అమెరికా: ఇలినాయిస్‌ లో కాల్పులు, రెండు ఇళ్లలో ఏడుగురు మృతి, అనుమానితుడి కోసం గాలింపు

అమెరికా ఇలినాయిస్‌లో ఓ అనుమానితుడు జరిపిన కాల్పుల్లో రెండు ఇళ్లలో ఏడుగురు మరణించినట్లు అమెరికా పోలీసులు తెలిపారు. కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. బ్రేకింగ్ న్యూస్, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌కు భారత రత్న

    కర్పూరీ ఠాకూర్

    ఫొటో సోర్స్, RAMNATH THAKUR

    బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌ (మరణానంతరం)‌కు భారత అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ఇవ్వాలని కేంద్ర సర్కారు నిర్ణయించింది.

    వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన వ్యక్తిగా ఆయనకు పేరుంది.

    కర్పూరీ ఠాకూర్ 100వ జన్మదినోత్సవానికి ఒకరోజు ముందుగా భారత ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది.

    కర్పూరీ ఠాకూర్

    ఫొటో సోర్స్, ANI

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    దివంగత బిహార్ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు భారత రత్న ఇవ్వనున్నట్లుగా రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసిందని వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.

    సమస్తిపూర్‌లోని పిటౌజియా‌లో 1924 జనవరి 24న కర్పూరీ ఠాకూర్ జన్మించారు.

    ఆయన బిహార్‌కు ఒకసారి ఉప ముఖ్యమంత్రిగా, రెండు సార్లు ముఖ్యమంత్రిగా, దశాబ్దాల పాటు ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా పనిచేశారు.

  3. ముంబయి: ప్రాణప్రతిష్ట వేడుకల సందర్భంగా రాళ్ల దాడి జరిగిన ప్రాంతంలో బుల్డోజర్‌తో నిర్మాణాల తొలగింపు

    ముంబయి

    ఫొటో సోర్స్, ANI

    ముంబయిలోని మీరా రోడ్ ప్రాంతంలో అధికారులు బుల్డోజర్లతో నిర్మాణాలను తొలిగించారు. అక్కడ భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు.

    బీబీసీ మరాఠీ ప్రకారం, మీరా రోడ్‌లోని దాదాపు 15 నుంచి 20 రోడ్‌సైడ్ దుకాణాలపై బుల్డోజర్లను ఉపయోగించారు. ఈ దుకాణాలన్నీ అక్రమ నిర్మాణాలని అధికార యంత్రాంగం చెబుతోంది.

    ఈ దుకాణాలపై గతంలో రెండుసార్లు చర్యలు తీసుకున్నామని, మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా నోటీసులు కూడా ఇచ్చామని చెబుతున్నారు.

    ఇదే ప్రాంతంలో రెండు వర్గాల మధ్య హింస జరిగినట్లు వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

    బీబీసీ మరాఠీ కథనం ప్రకారం, కూల్చివేసిన దుకాణాలు, జనవరి 22న రామమందిరం ప్రాణ ప్రతిష్ట తర్వాత ఇక్కడ జరిగిన అల్లర్లలో ప్రేమేయం ఉన్నవారివా? కాదా? అనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదు.

    ఈ కేసులో 13 మందిని అరెస్టు చేశామని, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం తెలిపారు.

    రామమందిర ప్రాణ ప్రతిష్ట వేడుకల సందర్భంగా రాళ్ల దాడి జరిగిన మీరా రోడ్ ఏరియాలోని దుకాణాలను బుల్డోజర్లతో కూల్చేస్తున్నట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ ఒక వీడియోను పంచుకుంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. ప్రధాని మోదీ రాముడి గురించి మాట్లాడారా, రాజకీయాలు మాట్లాడారా?

  5. సుభాష్‌చంద్రబోస్: ‘మై డార్లింగ్, నువ్వు నా హృదయరాణివి’ అంటూ బోస్ ఎవరికి ప్రేమలేఖలు రాశారు?

