ నిర్ణయం ఎందుకు వివాదాస్పదమైంది

  11. ఆస్కార్ అవార్డుల్లో 13 నామినేషన్లు దక్కించుకున్న ఒపెన్‌హైమ‌ర్

    ఓపెన్ హైమర్ చిత్రం

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, ఓపెన్ హైమర్ చిత్రం

    96వ ఆస్కార్ అవార్డులకు అకాడమీ నామినేష‌న్స్‌ను ప్ర‌క‌టించింది.

    2023లో విడుదలైన క్రిస్టోఫ‌ర్ నోల‌న్ చిత్రం 'ఒపెన్‌హైమ‌ర్' 13 నామినేష‌న్స్ దక్కించుకుంది. నోలన్ తీసిన సినిమాలు గతంలో ఐదుసార్లు నామినేషన్లలో చోటు దక్కించుకున్నా, ఆస్కార్ రాలేదు. అంతేకాదు ఉత్తమ దర్శకుడి కేటగిరీలో ఆయన రెండో సారి నామినేషన్ దక్కించుకున్నారు. 2018లో డంక్రిక్ సినిమాకు గానూ నోలన్‌కు నామినేషన్ దక్కింది.

    ఇక 96వ ఆస్కార్ అవార్డులకు ఉత్తమ చిత్రం కేటగిరీలో బార్బీ, ఒపెన్‌హైమర్, కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, పూర్ థింగ్స్ తో పాటు మరో ఆరు చిత్రాలు బరిలో నిలిచాయి.

    ఉత్తమ దర్శకులుగా క్రిస్టోఫర్ నోలన్ (ఒపెన్‌హైమర్), జస్టిన్ ట్రైట్ ( అనాటమీ ఆఫ్ ఏ ఫాల్), మార్టిన్ స్కోర్సెస్ (కిల్లర్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్), యార్గోస్ లాంతిమోస్ (పూర్ థింగ్స్) జోనాథన్ గ్లేజర్ (ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్)లు నిలిచారు.

    ఉత్తమ నటి విభాగంలో అనెట్టే బెనింగ్ (న్యాడ్), లిలీ గ్లాడ్ స్టోన్ (కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్), శాండ్రా హల్లర్ (అనాటమీ ఆఫ్ ఏ ఫాల్), కేరీ ముల్లిగాన్ (మాయెస్ట్రో), ఎమ్మా స్టోన్- (పూర్ థింగ్స్)లకు చోటు దక్కింది.

    ఉత్తమ నటుల విభాగంలో బ్రాడ్లే కూపర్ (మాయెస్ట్రో), కోల్మన్ డొమింగో (రస్టిన్), పాల్ గియామాటి (ది హోల్డోవర్స్), సిలియాన్ మర్ఫీ (ఒపెన్‌హైమర్), జెఫ్రీ రైట్ (అమెరికన్ ఫిక్షన్)లకు నామినేషన్లలో చోటు దక్కింది.

    2024 మార్చి 10వ తేదీన ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది.

  12. శుభోదయం

    బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్‌డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.