  6. 'నా బిడ్డను ఎవరూ టెర్రరిస్ట్ అనకూడదు' -ఇస్లామిక్ స్టేట్‌లో పదేళ్ళు నరకం అనుభవించి స్వదేశం చేరుకున్న ఫాతిమా

  7. అమెరికాలో తొలిసారిగా నైట్రోజన్‌తో మరణ శిక్ష అమలుకు యత్నం.. ఇది అమానవీయమన్న ఐరాస

  8. భారత్ జోడో న్యాయ్ యాత్ర: కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణ

    రాహుల్ గాంధీ

    ఫొటో సోర్స్, Getty Images

    అస్సాంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణ పరిస్థితులు నెలకొన్నాయి.

    అస్సాంలోని జోరావత్‌లో కాంగ్రెస్ కార్యకర్తలను ముందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ బారికేడ్లను కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు.

    గువాహటికి వెళ్లే అన్ని రహదారులలో బారికేడ్లను ఏర్పాటు చేశారు.

    ఈ బారికేడ్లను దాటుకుని ముందుకు వెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. ‘రాహుల్ గాంధీ జిందాబాద్’ అనే నినాదాలు చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    తాము బారికేడ్లను మాత్రమే పగులగొట్టామని, చట్టాన్ని కాదని రాహుల్ అన్నారు.

    అస్సాం ముఖ్యమంత్రి, హోం మంత్రి, ప్రధానమంత్రి చట్టాన్ని ఉల్లంఘించగలరని, కాంగ్రెస్ అలాంటి పనిని ఎప్పటికీ చేయదని రాహుల్ అన్నారు.

    ‘‘మేం బలహీనంగా ఉన్నామని మీరు ఊహించవద్దు. కాంగ్రెస్ కార్యకర్తలు సింహాలు’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  9. వైసీపీకి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా, శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం

    లావు శ్రీకృష్ణదేవరాయలు

    ఫొటో సోర్స్, FB/SriKrishnaLavu

    ఫొటో క్యాప్షన్, లావు శ్రీకృష్ణదేవరాయలు (ఫైల్ ఫోటో)

    నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తన పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు.

    ఇప్పటికే కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ వైసీపీని వీడగా, తాజాగా ఈయన రాజీనామా చేశారు.

    గడిచిన 15 రోజులుగా రాజకీయంగా సందిగ్ధ పరిస్థితి ఏర్పడడంతో దాన్ని తొలగించేందుకు తాను పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్టు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు.

    తన స్థానంలో కొత్త అభ్యర్థిని పార్టీ అధిష్టానం ప్రతిపాదించిందని, దానివల్ల క్యాడర్‌లో అనిశ్చితి ఏర్పడిందని ఆయన చెప్పారు.

    తన భవిష్యత్తు రాజకీయ కార్యాచరణకు సంబంధించి త్వరలోనే నిర్ణయాన్ని తీసుకుంటానని తెలిపారు.

    శ్రీకృష్ణదేవరాయలు 2019 ఎన్నికల్లో తొలిసారిగా పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగారు. ఎంపీగా గెలిచి నియోజకవర్గంలోని పలు సమస్యల పరిష్కారం పని చేశారు.

    వరికపూడిసెల వంటి ప్రాజెక్టుల అనుమతుల మంజూరులో ఆయన క్రియాశీలకంగా ఉన్నారు.

  10. బటర్ చికెన్, దాల్ మఖనీ వంటకాలు ఎవరు కనిపెట్టారు? తేల్చనున్న దిల్లీ హైకోర్టు

  11. ఆంధ్రప్రదేశ్‌లో సమ్మె విరమించిన అంగన్‌వాడీ కార్యకర్తలు, శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం

    ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి

    ఫొటో సోర్స్, CMO Andhra Pradesh

    వేతనాలు పెంచాలంటూ, తమ ఇతర సమస్యలను పరిష్కరించాలంటూ.. 42 రోజుల పాటు సమ్మె నిర్వహించిన అంగన్‌వాడీ కార్యకర్తలు ఎట్టకేలకు దిగి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో సమ్మె విరమణకు అంగీకరించారు.

    అంగన్‌వాడీలు ప్రభుత్వం ముందు ఉంచిన 13 డిమాండ్లలో 10 నెరవేర్చేందుకు అంగీకరించడంతో సమ్మె విరమిస్తున్నట్టు ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కే సుబ్బారావమ్మ చెప్పారు.

    అంగన్‌వాడీ కార్యకర్తల నిరసన

    ఫొటో సోర్స్, GETTY IMAGES

    ఫొటో క్యాప్షన్, అంగన్‌వాడీ కార్యకర్తల నిరసన(ఫైల్ ఫోటో)

    మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలతో జరిపిన చర్చల్లో వచ్చే జులై నుంచి వేతనాలు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించిందని సుబ్బారావమ్మ తెలిపారు.

    సమ్మె కాలంలో వేతనం చెల్లించేందుకు, ప్రభుత్వం పెట్టిన పలు కేసులు ఉపసంహరించుకునేందుకు అంగీకరించిందని చెప్పారు.

    రాతపూర్వక హామీలు రావడంతోనే సమ్మె విరమణకు అంగీకరించామని తెలిపారు.

    మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సమ్మెలో ఉన్న అంగన్‌వాడీ సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది.

    ఈ ఉత్తర్వుల విడుదల నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి వరకు చర్చలు జరిగాయి.

    చివరకు ఇరువర్గాలు అంగీకారానికి రావడంతో 42 రోజుల సమ్మెకు తెరదించినట్టయింది.

  12. అమెరికా: ఇలినాయిస్‌లో కాల్పులు, రెండు ఇళ్లలో ఏడుగురు మృతి

    కాల్పుల ఘటన

    ఫొటో సోర్స్, CBS NEWS

    అమెరికా ఇలినాయిస్‌లో ఓ అనుమానితుడు జరిపిన కాల్పుల్లో రెండు ఇళ్లలో ఏడుగురు మృతి చెందినట్లు అమెరికా పోలీసులు తెలిపారు.

    జోలియట్‌లో సోమవారం మధ్యాహ్నం ఈ కాల్పులు జరిగాయి. కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్న వ్యక్తి కోసం ప్రస్తుతం పోలీసులు వెతుకుతున్నారు.

    జోలియట్ నగరంలో జరిగిన కాల్పుల్లో 23 ఏళ్ల రోమియో నాన్స్‌కు సంబంధం ఉన్నట్లు తాము భావిస్తున్నామని, ఆయన కోసం వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు.

    మాడిసన్ స్ట్రీట్‌కు దగ్గర్లో వెస్ట్ ఎకర్స్ రోడ్డు 2200 బ్లాక్‌లో ఉన్న రెండు ఇళ్లల్లో ఏడుగురు మృతి చెందినట్లు జోలియట్ పోలీసు చీఫ్ బిల్ ఎవాన్స్ చెప్పినట్లు సీబీఎస్ న్యూస్ రిపోర్టు చేసింది.

    రోమియో నాన్స్

    ఫొటో సోర్స్, JOLIET POLICE DEPARTMENT/X

    పలువురు కాల్పుల్లో మరణించినట్లు తమకు సమాచారం అందిందని, వెస్ట్ ఎకర్స్ రోడ్డులో సంఘటనా ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఏడు మృతదేహాలను గుర్తించామని పోలీసు అధికారులు తెలిపారు.

    కాల్పులు జరిపిన అనుమానితుడికి బాధితులు తెలుసని, ఆ వ్యక్తి కూడా అదే బ్లాక్‌లో నివాసం ఉండేవాడని పోలీసు అధికారులు చెప్పారు.

    బాధితులందరూ కూడా ఒకే కుటుంబానికి చెందినవారని భావిస్తున్నామని తెలిపారు. ఈ దాడి వెనుకాల ఉన్న ఉద్దేశ్యం ఇంకా తెలియ లేదన్నారు.

  13. అయోధ్య రామాలయం: ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది ఆలయాల ఆర్కిటెక్చర్ భిన్నంగా ఎందుకు ఉంటుంది?